Bharat Bandh Tomorrow: రేపు భారత్ బంద్.....

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

Bharat Bandh Tomorrow: రేపు భారత్ బంద్.. జగన్ సర్కార్ సంపూర్ణ మద్దతు.. వాటికి మాత్రమే మినహాయింపు.!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Bharat Bandh Tomorrow: కేంద్ర ప్రభుత్వానికి
వ్యతిరేకంగా అఖిల భారత సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్‌కెఎం) మార్చి 26వ తేదీన
భారత్ బంద్‌కు తలపెట్టిన సంగతి తెలిసిందే. ఈ బంద్‌ను దేశ పౌరులంతా కలిసి
పూర్తిస్థాయిలో విజయవంతం చేయాలంటూ రైతులు విజ్ఞప్తి చేశారు. దాదాపు నాలుగు
నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో కేంద్రానికి వ్యతిరేకంగా రైతులు కొత్త వ్యవసాయ
చట్టాలపై నిరసన వ్యక్తం చేస్తున్న విషయం విదితమే. ఈ క్రమంలోనే మార్చి 26వ
తేదీన ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు అఖిల భారత సంయుక్త కిసాన్
మోర్చా భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది.

ఈ సమయంలో దేశవ్యాప్తంగా అన్ని రహదారులు క్లోజ్ కానున్నాయి. అటు ప్రజా
రవాణా అంతా బంద్ కానుంది. అలాగే మార్కెట్లు, జనసాంద్రిత ప్రదేశాలను సైతం
మూసివేయనున్నారు. “అన్నదాతలను గౌరవించి.. ఈ భారత్ బంద్ విజయవంతం అయ్యేలా
చూడాలని దేశ ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నాం” అని రైతు సంఘం నాయకుడు దర్శన్
పాల్ పేర్కొన్నారు.

భారత్ బంద్‌కు వైసీపీ మద్దతు..

రైతు సంఘాలు, విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు కేంద్ర ప్రభుత్వానికి
వ్యతిరేకంగా తలపెట్టిన భారత్ ‌బంద్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంఘీభావం
తెలిపింది. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించడాన్ని రాష్ట్ర
ప్రభుత్వం వ్యతిరేకిస్తోందని, దీనికి సంబంధించి సీఎం వైఎస్ జగన్మోహన్
రెడ్డి కేంద్రానికి లేఖ కూడా రాశారని రాష్ట్ర సమాచార, రవాణా శాఖ మంత్రి
పేర్ని నాని వెల్లడించారు.

ప్రజలకు అసౌకర్యం కలగకుండా బంద్‌ను శాంతియుతంగా జరపాలని.. ఎటువంటి
అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని రైతు సంఘాలకు మంత్రి విజ్ఞప్తి
చేశారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ బస్సులు మధ్యాహ్నం 1 గంట వరకు బంద్
కానున్నట్లు స్పష్టం చేశారు. అయితే బంద్ సమయంలో అత్యవసర ఆరోగ్య సేవలన్నీ
కూడా యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు. కాగా, భారత్ బంద్‌కు ఇప్పటికే
టీడీపీ, కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు మద్దతు తెలపాయి.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this