Home Blog Page 384

Rice CB Entry: రైస్ క్లోజింగ్ బ్యాలెన్స్ నమోదు ఇలా ఎంటర్ చేస్తే బెటర్

    0

    ప్రతి నెలా మన స్కూల్ కు కావాల్సిన రైస్ ను జగనన్న గోరు ముద్ద యాప్ లో నమోదు చేయాలి. ఇలా నమోదు చేయడం బెటర్..

    ముందుగా జగనన్న గోరుముద్ద యాప్ లో మీ స్కూల్ డైస్ కోడ్, పాస్వర్డ్ తో (123) ఎంటర్ అవ్వండి. CB మీద క్లిక్ చేయండి.
    సిబీ ఎంట్రీ లో ఈ నెలాఖరుకు ఎంత రైస్ ఉంటుందో మీరు లెక్క గట్టుకుని ఒక సుమారు విలువను ఉంచాలి.

    లెక్క కట్టే విధానం:

    స్కూల్ రోల్ ను ఈ నెలలో మిగిలిన పని దినాల తో గుణించి, వచ్చిన విలువకు సరి పడే బియ్యాన్ని లెక్క గట్టండి. దీనిని ఈ రోజుకు ఉన్న బియ్యం బ్యాలన్స్ నుండి తీసి వేసి సిబి ఎంట్రీ లో వేయండి. మైనస్ వ్యాల్యూస్ లో ఉంటే మైనస్ వేసి నమోదు చేయండి.
    టిప్: సిబి ఎంటర్ చేశాక మీకు తదుపరి నెలకు వచ్చే రైస్ ను క్రింద చూసుకోండి. అది డెసిమల్ వాల్యూస్ లో మరియు 50, 100, 200 అని కాకుండా 53 అని, 106 అని, 213 అని వాల్యూ చూపిస్తుంది.
    ఈ వాల్యూ 50,100,150,200 లా రౌండ్ అయ్యి ఉంటే డీలర్ దగ్గర నుండి రైస్ తీసుకోవడానికి బాగుంటుంది. అదే రౌండ్ వాల్యూ కి పైన ఉన్న రైస్ ను డీలర్ ఎగ్గొట్టేయవచ్చు. కావున క్రింద రైస్ రౌండ్ వాల్యూ కి తగ్గట్టు సిబి ఎంట్రీ ని కొంచెం అటు ఇటు అడ్జస్ట్ చేసుకోండి. సీబీ ఉజ్జాయింపు విలువ కాబట్టి కొంచెం అటు ఇటు అయినా పర్లేదు.

    Business Idea: రూ.50,000 పెట్టుబడితో సంవత్సరానికి రూ.10 లక్షల సంపాదన

      0

      Business Idea: కొత్తగా ఏదైనా బిజినెస్ చెయ్యాలనుకుంటున్నారా… అయితే తక్కువ ఖర్చుతో… ఎక్కువ లాభాలు వచ్చే ఈ వ్యాపారంపై ఓసారి దృష్టి పెట్టండి. మీకు ఉపయోగపడవచ్చు.

      ఇంటి దగ్గరే ఉంటూ వ్యాపారం చెయ్యాలనుకుంటే… మీకు ఈ బిజినెస్ బాగా సెట్ అవుతుంది. పైగా మీరు ప్రతీ సంవత్సరం లక్షలు సంపాదించవచ్చు. వ్యాపారం ఏంటంటే అలోవెరా (కలబంద – aloe vera) సాగు. ఇప్పుడున్న రోజుల్లో తక్కువ పెట్టుబడితో… ఎక్కువ లాభాలు వచ్చే టాప్ వ్యాపారాల్లో ఇది కూడా నిలిచింది. ఇప్పటికే చాలా మంది లక్షలు సంపాదిస్తున్నారు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అలో వెరాకు డిమాండ్ పెరుగుతోంది. ఎన్ని మొక్కల్ని పెంచినా… ఇంకా ఇంకా కావాలని అంటున్నాయి ఫార్మా, కాస్మెటిక్, బ్యూటీ ప్రొడక్ట్స్ తయారీ కంపెనీలు. ఇక్కడ మరో ప్లస్ పాయింట్ ఏంటంటే… అలోవెరా సాగు చాలా తేలికైనది… నష్టాలు దాదాపుగా ఉండని వ్యాపారం.

