Friday, February 27, 2026
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
Alien in Hazaribag: ఝార్ఖండ్ లో ఆ...

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక తరగతుల కోసం సమగ్ర మార్గదర్శి

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి...

Alien in Hazaribag: ఝార్ఖండ్ లో ఆ రాత్రి కనిపించిన అపర ‘ఏలియన్’ అసలు కథ ఇది

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Alien in Hazaribag:  ఝార్ఖండ్ లోని హజారీబాగ్ ప్రాంతంలో ఇటీవల ఓ రోజు రాత్రి నిర్మానుష్యమైన రోడ్డుపై నడిచివెళ్తున్న ఆకారం తాలూకు 30 సెకండ్ల క్లిప్ ఇంటర్నెట్ ను కుదిపివేసింది. 

అది ఎలియానా లేక దెయ్యమా అని చాలామంది అయోమయంలో పడిపోయారు. లోకల్ ఛానల్ జనదూత్ ప్రతినిధి ఒకరు ఈ వింతను వాట్సాప్ ద్వారా సర్క్యులేట్ చేసిన ఇద్దరు వ్యక్తులను దీనిపై ఆరా తీశారు. తాము ఓ మిత్రుడి తల్లి అంత్యక్రియలకు హాజరై చక్రధర్ పూర్ నుంచి సెరికేల ప్రాంతానికి వస్తుండగా ఈ ఆకారాన్ని చూశామని వారు చెప్పారు. అసలు విషయం ఏమిటంటే ఇంతకీ ఆ ఏలియన్ లా కనిపించిన వ్యక్తి మహిళ అని, నగ్నంగా నడిచి వెళ్తోందని నిర్ధారించుకున్నామని వారు చెప్పారు. తమకన్నా ముందు బైక్ లపై కొందరు వెళ్లారని, వారెవరూ ఆ మహిళను పట్టించుకోలేదని, అయినా ఆ తరువాత వారిని కలిసి అడగగా అది ఓ మంత్రగత్తె అని చెప్పారని వెల్లడించారు. అయితే ఆ మహిళ మంత్రగత్తె కాదన్నారు. కానీ నగ్నంగా ఎందుకు వెళ్తోందో తెలియలేదన్నారు. గత ఏప్రిల్ 27 నాటి ఈ వీడియో ఇటీవలే బయటకు వచ్చింది. ఏమైనా ఈ వీడియో చూసి అది ఏలియన్ అని ఒకరంటే మరొకరు దెయ్యమని అన్నారు=. తాము భయపడినట్టు కొందరు నెటిజెన్లు పేర్కొనగా ఇంకొందరు దీన్ని తేలికగా కొట్టి పారేశారు. ప్రజలను, ముఖ్యంగా అమాయకులను భయపెట్టడానికి కొందరు ఇలాంటి ట్రిక్కులు చేస్తుంటారని వారు అన్నారు.

అటు- ఈ ఉదంతంపై తాము ఇన్వెస్టిగేట్ చేస్తామని సెరికేల సబ్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ నౌషాద్ తెలిపారు.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this