BusinessValue Gold: బంగారం అమ్మాలనుకునే వారికి గుడ్‌...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

Value Gold: బంగారం అమ్మాలనుకునే వారికి గుడ్‌ న్యూస్‌.. మొబైల్‌ ఆఫీస్‌ వచ్చేస్తోంది..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Value Gold భారతీయులను, బంగారాన్ని విడదీయలేని పరిస్థితి ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా.. బంగారం అండగా నిలుస్తుందనే ధైర్యంతో ఉంటారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైన సందర్భాల్లో బంగారాన్ని అమ్ముకునే అవకాశం ఉంటుంది. అయితే బంగారాన్ని ఎక్కడ విక్రయించాలో తెలియక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారి కోసమే వాల్యూ గోల్డ్‌ కంపెనీ ఒక సదవకాశాన్ని తీసుకొచ్చింది. కాప్స్ గోల్డ్‌కు చెందిన ఈ సంస్థ గోల్డ్‌ విక్రయించే వారికి సదవకాశాన్ని తీసుకొచ్చింది.

ప్రస్తుతం బంజారాహిల్స్‌, సికింద్రాబాద్‌, ఉప్పల్, కూకట్‌పల్లి, చింతల్‌లో వాల్యు గోల్డ్‌ బ్రాంచీలు ఉండగా.. తాజాగా ఈ సంస్థ ప్రజల వద్దకే సేవలు అందించేదుకు మొబైల్‌ సేవలను అందిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ మొబైల్ వాహనం ప్రస్తుతం వరంగల్‌కు వచ్చింది. ఈ మొబైల్ ఆఫీస్‌లో మీ బంగారాన్ని సులభంగా విక్రయించుకోవచ్చు. మీ గోల్డ్ నాణ్యతను పరీక్షించి తక్షణమే డబ్బును పొందొచ్చు. తాకట్టు బంగారాన్ని విడుదల చేయడంతో పాటు ఆ రోజు మార్కెట్‌కు బంగారాన్ని కొని మిగిలిన డబ్బును తక్షణమే ఇచ్చేస్తారు.

ఈ విషయమై వాల్యూ గోల్డ్‌ సీఈఓ శ్రీ భరద్వాజ్‌ పంపత్వార్‌ మాట్లాడుతూ.. ‘మా సేవలను ముందుగా వరంగల్‌కు ఆ తర్వాత మహమూబాబాద్‌కు విస్తరించడం చాలా సంతోషంగా ఉంది. పారదర్శకంగా బంగారు కొనుగోలు చేయడం మా లక్ష్యం. ప్రజలు ఈ మొబైల్‌ ఆఫీసులో తమ బంగారు నగల స్వచ్ఛత పరీక్షను ఉచితంగా చేయించుకోవచ్చు. మా బంగారం కొనుగోలు ప్రక్రియ అంతా ఆటోమెటెడ్‌గా ఉంఉది. ఇందుకోసం అధునాతన యంత్రాలను ఉపయోగిస్తున్నాము. కరీంనగర్‌లో ఈ మైబైల్ ఆఫీస్‌ విజయవంతం కావడంతో వరంగల్‌లో ప్రారంభిస్తున్నాము. తెలంగాణలోని అన్ని గ్రామాలకు ఈ సేవలను విస్తరించడమే మా లక్ష్యం. ఈ వాహనంలో మంచి నాణ్యతతో కూడిన బంగారం, వెండి నాణేలను విక్రయిస్తాం’ అని చెప్పుకొచ్చారు.

వాహనం ఎక్కడికి వస్తుందంటే..

కాగా ఈ మొబైల్‌ వాహనం ఈనెల 21వ తేదీన వరంగల్‌లో రోడ్‌ షో నిర్వహించనున్నారు. అనంతరం 22వ తేదీ నుంచి 30 తేదీ వరకు కేఆర్‌ గార్డెన్‌లో వాహనం ప్రజలకు అందుబాటులో ఉంటుంది. అలాగే ఆగస్టు 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు మహబూబాబాద్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో అందుబాటులో ఉండనుంది.

Source: TV9 Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this