      విపరీతమైన డిమాండ్:

      ఈ రోజుల్లో ప్రజలకు అందంపై ఆసక్తి పెరిగింది. దాంతో… రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ కొంటున్నారు. చాలా సబ్బులు, క్రీములు, లోషన్ల తయారీలో అలొవెరా వాడుతారు. అందువల్ల ఈ మొక్కలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఈ కరోనా వచ్చాక… డిమాండ్ దాదాపు 3 రెట్లు పెరిగింది. కొన్ని కంపెనీలైతే కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ సాగును రైతులతో చేయించుకుంటున్నాయి. మీరు వ్యాపార కోణంలో అలోవెరా సాగు చేపడితే మీకు సంవత్సరానికి రూ.8 నుంచి రూ.10 లక్షల దాకా ఆదాయం వస్తుంది అని చెబుతున్నారు.

      ఉద్యోగాల కంటే ఇదే మేలు:

      చెబితే నమ్మరేమోగానీ… చాలా మంది MBA, ఇంజినీరింగ్ చదివి కూడా… ఉద్యోగాలు మానేసి… అలోవెరా సాగు చేస్తున్నారు. ఎందుకంటే దీన్లో లాభాల సీక్రెట్‌ను వాళ్లు కనిపెట్టేశారు. ఉద్యోగాలు చేస్తూ లేని పోని టెన్షన్లు పెంచుకునే కంటే… అలోవెరా పెంచుకుంటే మేలు అని వాళ్లకు కిటుకు తెలిసిపోయింది. ఓ వ్యాపారవేత్త టెన్షన్ తగ్గించుకునేందుకు గోధుమలు, దుంపల సాగు చేపట్టాడు. వ్యాపారం కంటే అవి బాగా కలిసొచ్చాయి. దాంతో ఆయన అలోవెరా సాగు చేస్తున్నాడు. రాజస్థాన్ నుంచి అలోవెరా మొక్కలు తెప్పించుకొని పెంచుతున్నాడు. సొంత తోట నుంచి లక్షలు సంపాదిస్తున్నాడు.

      శిక్షణ ఉంటుంది:

      అలోవెరా మొక్క మనం వద్దన్నా పెరుగుతుంది. మనం కొన్ని రోజులపాటూ నీరు పొయ్యకపోయినా సర్దుకుపోతుంది. ఎలాగొలా పెరుగుతుంది. అది మన చుట్టూ ఉన్న గాలిని శుభ్రం చేస్తుంది. మీరు అలోవెరా ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభించాలి అనుకుంటే… మీకు సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ అరోమాటిక్ ప్లాంట్స్ (CIMAP) కొన్ని నెలలపాటూ ట్రైనింగ్ ఇస్తుంది. ఇందుకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ ఉంటుంది. కొద్ది మొత్తంలో ఫీజు చెల్లించాక ట్రైనింగ్ మొదలవుతుంది.

      అలోవెరా ఎలా పెంచాలి?

      అలోవెరాకి మన దేశ వాతావరణం బాగా సెట్ అవుతుంది. విపరీతమైన ఎండలు అవసరం లేదు. సాధారణ ఎండ ఉన్నా పెరుగుతుంది. మరీ ఎక్కువ నీరు అవసరం లేదు. సంవత్సరమంతా పెరుగుతుంది. విపరీతమైన చల్లదనం ఉంటే మాత్రం మొక్క పెరగడానికి ఇబ్బంది పడుతుంది. ఎలాంటి నేలలోనైనా ఇది పెరగగలదు.
      ఇసుక రకం నేలలైతే ఈ మొక్కకు బాగా సెట్ అవుతాయి. నల్ల నేలలో కూడా బాగా పెరుగుతుంది. ఐతే… భూమిలో జలాలు (భూగర్భ జలాలు) కాస్త ఎక్కువగా ఉండే నేలను ఎంచుకోవాలి. అలాగే మొక్కల దగ్గర నీరు నిల్వ ఉండకుండా ఏర్పాట్లు చేసుకోవాలి. జులై నుంచి ఆగస్ట్ మధ్య ఈ మొక్కల్ని నాటాలి.

      ఎంత ఖర్చు అవుతుంది?

      ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ICAR) ప్రకారం… ఒక హెక్టార్ (2.4 ఎకరాలు) సాగుకి రూ.27,500 ఖర్చు అవుతుంది. కూలీలకు వేతనాలు, సాగు ఏర్పాట్లు, పురుగు మందులు అన్నీ కలిపి మొత్తం ఏడాదికి ఖర్చు రూ.50,000 దాకా అవుతుంది. హెక్టార్ పొలంలో సంవత్సరానికి 40 టన్నుల నుంచి 50 టన్నుల అలోవెరా ఆకులు వస్తాయి. మీరు ఆయుర్వేద కంపెనీలు, కాస్మెటిక్, సబ్బుల తయారీ కంపెనీలకు వాటిని అమ్మవచ్చు. ఆకులు మందంగా, పెద్దగా ఉంటే… వాటికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. చాలా చోట్ల టన్ను ఆకులకు రూ.15,000 నుంచి రూ.25,000 దాకా ఇస్తున్నారు. అందువల్ల మీకు ఏడాదికి రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల దాకా ఆదాయం వస్తుంది.

