TelanganaHyderabadCharminar Clock : ‘పగిలిన పాత జ్ఞాపకం’.....

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

Charminar Clock : ‘పగిలిన పాత జ్ఞాపకం’.. అప్రమత్తమైన అధికారులు.. చార్మినార్‌ గడియారాల చరిత్ర తెలుసా..?

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Charminar Clock చార్మినార్‌లో ధ్వంసమైన గడియారానికి రిపేర్లు ప్రారంభించారు ఆర్కియాలజీ విభాగం సిబ్బంది. మరమ్మతు పనుల్లో భాగంగా నిన్న తూర్పు వైపున ఉన్న పురాతన గడియారం ధ్వంసమైంది. గోవ పైప్‌లు తీస్తుండగా 135 ఏళ్ల నాటి గడియారానికి పైపులు తగిలాయి. దీంతో డయల్‌ బోర్డు దెబ్బతిన్నది. వెంటనే రంగంలోకి దిగిన ఆర్కియాలజీ విభాగం రిపేర్లు చేస్తోంది. పాక్షికంగా ధ్వంసమైనా గడియారం పనిచేస్తూ సరైన సమయాన్ని సూచిస్తోంది. చార్మినార్.. అంతర్జాతీయ ఐకానిక్ చారిత్రక కట్టడం.

Charminar Clock

Charminar Clock చార్మినార్‌కే కాదు, దాని మీదున్న గడియారాలకు కూడా ఘన చరిత్ర ఉంది. చారిత్రక కట్టడానికి నాలుగు వైపులా గడియారాలు ఉంటాయి. 1889లో చార్మినార్‌కు నలువైపులా గడియారాలను అమర్చారు. వీటిని నాటి పాలకులు లండన్‌ నుంచి ప్రత్యేకంగా దిగుమతి చేసుకున్నారు. నేటికీ ఆ గడియారాలు సమయాన్ని సక్రమంగా తెలియజేస్తున్నాయి. ప్రతి 24 గంటలకు ఒకసారి గడియారాలకు కీ ఇవ్వడం వల్ల సరైన టైంను తెలియజేస్తున్నాయి. 135 ఏళ్ల ఘన చరిత్ర ఉన్న పురాతన గడియారం ప్లేస్‌లో కొత్తది అమర్చుతారా? లేక దానికే రిపేర్ చేస్తారా అన్న సందేహం వీడింది. ఉన్న దానికే రిపేర్లు చేపట్టారు. అయితే.. చార్మినార్ నిర్మాణానికి సంబంధించిన చరిత్ర భవిష్యత్ తరాలకు తెలిసేలా చర్యలు చేపట్టాలని సందర్శకులు సూచిస్తున్నారు.

అసలేం జరిగిందంటే..

కాగా..Charminar Clock  గత కొంత కాలంగా చార్మినార్‌ దగ్గర మరమ్మతు పనులు జరుగుతున్నాయి. దీంతో ఇనుప పైప్‌లతో గోవ నిర్మించారు. గోవా పైప్‌లు తీస్తుండగా ఒక్కసారిగా ఈస్ట్‌ వైపు ఉన్న గడియారానికి పైపులు తగలడంతో ధ్వంసమైంది.. డయల్‌ బోర్డు పూర్తిగా దెబ్బతింది. అయితే.. డయల్‌ బోర్డు కొత్తది చేయడం కాస్త కష్టంతో కూడుకున్న నేపథ్యంలో మరమ్మతులు చేయడం ప్రారంభించారు. చార్మినార్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన గడియారం పగిలిపోవడంతో అధికారులు అప్రమత్తమై.. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు.

Source: TV9 Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this