S P Balasubrahmanyam Birthday : తన...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

S P Balasubrahmanyam Birthday : తన గాత్రంతో వెలది పాటలకు ఊపిరి పోసిన గానగంధర్వుడు.. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

S P Balasubrahmanyam Birthday : కోట్ల మనసులను గెలుచుకున్న గాత్రం ఆయనది.. పాటకు ప్రాణం ఆయన స్వరం. ఆయనే గానగంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం..

ముద్దుగా అందరు బాలు గారు అంటూ పిలుచుకుంటారు. నేడు ఆ గానగంధర్వుడు పుట్టిన రోజు.  తన గాత్రంతో వెలది పాటలకు ఊపిరి పోశారు బాలు. ఆ నాటి హీరోలనుంచి నేటి తరం హీరోల బాలు పాట వినిపించింది. 1966 లో పద్మనాభం నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రంతో సినీ గాయకుడిగా మొదలైన బాలసుబ్రహ్మణ్యం ప్రస్థానం ఎందరికో ఆదర్శం. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ లాంటి భాషల్లో సుమారు 40 వేలకు పైగా పాటలను ఆలపించారు బాలు. చాలామంది హీరోలకు వారి స్టైల్ లోనే వారి గొంతును మిమిక్రీ చేస్తూ పాటలు పాడారు బాలు. సింగర్ గానే కాదు నటుడిగా ను ఆయన తన ప్రతిభను కనబరిచారు.

అనేక తమిళ, తెలుగు చిత్రాల్లో సహాయ పాత్రలు పోషించారు బాలు. అలాగే కమల్ హాసన్, రజనీకాంత్, సల్మాన్ ఖాన్, విష్ణువర్ధన్, జెమిని గణేశన్, గిరీష్ కర్నాడ్, అర్జున్, నగేష్, రఘువరన్ లాంటి వాళ్ళకి గాత్రదానం చేసారు. దశావతారం చిత్రంలో కమల్ పోషించిన పది పాత్రల్లో 7 పాత్రలకు బాలునే డబ్బింగ్ చెప్పడం విశేషం. కేంద్ర ప్రభుత్వం నుండి 2001 లో పద్మశ్రీ పురస్కారాన్ని, 2011 లో పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు బాలు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 25 సార్లు వివిధ విభాగాల్లో నంది పురస్కారం అందుకున్నారు. ఇంకా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రప్రభుత్వాల నుంచి కూడా పలు పురస్కారాలు అందుకున్నారు. 2020 సెప్టెంబరు 25 న సంగీత ప్రియులను నిశీధిలోకి నెట్టి ఆయన స్వర్గస్థులయ్యారు. కరోనా వైరస్ సూకడంతో చికిత్స పొందుతూ బాలు కనుమూశారు. మరణం తర్వాత 2021లో  కేంద్ర ప్రభుత్వం బాలుకు పద్మ విభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this