      India Covid 19: 17న సీఎంలతో ప్రధాని సమావేశం… దేశంలో మళ్లీ లాక్‌డౌన్ విధిస్తారా?

        0

        Coronavirus updates: దేశంలో రోజూ 25వేలకు పైగా కరోనా కేసులు వస్తున్నాయి. అందువల్ల కేంద్రం అప్రమత్తం అవుతోంది. 17న సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం కీలకం కాబోతోంది.

        ఇండియాలో కరోనా ఏ రేంజ్‌లో పెరుగుతోందో చూస్తూనే ఉన్నాం. ఇలాగే ఊరుకుంటే కొంపలు మునుగుతాయని భావించిన కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా 17న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశం మధ్యాహ్నం 12.30కి జరగనుంది. ఇందులో రాష్ట్రాలు ఏం చేస్తున్నాయో మోదీ తెలుసుకోనున్నారు. ఏం చెయ్యాలో చెప్పనున్నారు. ఈ సందర్భంగా… మళ్లీ కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్లు ప్రకటించమని సూచించే అవకాశాలు ఉన్నాయి.

        ఇండియాలో కొత్తగా 26,291 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 1,13,85,339కి చేరింది. కొత్తగా 118 మంది కరోనాతో చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 1,58,725కి చేరింది. దేశంలో మరణాల రేటు 1.4 శాతంగా ఉంది. కొత్తగా 17,455 మంది కరోనా నుంచి కోలుకోగా… మొత్తం రికవరీల సంఖ్య 1,10,07,352కి చేరింది. దేశంలో రికవరీ రేటు 96.7 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో 2,19,262 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇండియాలో కొత్తగా 7,03,772 టెస్టులు చేశారు. మొత్తం టెస్టుల సంఖ్య 22,74,07,413కి చేరింది.

        ప్రస్తుతం దేశంలో మహారాష్ట్ర, కర్ణాటక, పంజాబ్, కేరళ వంటి రాష్ట్రాల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఆరు రాష్ట్రాల్లో 78 శాతం కొత్త కేసులు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడిప్పుడే కాస్త కేసులు పెరుగుతున్నాయి. కరీంనగర్, మంచిర్యాలలో ఒక్కసారిగా కేసులు పెరిగాయి. కరీంనగర్ లోని రెండు స్కూల్లో ముగ్గురు టీచర్లు, ఓ విద్యార్థికి కరోనా సోకింది. మంచిర్యాలలోని ప్రభుత్వ బాలికల హైస్కూల్లో 12 మంది టీచర్లు, ఇద్దరు మధ్యాహ్నం భోజనం వడ్డించేవారు, ఓ విద్యార్థికి (మొత్తం 15 మంది) కరోనా సోకింది. టీటీడీ వేద పాఠశాలలో పది మంది విద్యార్థులకు కరోనా సోకింది.

        ఇక త్వరలో సూదితో పని లేకుండా ఇచ్చే వ్యాక్సిన్లు కూడా రాబోతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది. ఈ సంవత్సరం చివరి నాటికి అవి వస్తాయి అంది. అటు ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్ దేశాలు… ఆక్స్‌ఫర్డ్ ఆస్త్రాజెనెకా సృష్టించిన… ఇండియాలోని సీరం ఇన్‌స్టిట్యూట్ తయారుచేస్తున్న కోవిషీల్డ్ వ్యాక్సిన్‌కి తాత్కాలికంగా బ్రేక్ వేశాయి. ఇప్పటికే పది ఐరోపా దేశాలు, థాయిలాండ్ ఈ టీకాను తాత్కాలికంగా నిలిపాయి. ఇది ఇచ్చిన వారికి రక్తం గడ్డ కడుతోందనే ఆందోళనలు వస్తున్నాయి. ఇండియాలో మాత్రం ఎవరికీ ఇలాంటి పరిస్థితి రాలేదు. తమ వ్యాక్సిన్ మంచిది అనీ… ఎలాంటి సైడ్ ఎఫెక్టులూ రాలేదని ఆస్త్రాజెనెకా తెలిపింది.

