BusinessGold Price Today : భారీగా పెరిగిన...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

AP Mandal Wise Surplus Teachers List 2026: Check District & Mandal Details

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మరియు ఉపాధ్యాయుల బదిలీలు (AP Teachers Transfers) లేదా...

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

సుప్రీంకోర్టు తీర్పు: టెట్ (TET) అర్హత గడువు 2028 వరకు పొడిగింపు | Supreme Court TET Verdict

సుప్రీంకోర్టు తీర్పు: ఉపాధ్యాయులకు టెట్ (TET) అర్హత గడువు పొడిగింపు ఉపాధ్యాయ అర్హత...

Gold Price Today : భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం గోల్డ్ రేటు ఎంతంటే?

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Gold and Silver Price Today : బంగారం, వెండి ధరలు కొనుగోలుదారులకు బిగ్ షాకిచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్ లో పెరిగిన డిమాండ్, దేశీయంగా నగల వర్తకుల నుంచి ఊపందుకున్న కొనుగోళ్లు పసిడి విలువను పైపైకి తీసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో బుధవారం బంగారం ధర భారీగా పెరిగింది. 24 క్యారట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 980 పెరిగింది. 22 క్యారట్ల గోల్డ్ పై రూ. 900 పెరిగింది. అదేవిధంగా వెండి ధరసైతం భారీగా పెరిగింది. ఇవాళ ఒక్కరోజు కిలో వెండిపై వెయ్యి పెరిగింది. దీంతో కిలో వెండి ధర రూ. లక్ష దాటేసింది.

gold

  • తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
    తెలుగు రాష్ట్రాల్లో బుధవారం బంగారం ధర భారీగా పెరిగింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,750కాగా.. 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ ధర రూ.75,000.
  • దేశంలోని ప్రధాన నగరాల్లో ..
    దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.68,900 కాగా, 24క్యారట్ల 10 గ్రాములు బంగారం రూ. 75,150.
    ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.68,750 కాగా, 24క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 75,000.
    చెన్నైలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.69,200 కాగా.. 24క్యారెట్ల గోల్డ్ ధర రూ. 75,490కు చేరింది.

gold

  • వెండి ధర ఇలా ..
    దేశ వ్యాప్తంగా బుధవారం వెండి ధర భారీగా పెరిగింది. కిలో వెండిపై రూ. వెయ్యి పెరిగింది. దీంతో ఉదయం నమోదైన వివరాల ప్రకారం..
    తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 1,00,500.
    దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే..
    చెన్నైలో కిలో వెండి ధర రూ.1,00,500.
    కోల్ కతాలో కిలో వెండి ధర రూ. 96,000 వద్ద కొనసాగుతుంది.
    ముంబయి, ఢిల్లీ ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ.96,000.
    బెంగళూరులో కిలో వెండిపై రూ. 500 పెరిగింది. దీంతో అక్కడ ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 94,750 వద్దకు చేరింది.gold rate
  • పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 10 గంటలకు నమోదైనవి. ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.

 

Source: 10TV Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this