Saturday, June 21, 2025
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
EntertainmentAct 1978 OTT : సైలెంట్ గా...

AP Teacher Transfers SGT Transfer Orders 2025 Released. Download Now

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025 సంవత్సరానికి SGT మరియు ఇతర ఉపాధ్యాయుల బదిలీ...

AP Teacher Transfers 2025 FAQs

AP Teacher Transfers 2025 FAQs మరియు వాటి సమాధానాలు ఇక్కడ...

Teacher Transfers 2025: ఆంధ్రప్రదేశ్‌లో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు!

ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖలో టీచర్ల బదిలీలకు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రకటన...

విద్యారంగంలో నవశకం: Andhra Pradesh Teacher Transfers 2025 – ఉపాధ్యాయులకు గొప్ప ఊరట!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. 2025...

Act 1978 OTT : సైలెంట్ గా OTT లోకి రామ్‌గోపాల్ వ‌ర్మ‌ హీరోయిన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Table of contents [hide]

Act 1978 OTT ఈ మధ్య ఓటీటీ లో కొన్ని సినిమాలు సైలెంట్ గా స్ట్రీమింగ్ కు వచ్చేసి ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తూ ఉంటుంది. అందులోను ప్రస్తుతం ఓటీటీలో సోసియో ఫాంటసి థ్రిల్లర్ మూవీస్ కు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉన్నారు. ఈ క్రమంలో మరొక ఇంట్రెస్టింగ్ మూవీ సైలెంట్ గా ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఆ మూవీ మరేదో కాదు.. రామ్ గోపాల్ వర్మ రూపొందించిన లక్ష్మిస్ ఎన్టీఆర్ మూవీలో లక్ష్మి పార్వతి పాత్రలో నటించిన.. య‌జ్ఞ శెట్టి.. హీరోయిన్ గా చేసిన మూవీ.. యాక్ట్ 1978. ఈ సినిమా ప్రస్తుతం సైలెంట్ గా ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. మరి ఈ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది, మూవీకి సంబంధించిన మరిన్ని విషయాలను చూసేద్దాం.

Act 1978 OTT

Act 1978 OTT ఇదొక కన్నడ మూవీ.. ఈ సినిమాకు మంజునాథ సోమ‌కేశ‌వ రెడ్డి దర్శకత్వం వహించారు. కాగా ఈ సినిమాలో సంచారీ విజ‌య్‌, శృతి, అచ్యుత్ కుమార్ ముఖ్య పాత్రలలో నటించారు. ఈ సినిమా 2020 లోనే థియేటర్ లో రిలీజ్ అయింది. కానీ ఆ సమయంలో ఈ సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. ఇక నాలుగేళ్ల తర్వాత ఈ సినిమా ఓటీటీ లోకి రావడం విశేషం. ఇక ఈ సినిమాలో యజ్ఞ శెట్టి నటన విషయానికొస్తే.. సినిమాలో తన పాత్రకు ప్రాణం పెట్టి నటించిందని చెప్పి తీరాలి. పైగా ఈ ఏడాది.. క‌న్న‌డంలో ఉత్త‌మ న‌టిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు కూడా అందుకుంది. ఈ సినిమా ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ లో సైలెంట్ గా స్ట్రీమింగ్ అవుతుంది. కాబట్టి ఎంచక్కా ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేసేయండి.

Horror OTT నిద్రపోతే కలలోకి వచ్చి చంపేసే సైకో కిల్లర్.. OTT లో వణుకుపుట్టించే సైకో థ్రిల్లర్

ఇక ఈ Act 1978 OTT కథ విషయానికొస్తే.. ఈ సినిమాలో యజ్ఞ శెట్టి భర్త చనిపోతాడు . దీనితో వింతంతువు అయినా ఆమెకు ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటిస్తుంది. ఆ ఆర్ధిక సహాయం కోసం ఆమె ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగి విసిగిపోతుంది. ఆమె తన కష్టాలను చెప్పినా కానీ ఎవరు పట్టించుకోరు. లంచం ఇస్తేనే ఆమెకు రావాల్సిన డబ్బులను ఇస్తామని చెప్తూ ఉంటారు. దీనితో అప్పటికే విసిగిపోయిన ఆమె.. ఆ ప్రభుత్వ అధికారులకు ఎలాగైనా బుద్ధి చెప్పాలని డిసైడ్ అవుతుంది. ఆమె తన ఒంటికి బాంబు ధరించి ప్రభుత్వ ఆఫీస్ కు వెళ్తుంది. అక్కడ అధికారులను బందీలను చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది ? ఆమె తానూ అనుకున్నట్లుగా అధికారులకు బుద్ధి చెప్పిందా లేదా ? చివరికి ఏమైంది అనేది తెరపై చూడాల్సిన కథ. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Source: iDreampost


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this