        తెలంగాణలో కొత్తగా 157 కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 3,01,318కి చేరింది. కొత్తగా ఒకరు చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 1654కి చేరింది. మరణాల రేటు 0.54 శాతం ఉంది. తాజాగా 166 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 2,97,681కి చేరింది. రికవరీ రేటు రాష్ట్రంలో 98.79 శాతం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,983 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. వాటిలో 718 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. యాక్టివ్ కేసులు 10 తగ్గాయి. ప్రభుత్వం తాజాగా 38,517 టెస్టులు చేయించింది. మొత్తం టెస్టుల సంఖ్య 92,38,982కి చేరింది. GHMC పరిధిలో కొత్తగా 35 కరోనా కేసులు నమోదయ్యాయి.

        ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 22,604 టెస్టులు చెయ్యగా 147 కేసులొచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 8,92,008కి చేరింది. కర్నూలు జిల్లాలో ఒకరు మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 7185కి చేరింది. కొత్తగా 10 మంది పూర్తిగా కోలుకోగా, మొత్తం కోలుకున్నవారి సంఖ్య 8,83,380కి చేరింది. యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం 1443 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,45,57,366 కరోనా టెస్టులు చేశారు.

        ప్రపంచ దేశాల్లో కొత్తగా 3,26,688 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 12.07 కోట్లు దాటింది. కొత్తగా 6330 మంది చనిపోవడంతో… మొత్తం మరణాల సంఖ్య 26.71 లక్షలు దాటింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 2.06 కోట్లకు పైగా ఉన్నాయి. ప్రస్తుతం కరోనా సోకిన ప్రతి 100 మందిలో ఇద్దరు చనిపోతున్నారు.

        అమెరికాలో కొత్తగా 43,667 పాజిటివ్ కేసులొచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 3.01 కోట్లు దాటింది. కొత్తగా 763 మంది చనిపోవడంతో… మొత్తం మరణాల సంఖ్య 5.47 లక్షలు దాటింది. ప్రస్తుతం ప్రపంచ మొత్తం పాజిటివ్ కేసుల్లో అమెరికా టాప్‌లో ఉంది. బ్రెజిల్, ఇండియా, రష్యా, బ్రిటన్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. రోజువారీ అమెరికా టాప్‌కి వెళ్లగా…. బ్రెజిల్, ఇండియా, టర్కీ, ఇటలీ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచ మొత్తం మరణాల్లో అమెరికా టాప్‌లో ఉంది. బ్రెజిల్, మెక్సికో, ఇండియా, బ్రిటన్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. రోజువారీ కొత్త మరణాల్లో బ్రెజిల్ (1,275) టాప్‌లో ఉంది. ఆ తర్వాత అమెరికా (763), రష్యా (404), ఇటలీ (354), ఫ్రాన్స్ (333) తర్వాతి పొజిషన్లలో ఉన్నాయి.

        Covid Vaccine Side Effects : కరోనా టీకా వేసుకున్నారా..! అయితే సైడ్ ఎఫెక్ట్స్ నుంచి తప్పించుకోవడానికి ఏం తినాలో తెలుసా..

          0

          Covid Vaccine Side Effects : దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న కరోనా వ్యాక్సిన్ ఇప్పుడు వివిధ దేశాల్లోని సామాన్య ప్రజలకు పంపిణీ చేయబడుతోంది. భారతదేశంలో రెండో దశ సీనియర్ సిటిజన్లకు టీకాలు వేస్తోంది. టీకాలు వేయడానికి ముందు మరియు తరువాత కొన్ని దశలు అనుసరించాలి.

          టీకాలు వేయడానికి ముందు మరియు తరువాత ఏమి తినాలనే దానిపై అధికారిక మార్గదర్శకాలు లేనప్పటికీ, తెలివైన మరియు ఆలోచనాత్మక ఆహార ఎంపికలు చేయడం ఎల్లప్పుడూ మంచి నిర్ణయం. టీకాలు వేసిన సమయంలో తప్పక తినవలసిన ఆహారాలు ఏంటో తెలుసుకుందాం.

          మీరు అనారోగ్యంతో ఉన్నప్పుడు చికెన్ సూప్ తినమని సలహా ఇవ్వడానికి ఒక కారణం ఉంది. ఇది మిమ్మల్ని వెచ్చగా ఉంచడమే కాదు, ఉడకబెట్టిన పులుసు నిజంగా మిమ్మల్ని నయం చేస్తుంది. గొడ్డు మాంసం, చికెన్ లేదా మేక ఎముకలతో తయారు చేసిన ఎముక ఉడకబెట్టిన పులుసులో కొల్లాజెన్ అధికంగా ఉంటుంది, ఇది గౌట్ యొక్క లైనింగ్ రిపేర్ చేయడానికి సహాయపడుతుంది.

