Srisailam Reservoir: శ్రీశైలం రిజర్వాయర్‌కు పెనుముప్పు.. నిపుణుల...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

Srisailam Reservoir: శ్రీశైలం రిజర్వాయర్‌కు పెనుముప్పు.. నిపుణుల కమిటీ వార్నింగ్.. ఇంకా..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Expert Commission Warning to Srisailam Dam: దేశంలోని అతి ముఖ్యమైన రిజర్వాయర్లలో ఒకటేనా శ్రీశైలం డ్యామ్ కు ముప్పు పొంచి ఉన్నట్లు కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ AB పాండ్యా కమిటీ హెచ్చరించింది. 

Srisailam Reservoir: శ్రీశైలం రిజర్వాయర్‌కు పెనుముప్పు.. నిపుణుల కమిటీ వార్నింగ్.. ఇంకా.. 

Expert Commission Warning to Srisailam Dam: దేశంలోని అతి ముఖ్యమైన రిజర్వాయర్లలో ఒకటేనా శ్రీశైలం డ్యామ్ కు ముప్పు పొంచి ఉన్నట్లు కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ AB పాండ్యా కమిటీ హెచ్చరించింది. ఎందుకు ముప్పు పొంచి ఉంది, వాటికి పరిష్కారాలను కూడా కమిటీ సూచించింది. సూచనలు అమలు చేయకపోతే డ్యామ్ కు ప్రమాదం ఉందని హెచ్చరించింది.. కాగా.. శ్రీశైలం డ్యామ్ భద్రతపై ఇప్పటికే అనేక కమిటీలు ఏర్పాటు అయ్యాయి. సూచనలు సలహాలు కూడా ఇచ్చాయి. అయితే 2020 ఫిబ్రవరి లో ఏర్పాటైన కేంద్ర జలసంఘం మాజీ చైర్మన్ ఏ బి పాండ్య కమిటీ అతి కీలకమైనది. ఈ కమిటీ డ్యామ్ పరిశీలించి లోతైన తుది నివేదికను అందజేసింది. కమిటీ చైర్మన్ pandiya ఇచ్చిన నివేదికలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. డ్యాం ప్రస్తుతం ఉన్న స్పిల్ వే సామర్థ్యానికి తగ్గట్టుగా లేదని దీంతో ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. దీనికి పలు కారణాలను , పరిష్కారాలను కూడా కమిటీ సూచించింది.

ప్రమాదం ఎందుకు ఉంది అంటే..

  • శ్రీశైలం డ్యామ్ కు అంచనాలకు మించి గరిష్టంగా 26 లక్షల క్యూసెక్కుల వరద నీరు డ్యామ్ కు వచ్చే అవకాశం ఉంది.
  • ప్రస్తుత డ్యామ్ స్పిల్ వే సామర్థ్యం కేవలం 13.2 లక్షల క్యూసెక్కులు మాత్రమే.
  • ఇంకా ఎక్కువ తీసుకుంటే 14.55 లక్షల క్యూసెక్కులకు మించదు.

2009లో లో ఏకంగా 25.5 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం శ్రీశైలం డ్యామ్ ను తాకింది. అప్పట్లోనే స్పిల్వే పైన వరద నీరు ప్రవహించింది. ఇంత భారీ వరద వస్తే అన్ని గేట్లు ఎత్తి 14.8 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదల గలిగారు. దీంతో డ్యాంకు గరిష్ట వరద నీటి కి తగ్గట్లుగా స్పిల్వే సామర్థ్యం లేదని ఋజువైంది. ఇదే విషయాన్ని pandiya కమిటీ ఆధారాలతో సహా నిరూపించి నివేదిక పంపింది.

డ్యామ్ కు ప్రధాన ముప్పు స్పిల్ వే సామర్థ్యం తక్కువగా ఉండటమే కారణమని చెప్తూనే మరికొన్ని కారణాలు కూడా డ్యామ్ కు ప్రమాదంగా ఉన్నాయని సూచించింది. స్పిల్ వే గేట్ల నుంచి నీళ్లు కిందపడి మళ్లీ ఎగిరే ప్రాంతం ప్లంజ్ పూల్ లో ఏర్పడిన భారీ గొయ్యి డ్యామ్ కు ప్రమాదంగా ఉన్నట్లు హెచ్చరించింది.. ఈ గొయ్యి పూడ్చివేత కు తక్షణమే చర్యలు చేపట్టాలని హెచ్చరించింది. ప్లంజ పూల్ కు ఉన్న కుడి ఎడమ గట్లను తదుపరి నష్టం రాకుండా కార్యాచరణ చేపట్టాలి. రివర్స్ స్లూయిస్ గేట్లు అత్యవసర సమయంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున దృష్టి సారించాలి ఇప్పుడే.. అని పాండ్యా కమిటీ హెచ్చరించింది.

ప్రమాదం జరగకుండా పరిష్కార మార్గాలను కూడా పాండ్యా కమిటీ పలు సూచనలు చేసింది.

  • గరిష్ట వరద ప్రవాహానికి స్పిల్ వే సామర్థ్యం తక్కువగా ఉన్నందున డ్యామ్ కు ఎగువ భాగంలో ఐదు కిలోమీటర్ల దగ్గర మరో స్పిల్వే నిర్మించాలి.
  • స్పిల్ వే నిర్మిస్తే దానికి బ్రిచింగ్ సెక్షన్ ఉండాలి అంటే అత్యవసరమైతే గండి కొట్టేలా స్పిల్వే నిర్మించాలి.
  • మరో స్పిల్వే నిర్మించ లేనిపక్షంలో డ్యాం ఎత్తు పెంచాలి.
  • స్పిల్వే సామర్థ్యానికి మించి వరదలు వస్తే కొంత వరదలు కుడివైపు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీటిని మళ్లించాలి.
  • ఎడమ వైపున ఎగువ భాగంలో నీటిని మళ్లించడానికి అనువైన ప్రాంతం కూడా ఉంది.
  • కేంద్ర జల సంఘం, ఐఎండి వద్ద వరదనీటి అంచనాకు అత్యాధునిక వ్యవస్థలు ఉన్నాయి. వీటి ద్వారా పసిగట్టి డియల్ లోని నీటిని ముందుగానే ఖాళీ చేయడం ద్వారా ప్రమాదాన్ని నియంత్రించవచ్చు.
  • ప్రస్తుత స్పిల్వే కు ఎక్కువ ఎత్తులో గేట్లు ఉండేలా మార్పుచేయడం, స్పిల్ వే క్రస్ట్ లెవెల్ తగ్గించడం పై ఆలోచించాలి. ప్రస్తుత గరిష్ట నీటి నిల్వకు తగ్గట్టుగా డ్యాం ఎత్తు పెంచితే ముంపు ప్రాంతాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని AB పాండ్య కమిటీ సూచించింది.
  • డ్యాం కుడి ఎడమ వైపుల నుంచి నీటిని మళ్లించేందుకు ఏర్పాట్లు చేయాలని కమిటీ సిఫారసు చేసింది.

కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ పాండ్య తుది నివేదిక ఇచ్చినందున దాని అమలు ఎంతవరకు ఎప్పటిలోగా సాధ్యమవుతుంది అనేది వేచి చూడాలి.

srisailam reservoir: శ్రీశైలం రిజర్వాయర్‌కు పెనుముప్పు.. నిపుణుల కమిటీ వార్నింగ్.. ఇంకా..


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this