Gold Price Today: పరుగులు పెడుతున్న బంగారం...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

Gold Price Today: పరుగులు పెడుతున్న బంగారం ధర.. హైదరాబాద్‌తో పాటు వివిధ ప్రధాన నగరాల్లో ధరల వివరాలు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 Gold Price Today: బంగారం కొనుగోలు చేసేవారికి షాకింగ్‌ న్యూస్‌.. రోజురోజుకు బంగారం ధర పెరిగిపోతోంది. గత రెండు నెలల కిందట కింది చూపులు చూసిన బంగారం.. 

ఇప్పుడు పై చూపులు చూస్తోంది. రోజురోజుకు ఆగకుండా పరుగులు పెడుతోంది. తాజాగా దేశీయంగా పరిశీలిస్తే బంగారం ధర స్వల్పంగా పెరిగింది. అంటే 10 గ్రాములపై 100 రూపాయలు పెరిగింది. కొన్ని ప్రాంతాల్లో ఈ పెరుగుదల ఉంటే మరి కొన్ని ప్రాంతాల్లో నిలకడగా ఉంది. తాజాగా శుక్రవారం దేశంలోని ప్రధాన నగరాల్లో నమోదైన ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,350 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,790 వద్ద ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,230 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,230 ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,450 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,400 ఉంది. అలాగే కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,200 ఉండగా,24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,400 ఉంది.

ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,400 ఉంది. ఇక విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,200 ఉండగా,24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,400 వద్ద ఉంది.

కాగా, శుక్రవారం ఉదయం ఉన్న ధరలు ఇవి. బంగారం ధరల్లో ప్రతి రోజు మార్పులు చేర్పులు జరుగుతూనే ఉన్నాయి. గత రెండు నెలల కిందట తగ్గుముఖం పట్టిన పసిడి ధర.. మే నెల నుంచి పరుగులు పెట్టి కాస్త తగ్గుముఖం పట్టగా, ఇప్పుడు తాజాగా జూన్‌ నెల నుంచి మళ్లీ పై చూపులు చూస్తోంది. బంగారం ధరలు పెరగడానికి ఎన్నో కారణాలున్నాయంటున్నారు వ్యాపారవేత్తలు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని వెల్లడిస్తున్నారు. బంగారం కొనుగోలు చేసే వారు ఆ సమయంలో ధర ఎంత ఉందో తెలుసుకొని వెళ్లడం బెటర్‌. అంతేకాదు.. ప్రస్తుతం 50వేలకుపైగా చేరిన పసిడి.. మున్ముందు మరింత పెరిగే అవకాశాలున్నాయంటున్నారు నిపుణులు.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this