Telanganaపార్టీ మార్పుపై పెదవి విప్పని బీఆర్‌ఎస్‌ సీనియర్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

పార్టీ మార్పుపై పెదవి విప్పని బీఆర్‌ఎస్‌ సీనియర్ నేత.. ఎందుకీ మౌనం, కారణమేంటి?

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Gossip Garage : సీనియర్‌ బీఆర్‌ఎస్‌ నేత సైలెన్స్‌ వెనుక రీజనేంటి? ఎప్పుడూ తన మార్కు పాలిటిక్స్‌తో హల్‌చల్‌ చేసే ఆ సీనియర్‌ లీడర్‌… గప్‌చుప్‌గా ఎందుకుంటున్నారు? అధినేత కేసీఆర్‌తో సంబంధాలు గడప దాటనీయడం లేదా? ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో గత పరిచయాలు మార్పు కోసం ప్రేరేపిస్తున్నాయా? ఇటు ఉండాలా.. అటు వెళ్లాలో తేల్చుకోలేక సందిగ్ధానికి గురవుతున్నారా? ఇంతకీ ఎవరా లీడర్‌..? ఆయన కన్ఫూజన్‌కు కారణమేంటి?

అధినేత నమ్మకాన్ని చూరగొన్న నేత..
ఉమ్మడి ‌కరీంనగర్ జిల్లాలో మాజీ మంత్రి గంగుల కమలాకర్ రాజకీయ భవిష్యత్‌పై ఆసక్తికర చర్చ జరుగుతోంది. జిల్లాలో బలమైన బీసీ నేత గంగుల. బీసీ వర్గాలలో మంచి పట్టున్న లీడర్‌గా బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్, కేటీఆర్‌ దగ్గర గుర్తింపు తెచ్చుకున్నారు గంగుల. ఆ ఇద్దరికి నమ్మిన బంటుగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో చక్రం తిప్పారు. గంగులకు ఏ పని అప్పగించినా, దాన్ని విజయవంతం చేయడానికి కష్టపడి పనిచేస్తారని కూడా చెబుతుంటారు. అలా అధినేత నమ్మకాన్ని చూరగొన్న గంగుల.. ప్రస్తుతం పార్టీ అధినాయకత్వానికి అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. జిల్లాలోనూ పార్టీతో పెద్దగా సంబంధం లేదన్నట్లే వ్యవహరిస్తున్నారు.

సందేహాలకు తావిస్తున్న గంగుల తీరు..
మాజీ సీఎం కేసీఆర్‌కు కరీంనగర్‌ జిల్లా అంటే ప్రత్యేక సెంటిమెంట్‌గా చెబుతారు. అలాంటి జిల్లాలో గంగులకు పెద్దరికం అప్పగిస్తే.. ఇప్పుడు పార్టీ కష్టకాలంలో ఆయన ఉలుకూ పలుకూ లేకుండా గడపడమే చర్చనీయాంశమవుతోంది. ఉమ్మడి జిల్లాకు చెందిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నా… స్పందించకుండా సైలెంట్‌గానే ఉంటున్న గంగుల తీరు పలు సందేహాలకు తావిస్తోంది.

పార్టీని వీడుతానని గానీ, వీడనని గాని చెప్పడం లేదు..
ఎప్పుడూ హాట్‌హాట్‌ కామెంట్లు చేసే గంగుల ఇప్పుడు మౌనాన్ని ఆశ్రయించడం… ఆయన అనుచరులు కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. వాస్తవానికి గంగుల పార్టీ మారతారని చాలా రోజుల క్రితమే ఊహాగానాలు మొదలయ్యాయి. నెక్ట్స్‌ గంగులే అంటూ దాదాపు నెల రోజులుగా ఆయన పేరు ప్రచారంలో ఉంది. కానీ, తాను పార్టీని వీడుతానని గానీ, వీడనని గాని ఆయన స్పందించలేదు. తొలినాళ్లలో అధినేత కేసీఆర్‌ను కలిసిన గంగుల.. ఆ తర్వాత సైలెంట్‌ అయిపోయారు. ఆయన పేరు అలా ప్రచారంలో ఉండగానే.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు వరుసగా రోజుకొకరు చొప్పున కాంగ్రెస్‌లో చేరుతున్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నుంచి ఎవరూ ఊహించని విధంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్‌లో చేరారు. సంజయ్‌ పార్టీని వీడటంపై జిల్లాలోని కీలక నేతలంతా తప్పుపట్టారు. ఎమ్మెల్యేపై తీవ్ర విమర్శలు చేశారు. అప్పుడు కూడా పెదవి విప్పలేదు గంగులు.

రేవంత్‌ ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి వెనకడుగు..
బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేతల్లో ఒకరైన గంగుల… అధికారం కోల్పోయాక… పార్టీతో అంటీ ముట్టనట్లే వ్యవహరిస్తుండటం చర్చకు దారితీస్తోంది. బీఆర్‌ఎస్‌ ముఖ్యనేతలు అంతా ప్రభుత్వంపై ఏదో రూపంలో పోరాడుతుంటే.. గంగుల మాత్రం గప్‌చుప్‌గానే ఉంటున్నారు. దీనికి కారణం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో గంగులకు ఉన్న పరిచయాలేనా? అనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ మంత్రి గంగుల టీడీపీలో కలిసి పనిచేశారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య మంచి సంబంధాలే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి గంగుల వెనకడుగు వేస్తున్నారనే ప్రచారం కూడా ఉంది.

అసలు గంగుల అంతరంగం ఏమిటి?
ఈ పరిస్థితుల్లో గంగుల అంతరంగం ఏంటో అర్థం చేసుకోలేక బీఆర్‌ఎస్‌ క్యాడర్‌ తర్జనభర్జన పడుతోంది. ఇటు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌తోనూ… అటు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోనూ సత్సంబంధాలు కోరుకుంటున్న గంగుల… సైలెంట్‌గా ఉండటమే మేలనుకుంటున్నారా? అనే సందేహాలు ఎక్కువవుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్‌లో చేరేందుకు గంగుల ఆసక్తిగా ఉన్నా, మంత్రి పొన్నం కారణంగా…. ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం హుస్నాబాద్‌ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి పొన్నం కరీంనగర్‌లో పట్టుకోసం ప్రయత్నిస్తున్నారని అంటున్నారు.

పొన్నంతో ఆధిపత్య పోరే కారణమా?
కరీంనగర్‌లో వరుసగా గెలుస్తున్న గంగుల… పొన్నంతో ఆధిపత్య పోరు ఉంటుందనే ఉద్దేశంతో కాంగ్రెస్‌లో చేరికపై ఎటూ తేల్చుకోలేకపోతున్నారని అంటున్నారు. మరోవైపు గంగులపై జరుగుతున్న ప్రచారమంతా.. ఉట్టి గాసిప్పేనని తేల్చేస్తున్నారు ఆయన అనుచరులు. ఏదైనా సరే గంగుల మౌనవ్రతం వీడితేనే ఈ సస్పెన్స్‌కు తెరపడుతుంది. మరి ఆయన ఎప్పటి వరకు ఈ సస్పెన్స్‌ కొనసాగిస్తారో..? ఆయన అంతరంగం ఎప్పటికి ఆవిష్కరిస్తారో అనేది ఉత్కంఠ రేపుతోంది.

Source: 10TV Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this