Hostel Students Party : హాస్టల్ లో...

AP Inter Results 2026 Today Live: Direct Links for 1st & 2nd Year Results, WhatsApp Mana Mitra Process, SMS Method

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్...

AP SSC Hall Ticket 2026 Released – Download 10th Class Hall Ticket

The Board of Secondary Education Andhra Pradesh (BSEAP) has...

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

Hostel Students Party : హాస్టల్ లో పదో తరగతి విద్యార్థుల మందు పార్టీ.. అత్యుత్సాహం చూపి అడ్డంగా దొరికిపోయారు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

మరికొద్ది రోజుల్లో పరీక్షలు. సంవత్సరమంతా పుస్తకాలతో కుస్తీలు. సరదాగా కింది తరగతి విద్యార్థులతో పార్టీ చేసుకుంటామని వార్డెన్ ను కోరారు. ఆయన సరే అనడంతో ఆనందంతో గంతులేశారు.

Hostel Students Party : హాస్టల్ లో పదో తరగతి విద్యార్థుల మందు పార్టీ.. అత్యుత్సాహం చూపి అడ్డంగా దొరికిపోయారు

మరికొద్ది రోజుల్లో పరీక్షలు. సంవత్సరమంతా పుస్తకాలతో కుస్తీలు. సరదాగా కింది తరగతి విద్యార్థులతో పార్టీ చేసుకుంటామని వార్డెన్ ను కోరారు. ఆయన సరే అనడంతో ఆనందంతో గంతులేశారు. వార్డెన్ ఉన్నంతవరకు బాగానే ఉన్న విద్యార్థులు.. అతను వెళ్లిపోగానే రెచ్చిపోయారు. బయటి నుంచి బీర్ బాటిళ్లు తెప్పించుకుని మద్యం తాగారు. అంతే కాకుండా ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫొటోలు వైరల్ అయ్యి, ఉన్నతాధికారుల వద్దకు చేరింది. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి బీసీ బాయ్స్ హాస్టల్ లో విద్యార్థులు ఈ ఘటనకు పాల్పడడం చర్చనీయాంశంగా మారింది. ఏప్రిల్ 17 ఆదివారం రాత్రి కింది తరగతి విద్యార్థులతో ఫేర్వెల్ పార్టీ చేసుకుంటామని వార్డెన్​ను కోరారు. వారి విజ్ఞప్తిని మన్నించిన వార్డెన్.. వంటమనిషితో చికెన్​ చేయించారు. విద్యార్థులందరూ భోజనం చేసిన తర్వాత వార్డెన్​ఇంటికి వెళ్లిపోయాడు. ఇక అప్పుడు మొదలైంది అసలు కథ.. ఇదే అదనుగా భావించిన విద్యార్థులు హాస్టల్ వెనుక నుంచి బీర్ బాటిల్స్ తెప్పించుకున్నారు. అందరూ కూర్చొని చికెన్​తో పాటు మద్యం తాగారు. అంతటితో ఆగకుండా బీర్ తాగుతున్నప్పుడు ఫొటోలు తీసుకున్నారు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ ఫొటోలు కాస్తా వైరల్ అయ్యి, అధికారుల దృష్టికి వెళ్లింది. విషయం తెలుసుకున్న అసిస్టెంట్ బీసీ డెవలప్​మెంట్​ఆఫీసర్​భాగ్యమతి.. హాస్టల్​లోని విద్యార్థులను విచారించారు. తల్లిదండ్రుల పిలిపించారు. వారి ముందు విద్యార్థులకు కౌన్సెలింగ్​ఇచ్చారు.

హస్టల్​లో విద్యార్థులు పార్టీ చేసుకున్నారన్న విషయం తెలియగానే వారిని మందలించినట్లు అసిస్టెంట్ బీసీ డెవలప్​మెంట్​ఆఫీసర్​భాగ్యమతి అన్నారు. వార్డెన్​తో మాట్లాడి పర్మిషన్​ తీసుకున్నారని.. వంటమనిషితోనే చికెన్​ వండించుకున్నారని చెప్పారు. హాస్టల్​వార్డెన్ బయటికి వెళ్లిపోయాక బయటి మిత్రులతో బీరు బాటిళ్లు తెప్పించుకుని తాగారని వివరించారు. హాస్టల్ వార్డెన్ నిర్లక్ష్యం వల్లే వసతి గృహంలో విద్యార్థులు మద్యం సేవించారని వెల్లడించారు. నిర్లక్ష్యంగా ఉన్న వార్డెన్​పై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

hostel students party : హాస్టల్ లో పదో తరగతి విద్యార్థుల మందు పార్టీ.. అత్యుత్సాహం చూపి అడ్డంగా దొరికిపోయారు


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this