EntertainmentCinemaPawan Kalyan - Kalyani: ఈ ఫొటోలో...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

AP Mandal Wise Surplus Teachers List 2026: Check District & Mandal Details

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మరియు ఉపాధ్యాయుల బదిలీలు (AP Teachers Transfers) లేదా...

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

సుప్రీంకోర్టు తీర్పు: టెట్ (TET) అర్హత గడువు 2028 వరకు పొడిగింపు | Supreme Court TET Verdict

సుప్రీంకోర్టు తీర్పు: ఉపాధ్యాయులకు టెట్ (TET) అర్హత గడువు పొడిగింపు ఉపాధ్యాయ అర్హత...

Pawan Kalyan – Kalyani: ఈ ఫొటోలో పవర్ స్టార్‌తో ఉన్న అమ్మాయిని గుర్తుపట్టారా..? ఆమె ఎవరో తెలుసా..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Pawan Kalyan – Kalyani పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన  అత్తారింటికి దారేది సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాతో పవర్ స్టార్ భారీ విజయాన్ని అందుకున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కలెక్షన్స్ పరంగా కుమ్మేసింది. శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి పతాకంపై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించగా 2013లో ఈ సినిమా విడుదలైంది. పవన్ కళ్యాణ్, సమంత జంటగా నటించిన ఈ సినిమాలో బొమన్ ఇరానీ, నదియా, ప్రణీత, బ్రహ్మానందం ముఖ్య పాత్రలు పోషించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. ఇక ఈ సినిమాలో భారీ విజయం సాధించడంతో పవన్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. గబ్బర్ సింగ్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన ఈ సినిమా భారీ విజయం సాధించింది.

ఇక ఈ సినిమాలోని సాంగ్స్ అన్ని సూపర్ హిట్ గా నిలిచాయి. అత్తారింటికి దారేది సినిమాలోని పాటలన్ని ఇప్పటికీ అలరిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో పవన్ ఓ పేరడీ సాంగ్ చేశారు. ఈ సాంగ్ లో పవన్ బాబాజీ గెటప్ లో కనిపించి ఆకట్టుకున్నారు. ఇక పై ఫొటోలో పవన్ కళ్యాణ్ తో ఉన్న అమ్మాయిని గుర్తుపట్టారా.? చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో సైడ్ డాన్సర్ గా కనిపించింది ఆమె.

ఆమె పేరు కళ్యాణి.. చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది కళ్యాణి. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే కళ్యాణికి చాలా ఇష్టం. ఆయన తో చాలా ఫోటోలు దిగింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహరవీరమల్లు సినిమాలోనూ కళ్యాణి నటిస్తుంది. ఆ షూటింగ్ సెట్ లో ఆయనతో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కళ్యాణి తన ఫోటోలు, రీల్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.

Source: TV9 Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this