EntertainmentPayal Malik – Arman Malik :...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

Payal Malik – Arman Malik : ఇద్దరు భార్యల ముద్దుల మొగుడు.. బిగ్‌బాస్ దెబ్బకి ఒక భార్య విడాకులు..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Payal Malik – Arman Malik : బాలీవుడ్ యూట్యూబర్‌ ఆర్మాన్ మాలిక్‌.. పాయల్, కృతిక అనే ఇద్దర్ని పెళ్లి చేసుకొని, ఇద్దరితో కలిసి సంసారం చేస్తూ ముగ్గురు కలిసి ఓ యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ పాపులర్ అయ్యారు. ఇటీవల హిందీలో బిగ్‌బాస్‌ ఓటీటీ సీజన్‌ -3 మొదలవ్వగా ఈ షోకి యూట్యూబర్‌ ఆర్మాన్ మాలిక్‌, అతని ఇద్దరు భార్యలు కూడా వచ్చారు. అయితే మొదటి వారమే అర్మాన్ భార్యల్లో ఒకరైన పాయల్ ఎలిమినేట్ అయింది.

దీంతో పాయల్ బయటకి వచ్చిన దగ్గర్నుంచి సంచలన వ్యాఖ్యలు చేస్తూనే ఉంది. తన భర్తకి అంతకుముందు కూడా ఒక పెళ్లి అయి, విడాకులు ఇచ్చాడని చెప్పింది. అయితే తాజాగా ఆర్మాన్ కి విడాకులు ఇస్తానని చెప్పి షాక్ ఇచ్చింది.

బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక పాయల్ పై ట్రోల్స్ రాగా పాయల్ మీడియాతో మాట్లాడుతూ.. మా లైఫ్ లో ట్రోల్స్ చాలా కామన్. ఆర్మాన్ ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అన్నప్పుడు మొదట నేను ఒప్పుకోలేదు. కానీ తర్వాత అర్ధం చేసుకొని అందరం హ్యాపీగా కలిసి ఉంటున్నాం. నేను, కృతిక ఇద్దరం ఆర్మాన్ ని లవ్ చేస్తున్నాం. కానీ ఇప్పుడు పరిస్థితులు వేరేగా ఉన్నాయి. నేను నా భర్తతో విడిపోవాలనుకుంటున్నాను. నిర్ణయం తీసేసుకున్నాను నేను నా పిల్లలను తీసుకొని వెళ్తాను. కృతిక బాబు నా పిల్లలు లేకుండా ఉండలేడు. కావాలంటే పిల్లలందర్నీ నేను పెంచుతాను. ఆర్మాన్ కృతికతో ఉండొచ్చు అని తెలిపింది. దీంతో పాయల్ మాలిక్ బాలీవుడ్ లో చర్చగా మారింది.

అయితే నాలుగేళ్లుగా ఇద్దరు భార్యలతో హ్యాపీగా ఉంటున్న అర్మాన్ కి ఇలా అవ్వడంతో అందరూ ఎందుకు అని చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఆర్మాన్, అతని రెండో భార్య కృతిక బిగ్ బాస్ లోనే ఉన్నారు కాబట్టి ఈ విషయాలు ఇంకా తెలిసాయా లేదా అనేది సందేహమే. మరి బయటకు వచ్చాక వాళ్ళు పాయల్ వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారో చూడాలి. పాయల్ ఆర్మాన్ కి డైవర్స్ ఇస్తాను అని చెప్పడంతో ఇన్నేళ్ళుగా ఇద్దరు భార్యలు కలిసి ఉన్నా బిగ్ బాస్ దెబ్బకే ఇలా అవుతుందని, బిగ్ బాస్ లో ఆర్మాన్ పాయల్ ని పట్టించుకోలేదని, కావాలని పాయల్ ని ఫస్ట్ వీక్ లోనే ఎలిమినేట్ చేసారని అందుకే పాయల్ బాధపడి ఈ డెసిషన్ తీసుకుందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.

Source: 10TV Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this