          ఆకుపచ్చ కూరగాయలు, ఆకుకూరలు తినమని చెప్పడానికి కారణం అవి యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల ఫ్రీ రాడికల్స్ తో పోరాడటానికి మరియు శరీరంలో మంటతో పోరాడటానికి సహాయపడుతుంది. ఉదాహరణకు, బ్రోకలీలో యాంటీఆక్సిడెంట్ సల్ఫోరాఫేన్ ఉంది, ఇది ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షించడానికి సహాయపడుతుంది మరియు మంటతో పోరాడుతుంది.

          వెల్లుల్లి మరియు ఉల్లిపాయలలో ప్రీబయోటిక్స్ అధికంగా ఉంటాయి, ఇవి మీ గట్లోని మంచి బ్యాక్టీరియాను పోషించటానికి సహాయపడతాయి. ఆరోగ్యకరమైన గౌట్ కలిగి ఉండటం అంటే మీరు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతున్నారు.
          గ్రీన్ టీ మిశ్రమం యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ అలెర్జీ. ఇది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది, ఇది కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది.

          Bring Back Your Amount: మీ డబ్బును తప్పుగా ఇతర ఖాతాలోకి ట్రాన్స్‌ఫర్ చేశారా.? అయితే ఆ మొత్తాన్ని రివర్స్ చేసుకోండిలా.!

            0

            Transferred Money to a Wrong Account: మీరు తరచూ ఆన్‌లైన్ బ్యాంక్ ట్రాన్సక్షన్స్ చేస్తుంటారా.? అలాగే హడావుడిగా ఎప్పుడైనా తప్పుడు నెంబర్ టైప్ చేయడం ద్వారా వేరే అకౌంట్‌లోకి నగదు బదిలీ చేశారా.? అయితే టెన్షన్ పడకండి ఈజీగా ఆ డబ్బును మరలా మీ అకౌంట్‌కు క్రెడిట్ చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..!
            ఈ రోజుల్లో ఆన్‌లైన్ డబ్బు బదిలీలు సర్వసాధారణం అయిపోయాయి. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యుపిఐ), పేటిఎమ్, నెట్ బ్యాంకింగ్, ఫోన్ పే, గూగుల్ పే వంటి ఎన్నో రకాల థర్డ్ పార్టీ నగదు లావాదేవీల యాప్స్ అందుబాటులోకి రావడంతో.. బ్యాంకులకు వెళ్లకుండానే జనాలు డబ్బును ఆన్‌లైన్ ద్వారా ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారు. ఈ ఆన్‌లైన్ బ్యాంకింగ్ లావాదేవీలపై ప్రజలు ఎక్కువగా ఆధారపడుతున్నారు. అందులో కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి.
            ఉదాహరణకు, మీరు అనుకోకుండా డబ్బును వేరొకరి ఖాతాకు బదిలీ చేస్తే, ఆ నగదును మళ్లీ ఎలా తిరిగి పొందగలరు? ఆ మొత్తాన్ని తిరిగి మీ ఖాతాలోకి క్రెడిట్ చేసే అధికారం బ్యాంకుకు ఉందా? ఇలా పలు ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం. తప్పుగా వేరే అకౌంట్‌లోకి క్రెడిట్ అయిన మొత్తాన్ని తిరిగి రివర్స్ చేసే అధికారం బ్యాంకులకు లేదు.
            ఎప్పుడైతే లబ్దిదారుడు.. బాధితుడిపై దయతలిస్తే తప్ప.. బ్యాంకులకు ఆ డబ్బును తిరిగి రివర్స్ చేసే అధికారం, అనుమతి లభించదు. ఈ విషయాన్ని ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి ట్రాన్సక్షన్లలో బ్యాంక్ కేవలం ఫెసిలిటేటర్‌గా మాత్రమే పనిచేయగలదని bankbazaar.com సీఈఓ, సహ వ్యవస్థాపకుడు అధిల్ శెట్టి వెల్లడించినట్లు ఓ ప్రముఖ పోర్టల్ కథనాన్ని ప్రచురించింది.

            మరి బదిలీ అయిన మొత్తాన్ని ఎలా తిరిగి క్రెడిట్ చేసుకోవచ్చు.?

