RRR Movie: రామ్‌ ట్రైలర్‌ టీజ్‌ను విడుదల...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

AP Mandal Wise Surplus Teachers List 2026: Check District & Mandal Details

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మరియు ఉపాధ్యాయుల బదిలీలు (AP Teachers Transfers) లేదా...

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

RRR Movie: రామ్‌ ట్రైలర్‌ టీజ్‌ను విడుదల చేసిన భీమ్‌.. ఆకట్టుకుంటోన్న చెర్రీ లుక్స్‌..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 ప్రస్తుతం యావత్‌ భారతీయ సినిమా పరిశ్రమ ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’. దర్శకధీరుడు రాజమౌళి చారిత్రక నేపథ్యంతో ఈ పాన్ ఇండియా సినిమాను తెరకెక్కిస్తున్నారు.  మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోలుగా నటిస్తున్నారు. అలియా భట్‌, ఒలివియా మోరీస్‌, శ్రియా శరణ్‌, అజయ్‌ దేవ్‌గణ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కరోనా కారణంగా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. వచ్చే ఏడాది జనవరి 7న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రాన్ని తీసుకొచ్చేందుకు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. కాగా సినిమా విడుదల తేఈ దగ్గరపడుతోన్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్‌ కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే డిసెంబర్‌ 9న ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.కాగా ఈ సినిమాలో కొమురం భీమ్‌ పాత్రలో ఎన్టీఆర్‌, అల్లూరి పాత్రలో రామ్‌చరణ్‌ కనిపించనున్నారు. ఈక్రమంలో ట్రైలర్‌కు ముందే ప్రేక్షకులకు వరుస సర్‌ప్రైజ్‌లు ఇస్తోంది చిత్ర బృందం. సోమవారంసినిమాలోని ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కొత్త లుక్స్‌ను విడుదల చేసిన చిత్ర బృందం తాజాగా మరో వీడియోను పంచుకుంది.

కాగా ఈ వీడియోను ‘బ్రేస్ యువర్ సెల్ఫ్ ఫర్ రామ్’ అంటూ తన ట్విట్టర్‌లో షేర్‌ చేశాడు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌. ఇందులో భాగంగా ట్రైలర్‌లో రామ్‌చరణ్‌ పాత్రకు సంబంధించిన ఒక సన్ని వేశాన్ని కట్‌ చేసి ఈ వీడియోను రూపొందించారు. పోలీస్‌ డ్రెస్‌ ధరించిన చెర్రీ మంటల్లోంచి నడుచుకురావడం ఈ క్లిప్‌లో మనం చూడవచ్చు. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. రామ్‌చరణ్ లుక్స్‌కు అభిమానులు, నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Brace Yourself for RAM… @AlwaysRamCharan @ssrajamouli #RRRTraileronDec9th #RRRMovie pic.twitter.com/XPUQxmGsey

— Jr NTR (@tarak9999) December 7, 2021


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this