EntertainmentTop OTT movies ఈ వారం OTT...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

AP Mandal Wise Surplus Teachers List 2026: Check District & Mandal Details

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మరియు ఉపాధ్యాయుల బదిలీలు (AP Teachers Transfers) లేదా...

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

సుప్రీంకోర్టు తీర్పు: టెట్ (TET) అర్హత గడువు 2028 వరకు పొడిగింపు | Supreme Court TET Verdict

సుప్రీంకోర్టు తీర్పు: ఉపాధ్యాయులకు టెట్ (TET) అర్హత గడువు పొడిగింపు ఉపాధ్యాయ అర్హత...

Top OTT movies ఈ వారం OTT లో అందరి చూపు ఆ 4 సినిమాల మీదే.. అవేంటంటే!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Top OTT movies ప్రతి వారం చాలానే సినిమాలు ఓటీటీ లోకి వస్తున్నా కూడా.. వాటిలో చూడదగిన సినిమాలు మాత్రం కేవలం కొన్నే ఉంటాయి. పైగా ఆ సినిమాలే ఓటీటీ లో బెస్ట్ గా నిలుస్తాయి. అలా ఇప్పటివరకు ఎన్నో సినిమాలు , సిరీస్ లు ఓటీటీ లో రాగా… వాటిలో ప్రేక్షకులను మెప్పించిన సినిమాలు మాత్రం కొన్నే. పైగా థియేటర్ లో హిట్ కానీ సినిమాలు సైతం ఓటీటీ లోకి వచ్చిన తర్వాత మాత్రం పాజిటివ్ టాక్ తో ట్రేండింగ్ తో దూసుకుపోతున్నాయి. ఆల్రెడీ గత వారం రిలీజ్ అయినా సినిమాలో ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి. మరి ఈ వారం ఓటీటీ లోకి రాబోయే సినిమాలలో చూడదగిన సినిమాలేంటో .. అవి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయనే విషయాలను చూసేద్దాం.

Top OTT movies బృందా వెబ్ సిరీస్

వెబ్ సిరీస్ లను ఇప్పుడు అందరు ఎంతో బాగా ఆదరించడంతో.. కనీసం వారంలో ఒక కొత్త వెబ్ సిరీస్ నైనా రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. పైగా తెలుగు కంటెంట్ కు ఆదరణ బాగా పెరగడంతో.. వరుసగా ఈ మధ్య కాలంలో ఎక్కువ తెలుగు సిరీస్ లే రిలీజ్ అయ్యాయి. ఈ క్రమంలో ఇప్పుడు త్రిష నటించిన “బృందా” వెబ్ సిరీస్.. ఆగష్టు 2 నుంచి సోనీలివ్ లో స్ట్రీమింగ్ కు రెడీ అయిపోతుంది. అది కూడా తెలుగులో. కాబట్టి ఎంచక్కా ఈ సిరీస్ వీకెండ్ వాచ్ లిస్ట్ లో యాడ్ చేసేసుకోండి.

మాడర్న్ మాస్టర్స్: ఎస్ఎస్ రాజమౌళి

this week ott special movies

దర్శక ధీరుడు రాజమౌళి పై డాక్యుమెంటరీ అంటే.. మాటలు కాదు. దీని గురించి అనౌన్స్ చేసిన దగ్గర నుంచి కూడా .. ఇది ఎలా ఉంటుందా.. ఎప్పుడెప్పుడు చూద్దామా అని అంతా ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ డాక్యుమెంటరీ కూడా ఆగష్టు 2 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు రానుంది. దీనిలో రాజమౌళి పై కొంతమంది టాలీవుడ్ , బాలీవుడ్ స్టార్స్ చెప్పే అభిప్రాయాలను కూడా చూడొచ్చు. కాబట్టి ఈ వారం ఈ డాక్యుమెంటరీ ని అసలు మిస్ చేయకుండా చూసేయండి.

డ్యూన్: పార్ట్ 2

this week ott special movies

హాలీవుడ్ మూవీ డ్యూన్ కు విశేష ఆదరణ లభించడంతో.. దానికి కంటిన్యుషన్ గా తెరకెక్కించిన సినిమా డ్యూన్ పార్ట్ 2. ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి చాలా కాలమే అయింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయిపోతుంది. ఈ సినిమా ఆగష్టు 2 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ జియో సినిమాలో స్ట్రీమింగ్ కానుంది.

కింగ్‌‌డమ్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్

this week ott special movies

ఈ సినిమా 2024లో విడుదల అయింది. ఈ సినిమాకు.. వెస్ బాల్ దర్శకత్వం వహించారు. అయితే ఈ మూవీ.. వార్ ఫర్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ అనే సినిమాకు సిక్వెల్. కింగ్‌డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ మూవీ.. డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కొనుగోలు చేసింది. కాగా ఈ సినిమా ఆగష్టు 2 నుంచి తెలుగు, హిందీ , ఇంగ్లీష్ , తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కు రానుంది.

ప్రస్తుతానికైతే ఈ వీకెండ్ వాచ్ లిస్ట్ లో అస్సలు మిస్ చేయకుండా చూడాల్సిన సినిమాలు ఇవే. ఇవి కాకుండా వీకెండ్ లోపు ఇంకా కొత్త సినిమాలు వచ్చే అవకాశలు లేకపోలేదు.

Source: iDreampost


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this