            పొరపాటున మీరు డబ్బును క్రెడిట్ చేయాల్సిన అకౌంట్ కాకుండా వేరే ఖాతాలోకి క్రెడిట్ చేస్తే.. తక్షణం మీ బ్యాంక్ కస్టమర్ కేర్‌కు కాల్ చేసి విషయాన్ని అంతా వివరించండి. లావాదేవీ జరిగిన ఖచ్చితమైన సమయం, తేదీతో పాటు, నగదు తప్పుగా బదిలీ అయిన ఖాతా నంబర్‌ను కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌కు చెప్పండి. దీనితో మీరు తప్పుగా ఎంటర్ చేసిన ఖాతాకు బదిలీ అయిన సొమ్ము 5-6 పనిదినాల్లో తిరిగి మీ అకౌంట్‌కు క్రెడిట్ అవుతుంది.
            ఒకవేళ అది జరగకపోతే.. మీరు మీ బ్యాంకును సంప్రదించి, తప్పుగా జరిగిన లావాదేవీల గురించి మేనేజర్‌కు తెలియజేయాలి. సదరు బ్యాంక్ డబ్బు బదిలీ అయిన లబ్ధిదారుడి వివరాలను తనిఖీ చేసి.. ఆ వ్యక్తికి అదే శాఖలో ఖాతా ఉంటే.. నగదు విషయమై అభ్యర్థిస్తుంది. కొన్నిసార్లు బ్యాంకులు ఇలాంటి లావాదేవీలను సెటిల్ చేయడానికి రెండు నెలల సమయాన్ని కూడా తీసుకుంటాయి.

            లబ్ధిదారుడు.. మీ ఖాతాకు డబ్బును తిరిగి క్రెడిట్ చేయడానికి నిరాకరిస్తే..?

            ఈ సందర్భంలో, మీరు మీ బ్యాంకును సంప్రదించి మొత్తం విషయాన్ని వివరించండి. అతను లేదా ఆమె మీ డబ్బును తిరిగి ఇవ్వడానికి నిరాకరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోండి. ఒకవేళ మీ బ్యాంక్, లబ్ధిదారుడి బ్యాంక్ వివిధ ప్రాంతాల్లో ఉంటే మాత్రం ఈ ప్రక్రియ మరింత కష్టతరం అవుతుంది.

            మీ డబ్బును తిరిగి ఇవ్వడానికి లబ్ధిదారుడు అంగీకరిస్తే..?

            ఆ డబ్బును తిరిగి మీ ఖాతాలోకి క్రెడిట్ చేసుకోవడానికి 8-10 పనిదినాలు పడుతుంది. లేకపోతే, మీరు లావాదేవీని ఖచ్చితమైన బ్యాంక్ స్టేట్మెంట్, చిరునామా, ఐడి ప్రూఫ్ మొదలైన వాటితో నిరూపించాల్సి ఉంటుంది.

            Corona Cases Hike: దేశంలో కరోనా కేసులు పెరగడానికి కారణమదే.. పార్లమెంట్ హౌస్‌లో వెల్లడించిన కేంద్ర ఆరోగ్య మంత్రి

