BusinessGold Price Today : మహిళలకు అదిరిపోయే...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

Gold Price Today : మహిళలకు అదిరిపోయే న్యూస్‌.. తగ్గిన బంగారం ధర.. సోమవారం తులం ఎంతంటే?

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Gold Price Today : బంగారాన్ని కేవలం ఆభరణంగానే కాకుండా పెట్టుబడిగా చాలామంది భావిస్తుంటారు. అందుకే ప్రతిరోజూ బంగారం ధరపై ఎక్కువమంది ఆసక్తి చూపిస్తుంటారు. అయితే, గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర ఒక్కసారిగా తగ్గుముఖం పడుతోంది. బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత తులం బంగారం ధర రూ. 10 వేల వరకు తగ్గడంతో బంగారం కొనే వాళ్ల సంఖ్య విపరీతంగా పెరిగింది.

ఈ క్రమంలో బంగారం కొనుగోలు చేసేందుకు ఇదే సరైన సమయమని నిపుణులు సూచిస్తున్నారు. సోమవారం బంగారం ధరలో స్వల్ప తగ్గుదల కనిపించింది. అయితే రానున్న రోజుల్లో బంగారం ధర మరింత తగ్గే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. 24 క్యారెట్ల ధర రూ. 65 వేలకు చేరొచ్చని చెబుతున్నారు. మరి సోమవారం దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం..

Value Gold: బంగారం అమ్మాలనుకునే వారికి గుడ్‌ న్యూస్‌.. మొబైల్‌ ఆఫీస్‌ వచ్చేస్తోంది..

Gold Price Today దేశరాజధాని న్యూఢిల్లీలో ఆదివారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 63,390లు ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 69,140ల వద్ద కొనసాగుతోంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.63,240లు ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 68,990గా నమోదైంది. అలాగే చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 64,640కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 70,520 వద్ద కొనసాగుతోంది. బెంగళూరు విషయానికొస్తే ఇక్కడ 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 63,240కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 68,990 వద్ద కొనసాగుతోంది.

Gold Price Today

తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే..

Gold Price Today హైదరాబాద్‌లో ఆదివారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 63,240గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 68,990 వద్ద కొనసాగుతోంది. అలాగే విజయవాడతో పాటు, విశాఖపట్నంలోనూ 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 63,240, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 68,990గా నమోదైంది.

వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

ఆదివారం వెండి ధరల్లోనూ ఎలాంటి మార్పు కనిపించలేదు. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో దేశ రాజధాని న్యూఢిల్లీతో పాటు ముంబయి, పుణెలో కిలో వెండి ధర రూ. 84,400కి చేరింది. అలాగే చెన్నై, హైదరాబాద్‌, కేరళ, విజయవాడ, విశాఖలో అత్యధికంగా కిలో వెండి ధర రూ. 88,900ల వద్ద కొనసాగుతోంది.

Source: TV9 Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this