Monday, January 19, 2026
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
House on Moon: చంద్రుడిపై ఉన్న ఆ...

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక తరగతుల కోసం సమగ్ర మార్గదర్శి

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (APTET) 2025: సంపూర్ణ మార్గదర్శకాలు

పరిచయం:ఆంధ్రప్రదేశ్ప్రభుత్వం, రాష్ట్రంలో తరగతి 1 నుండి 8 వరకు ఉపాధ్యాయులుగా నియమితులవ్వాలనుకునే...

House on Moon: చంద్రుడిపై ఉన్న ఆ వింత ఆకారం ఏంటబ్బా.. వైరల్ అవుతున్న ఫోటోలు.. మిస్టరీని చేధించే పనిలో శాస్త్రవేత్తలు..!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 House on Moon: ఈ విశ్వంలో నవగ్రహాలతో పాటు మనకు తెలియని మరెన్నో గ్రహాలు, నక్షత్రాలు, గ్రహ శకలాలు.. ఇంకా ఎన్నో వింతలు విశేషాలు ఉన్నాయి. వాటిని పసిగట్టేందుకు ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలు పోటీ పడి మరీ పరిశోధనలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా గ్రహాలపై వేట ఓ రేంజ్‌లో చేస్తున్నారు. భూమిని పోలిన గ్రహాలు విశ్వంలో ఉన్నాయా? ఇక్కడ ఉండే వాతావరణం మరే గ్రహంపైనైనా ఉందా? అనే అంశాలను సీరియస్‌గా పరిశోధిస్తున్నారు. ముఖ్యంగా మార్స్‌పై, భూమికి సమీపంగా ఉండే చంద్రుడిపై ఈ ప్రయోగాల స్థాయి మరింత ఎక్కువే అని చెప్పాలి. అయితే, తాజాగా మనకు కనిపించే చందమామపైకి చేంజ్ 3 రోవర్‌ను పంపిన చైనా.. ఆ తర్వాత మనకు కనిపించనివైపు ఉండే చందమామపైకి యూటు-2 రోవర్‌ని పంపింది. ఆ రోవర్ ఇప్పుడు చందమామను పరిశోధిస్తోంది. మరోవైపు నాసా కూడా చందమామ దగ్గరకు వ్యోమగాముల్ని పంపేందుకు భారీ ప్రాజెక్టు చేపట్టింది. ఇలాంటి సమయంలో యూటు-2 రోవర్ పంపిన ఓ ఫొటో అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. ఇంతకీ ఆ ఫోటోలో ఉన్నదేంటి? అంత ఆసక్తి ఎందుకు కలిగిస్తోంది. సైంటిస్టులు దానిని ఎందుకు అంత సీరియస్‌గా తీసుకున్నారు? వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

చైనాకు చెందిన యుటు-2 రోవర్‌ 2019 నుంచి చందమామ అవతలి భాగాన్ని పరిశోధిస్తోంది. తాజాగా ఈ రోవర్ నుంచి వచ్చిన ఓ ఫొటోలో ఓ క్యూబ్ లాంటి ఇల్లు ఆకారం కనిపించింది. చూడ్డానికి అదో సింగిల్ బెడ్ రూంలాగా ఉంది. ఓ తలుపు కూడా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇప్పుడు ఈ ఫోటో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. అయితే చైనా స్పేస్ ప్రోగ్రామ్‌ అధికారి ఆండ్ర్యూ జోన్స్ రోవర్‌ పంపిన ఫోటోను ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు.

యూటు-2 రోవర్ చంద్రుడిపై తీసిన ఫొటోని షేర్ చేస్తూ… అందులో క్యూబ్ షేప్‌లో ఏదో ఉంది అని తెలిపారు జోన్స్‌. అది వోన్ కార్మాన్ పగులు లోయలో ఉందని, అది రోవర్‌కి 80 మీటర్ల దూరంలో ఉందని ట్వీట్‌లో రాసుకొచ్చాడు. అయితే ఇప్పుడు ఆ క్యూబ్ షేప్‌లో ఉన్నది ఏమిటన్నది తెలుసుకునేందుకు చైనా శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఐతే.. ఈ మిస్టరీ వీడేందుకు చాలా రోజుల టైమ్‌ పట్టవచ్చని అంటున్నారు సైంటిస్టులు. ఎందుకంటే… యూటు-2 రోవర్ ఆ ఇంటి లాంటి నిర్మాణాన్ని చేరేందుకు సమయం పడుతుందని అన్నారు. ఆ రోవర్ చాలా నెమ్మదిగా కదులుతుందని, దాన్ని కదిలించే పనిని భూమిపై ఉన్న చైనా శాస్త్రవేత్తలు చేపడుతున్నారు.

house on moon: చంద్రుడిపై ఉన్న ఆ వింత ఆకారం ఏంటబ్బా.. వైరల్ అవుతున్న ఫోటోలు.. మిస్టరీని చేధించే పనిలో శాస్త్రవేత్తలు..!


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this