Prabhas: ఏపీ వరద బాధితులకు అండగా ప్రభాస్.....

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

AP Mandal Wise Surplus Teachers List 2026: Check District & Mandal Details

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మరియు ఉపాధ్యాయుల బదిలీలు (AP Teachers Transfers) లేదా...

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

సుప్రీంకోర్టు తీర్పు: టెట్ (TET) అర్హత గడువు 2028 వరకు పొడిగింపు | Supreme Court TET Verdict

సుప్రీంకోర్టు తీర్పు: ఉపాధ్యాయులకు టెట్ (TET) అర్హత గడువు పొడిగింపు ఉపాధ్యాయ అర్హత...

Prabhas: ఏపీ వరద బాధితులకు అండగా ప్రభాస్.. ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‏కు రూ. కోటి విరాళం..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 రాజమౌళి తెరకెక్కించిన బాహుహలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‍గా మారిపోయాడు ప్రభాస్. ప్రస్తుతం డార్లింగ్ చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్నాడు. ఇప్పుడు ప్రభాస్ చేస్తున్న సినిమాలన్ని భారీ బడ్జెట్‏తో కూడిన పాన్ ఇండియా చిత్రాలు కావడం విశేషం. బాలీవుడ్.. టాలీవుడ్.. కోలీవుడ్ ఇలా భాషతో సంబంధం లేకుండా టాప్ డైరెక్టర్స్ అందరూ ప్రభాస్‏తో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ప్రభాస్ పేరు వింటే చాలు .. డార్లింగ్ అంటూ గుండెల్లో గుడి కట్టుకుంటారు అభిమానులు. ప్రభాస్‏కు గర్ల్స్ ఫాలోయింగ్ ఎక్కువే ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇక ప్రభాస్ సినిమా అప్టేడ్స్ కోసం అభిమానులు సోషల్ మీడియాలో చేసే రచ్చ గురించి తెలిసిందే. ఇటీవల ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా పాట విడుదల తేదీ ప్రకటించి.. టెక్నికల్ సమస్య ఉందని విడుదల ఆలస్యం కావడంతో ఏకంగా పోలీస్ కంప్లైంట్ వరకు వెళ్లారు డార్లింగ్ ఫ్యాన్.

పాన్ ఇండియా స్టార్ అయినా కానీ.. ప్రభాస్.. కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటాడన్న సంగతి తెలిసిందే. అభిమానులకు ఆర్థికంగా సాయం చేయడమే కాకుండా.. ఆపదలో ఉన్నవారికి సాయం చేస్తుంటాడు. తాజాగా ఆంధ్రప్రదేశ్ వరద బాధితులకు అండగా ఉండేందుకు ముందుకు వచ్చాడు ప్రభాస్.ఇటీవల ఆంధ్రప్రదేశ్‏లో వరదలు ముంచేత్తిన సంగతి తెలిసిందే. దాదాపు నాలుగు జిల్లాలు వరదల దాటికి తీవ్రంగా నష్టపోయాయి. కాలువలు, నదులు పొంగిపోయాయి. చెట్లు, ఇళ్లూ కూలీపోయి ఆర్థికంగా తీవ్ర నష్టం వాటిల్లింది. వరదల దాటికి నష్టపోయిన వారిని ఆదుకునేందుకు ప్రభాస్ ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‏కు రూ. కోటి విరాళం ప్రకటించాడు. ఇందుకు సంబంధించిన చెక్కును త్వరలోనే సీఎం కార్యాలయానికి పంపనున్నారు.

Rebel Star #Prabhas Donated Rupees 1 CRORE Towards “AP CM Relief Fund”for #AndhraPradesh flood victims @AndhraPradeshCM . pic.twitter.com/Vduo1GI8T2

— BA Raju’s Team (@baraju_SuperHit) December 7, 2021

ఇక ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, వీడియోస్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇందులో విక్రమాదిత్యగా కనిపించబోతున్నారు ప్రభాస్..

prabhas: ఏపీ వరద బాధితులకు అండగా ప్రభాస్.. ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‏కు రూ. కోటి విరాళం..


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this