              0

              Harsha vardhan on covid-19 cases: ఇటీవల కాలంలో దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి సోమవారం నాడు స్పందించారు. కరోనా మహామ్మరి పట్ల నిర్లక్ష్యం పెరగడం ప్రధాన కారణమని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ సోమవారం అన్నారు. కొన్ని రాష్ట్రాల్లో 80 శాతానికి పైగా కేసులు నమోదయ్యాయని ఆయన తెలిపారు. ముఖ్యంగా ప్రజలు భౌతిక దూరం పాటించకపోవడం, మాస్కులు ధరించకపోవడమే కేసులు పెరగడానికి ప్రధాన కారణమని ఆయన స్పష్టం చేశారు.
              కరోనా వ్యాధికి వ్యతిరేకంగా వ్యాక్సిన్ లభించినప్పటికీ, కరోనా నిబంధనలు పాటించడంలో ప్రజల నిర్లక్ష్యం కారణంగానే కేసులు మరోసారి విజృంభిస్తోందని ఆయన పేర్కొన్నారు. పార్లమెంటు హౌస్ అనెక్స్‌లో పార్లమెంటు సభ్యుల కోసం ఏర్పాటు చేసిన సూపర్ స్పెషలిస్ట్ మెగా హెల్త్ క్యాంప్ సందర్భంగా హర్షవర్ధన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ శిబిరాన్ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆరోగ్య మంత్రి సమక్షంలో ప్రారంభించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఏడాది పొడవునా పార్లమెంట్ హౌస్ అనెక్స్ కేంద్రంలో వైద్య, ఆరోగ్య సదుపాయాలను అందించనున్నట్లు పేర్కొన్నారు. ప్రయోగశాల పరిశోధనలు, ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్ సదుపాయాలతో పాటు వివిధ ప్రత్యేకతల నిపుణుల సేవలు అందుబాటులో ఉంటాయని మంత్రి వివరించారు. సాధారణ సేవలతో పాటు, పార్లమెంటు సభ్యులకు కార్డియాలజీ, న్యూరాలజీ, ఎండోక్రినాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీతో సహా ప్రత్యేకమైన సూపర్ స్పెషలిస్ట్ సంప్రదింపులు జరుగుతున్నాయి. ఆయుష్ సేవలు, పోషక సేవలను కూడా అందిస్తున్నట్లు తెలిపింది.
              ‘దేశంలో ప్రస్తుతం నమోదవుతున్న రోజువారి కేసుల్లో 80% ఆ ఐదు రాష్ట్రాల్లోనే నమోదవుతున్నాయని ఆయన వెల్లడించారు. దీనికి కారణం ప్రజలు కరోనా నిబంధనలు పాటించకపోవడమే’ అని మంత్రి వ్యాఖ్యానించారు. అయితే..కరోనాపై పోరులో భారత్ ఇతర దేశాలతో పోలిస్తే అనేక అంశాల్లో మెరుగ్గా ఉందని ఆయన తెలిపారు. గత ఏడాదిగా కరోనా విషయంలో ప్రజలు ఎంతో అప్రమత్తంగా వ్యవహరించారని, భవిష్యత్తులోనూ ఇదే వైఖరిని కొనసాగించాలని ఆయన సూచించారు.
              ఇదిలావుంటే, ప్రజలలో అవగాహన పెంచడం ద్వారా కోవిడ్ టీకా డ్రైవ్‌ను జాన్ ఆండోలన్ (ప్రజల ఉద్యమం) గా మార్చాలని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం టీకా మోతాదు 3 కోట్లకు చేరుకుంటుందని, టీకా డ్రైవ్ వేగంగా జరుగుతోందని హర్షవర్ధన్ తెలిపారు.

              Suspension: వీడియో కాన్ఫరెన్స్ లో ఫోన్ ఉపయోగించి నందుకు టీచర్ సస్పెన్షన్

                0

                కృష్ణా జిల్లాలో నాడు నేడు పై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఉపాధ్యాయుడు ఫోన్ ను ఉపయోగించిన కారణంగా సదరు ఉపాధ్యాయుడు ని విధుల నుండి సస్పెండ్ చేసిన కృష్ణా జిల్లా విద్యా శాఖాధికారిణి శ్రీమతి ఎం.వి రాజ్యలక్ష్మి

                ఉపాధ్యాయులు ఉపయోగించాల్సిన యాప్స్ గురించి తెలిసి కూడా ఇలా సస్పెన్షన్ న్యాయమా ? అని ఉపాద్యాయులు వాపోతున్నారు.

                ఇక్కడ క్లిక్ చేసి ఉత్తర్వులను డౌన్లోడ్ చేసుకోండి

                MDM Rice: డీలర్ కు లెటర్ ఇచ్చి వెంటనే సార్టెక్స్ రైస్ ను తీసుకోవాలి

                  0
                  • పాఠశాలకు బియ్యం కొరకు వెంటనే క్రింది చర్యలు తీసుకోవలసినదిగా డైరెక్టర్ MDM &
                    Sanitation, అమరావతి వారు తెలియ చేస్తున్నారు.

                  MDM
                  – ప్రస్తుతము అన్ని పాఠశాలలో బియ్యం లేని కారణముగా డైరెక్టర్ MDM &
                  Sanitation, అమరావతి, వారు Sortex riceను FP shop dealers వద్ద నుండి HM
                  గారు సంబంధిత డీలర్ కి లెటర్ ఇచ్చి OB ( ఓపెనింగ్ బ్యాలెన్స్) ప్రకారం
                  Sortex rice తీసుకోవలసినదిగా తెలిపియున్నారు.

                  LIC Policy: సామాన్యుల కోసం ఎల్ఐసి ప్రత్యేక స్కీం, 100 రూపాయలు కట్టండి 75,000 రూపాయల భీమా పొందండి..

                    0

                    LIC Aam Admi Bhima Yojana:  భారత ప్రభుత్వం పేదల కోసం అనేక సామాజిక భద్రతా పథకాలను ప్రారంభించింది. ఈ  పథకాల  ఉద్దేశ్యం పేదల జీవితాల్లో శ్రేయస్సును తీసుకురావడం. వారికి సామాజిక భద్రత కల్పించడం. పేద ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ “ఆమ్ అడ్మి బీమా యోజనను” ప్రారంభించింది. ఈ కార్యక్రమం కింద బీమా చేసిన వ్యక్తికి చాలా ప్రయోజనాలు అదుతాయి.

