NationalUPSC aspirants death : ఈ ప్రమాదానికి...

AP Inter Results 2026 Today Live: Direct Links for 1st & 2nd Year Results, WhatsApp Mana Mitra Process, SMS Method

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్...

AP SSC Hall Ticket 2026 Released – Download 10th Class Hall Ticket

The Board of Secondary Education Andhra Pradesh (BSEAP) has...

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

UPSC aspirants death : ఈ ప్రమాదానికి ముందు దృశ్యాల వీడియో వైరల్

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

UPSC aspirants death ఢిల్లీలో భారీ వర్షాల కారణంగా.. ఓల్డ్ రాజేంద్రనగర్‌లో వరద నీరు పోటెత్తింది. దీంతో రావుస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ బేస్‌మెంట్లోకి భారీగా వరద నీరు ప్రవేశించింది. ఈ ఘటనలో ముగ్గురు సివిల్స్ ఆశావహులు మృతి చెందారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఈ ప్రమాదానికి మందు తీసిన ఓ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

UPSC aspirants death

వరద నీరు బేస్‌మెంట్‌లోకి ప్రవేశించడంతో.. లోపలున్న విద్యార్థులు బయటకు వస్తున్న దృశ్యాలు నీటిలో నుంచి మెట్లు ద్వారా బయటకు వస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. లోపల ఉన్న విద్యార్థులు త్వరగా. త్వరగా బయటకు రావాలని ఓ వ్యక్తి సూచించడంతోపాటు.. లోపల ఇంకా ఎవరైనా ఉన్నారా? అని ప్రశ్నించడం కూడా ఈ వీడియోలో కనిపిస్తుంది. ఇక లోపల ఉన్న విద్యార్థులు బయటకు వచ్చే లోపే వరద నీరు.. వారిని చుట్టుముట్టి ఉంటుందని పోలీసులు సైతం భావిస్తున్నారు.

UPSC aspirants death ప్రమాద ఘటనపై సర్వత్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అలాగే ఈ ఘటనకు సంబంధించి భవనం యజమాని, కో ఆర్డినేటర్‌తోపాటు పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 13 కోచింగ్ సెంటర్లను ఢిల్లీ నగర పాలిక సంస్థ అధికారులు సీజ్ చేశారు. ఇక ఈ ఘటనపై రాజకీయ పార్టీలు స్పందించారు.

లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అయితే.. ప్రభుత్వ సంస్థల నిర్లక్ష్యం వల్ల సామాన్యడు మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక బీజేపీ అయితే..ఢిల్లీలో కొలువు తీరిన ఆమ్ ఆద్మీ పార్టీపై మండిపడుతుంది. దేశ రాజధాని నగరంలో మౌలిక సదుపాయాలు కల్పనలో లోపం.. ఈ ఘటన ద్వారా స్పష్టంగా కనిపిస్తుందని ఆరోపిస్తుంది.

అంతేకాదు… ఇది ప్రభుత్వ చేసిన హత్య అన్నట్లుగా బీజేపీ అభివర్ణిస్తుంది. శనివారం సాయంత్రం కురిసిన భారీ వర్షం కారణంగా.. ముగ్గురు సివిల్స్ ఆశావహులు మృతి చెందారు. తానియా సోని (25), శ్రియా యాదవ్ (25), నవీన్ డెల్విన్ (25) మృతి చెందిన సంగతి తెలిసిందే.

Crime news: పరువు పోగొట్టుకున్న ప్రభుత్వ టీచర్‌ .. ఛీ ఆ పని చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు

Updated Date – Jul 29 , 2024 | 01:57 PM

Source: AP7AM


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this