                    “ఎల్‌ఐసి ఆమ్ అడ్మి బీమా” యోజనతో చాలా ప్రయోజనాలున్నాయి. బీమా చేసినవారి సహజ లేదా ప్రమాదవశాత్తు మరణంతో పాటు, వైకల్యం కూడా ఉంటుంది. భీమా కాలంలో, ఎవరైనా సహజ మరణంలో మరణిస్తే, నామినీకి 30 వేల రూపాయలు లభిస్తాయి. యాక్సిడెంటల్ డెత్‌లో 75 వేల రూపాయలు దొరుకుతాయి. శాశ్వత మొత్తం వైకల్యం ఉన్న కేసులలో 75 వేల రూపాయలు లభిస్తాయి. రెండు కళ్ళు కోల్పోవడం, చేతులు లేదా కాళ్ళు రెండూ కోల్పోయినవారితోపాటు ఒక కన్ను, ఒక చేయి లేదా కాలు కోల్పోవడం శాశ్వత వైకల్యానికి లోబడి ఉంటుంది. ఒకరి కన్ను లేదా ఒక చేయి, కాలు పోతే అతనికి 37,500 రూపాయలు లభిస్తాయి.

                    పిల్లలకు స్కాలర్‌షిప్ కూడా లభిస్తుంది

                    ఈ బీమా పథకం కింద బీమా చేసిన తరువాత పిల్లలకు స్కాలర్‌షిప్ కూడా లభిస్తుంది. ఇది యాడ్-ఆన్ సేవల కిందికి వస్తాయి. దీని కింద 9-12 తరగతుల్లో చదివే ఇద్దరు పిల్లలకు ప్రతి నెలా 100-100 రూపాయలు లభిస్తాయి. బీమా చేసినవారికి ఏదైనా జరిగితే.. అప్పుడు LIC ఈ పథకానికి NEFT  లేక లబ్ధిదారునికి ఖాతా క్రెడిట్ ద్వారా ప్రయోజనం చేకూరుతుంది.

                    ఒక కుటుంబంలో ఒక్క సభ్యుడుకి మాత్రమే..

                    ఈ పథకం కింద కుటుంబంలోని ఒక సభ్యుడిని మాత్రమే కవర్ చేయవచ్చు. బీమా చేసిన వ్యక్తి యొక్క జీవితం 18-59 సంవత్సరాల మధ్య ఉండాలి. కుటుంబం దారిద్య్రరేఖకు దిగువన ఉండటం ముఖ్యం.  ఈ పథకంలో పాల్గొన్న ఏ వ్యక్తి అయినా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

                    100 రూపాయల ప్రీమియం మాత్రమే

                    ప్రీమియం గురించి మాట్లాడుతూ, దీనికి వార్షిక ప్రీమియం కేవలం 200 రూపాయలు. ఇందులో ప్రభుత్వం 100 రూపాయలు, బీమా చేసిన వ్యక్తి 100 రూపాయలు జమ చేయాల్సి ఉంటుంది. బీమా చేసిన వ్యక్తి గ్రామీణ ప్రాంతానికి చెందినవాడై ఉండాలి.  అతను 100 రూపాయలు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. మూడు వర్గాల ప్రజలు మాత్రమే ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోగలరు. మొదట, ఇది దారిద్య్రరేఖకు దిగువన ఉంది, ఇది 50 శాతం చెల్లించాలి, అంటే 100 రూపాయలు. మరొకరు గ్రామీణ ప్రాంతానికి చెందినవారు మరియు భూమిని కలిగి లేరు లేదా బీడీ కార్మికులు, వడ్రంగి, మత్స్యకారులు, హస్తకళల వ్యాపారవేత్తలతో సహా 48 వ్యాపారాలకు చెందినవారు.

                    Office Procedure: విద్యా శాఖ లో వివిధ అంశాల పై కార్యాలయ విధానాలకు స్టాండింగ్ ఉత్తర్వులు విడుదల

                      0
                      • పాఠశాల విద్యా విభాగం – కార్యాలయ విధానం
                      • ఆంధ్రప్రదేశ్ వ్యాపార నియమాలు
                        2018 యొక్క నిబంధన 16 (1) (బి) కింద అధికారాల ప్రతినిధులు
                      • స్టాండింగ్ ఉత్తర్వులు విడుదల 

                      ఇక్కడ క్లిక్ చేసి ఉత్తర్వుల కాపీని డౌన్లోడ్ చేసుకొండి