EducationSonu Sood: 'నీ చదువు ఆపొద్దు తల్లి'.....

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

AP Mandal Wise Surplus Teachers List 2026: Check District & Mandal Details

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మరియు ఉపాధ్యాయుల బదిలీలు (AP Teachers Transfers) లేదా...

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

సుప్రీంకోర్టు తీర్పు: టెట్ (TET) అర్హత గడువు 2028 వరకు పొడిగింపు | Supreme Court TET Verdict

సుప్రీంకోర్టు తీర్పు: ఉపాధ్యాయులకు టెట్ (TET) అర్హత గడువు పొడిగింపు ఉపాధ్యాయ అర్హత...

Sonu Sood: ‘నీ చదువు ఆపొద్దు తల్లి’.. ఏపీ విద్యార్థినికి అండగా సోనూ సూద్‌.. సాయం చేస్తానని మాటిచ్చిన నటుడు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

బాలీవుడ్ ప్రముఖ నటుడు సోనూ సూద్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రార్థించే పెదవులు కన్నా..సాయం చేసే చేతులు మిన్న అన్న మాటను అక్షరాల ఆచరణలో పెడుతున్నాడీ హ్యాండ్సమ్ హీరో. ఎన్నో సినిమాల్లో విలన్ పాత్రలు పోషించిన సోనూ సూద్ నిజ జీవితంలో రియల్ హీరోగా వెలుగొందుతున్నాడు. కరోనా సమయంలో వేలమందికి అండగా నిలిచి తన గొప్ప మనసును చాటుకున్నారాయన. కరోనా తర్వాత పరిస్థితులు మెరుగు పడినా తన సమాజ సేవను కొనసాగిస్తున్నారు. సొంతంగా ‘సోనూ ఫౌండేషన్’ స్థాపించి అడిగిన వారందరికీ ఏదో ఒక విధంగా సాయం చేస్తున్నాడు. ఇందులో భాగంగా పేద విద్యార్థులకు ఆర్థిక సాయం కూడా అందజేస్తున్నారు. అలా తాజాగా మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకున్నాడు సోనూ సూద్. ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ఒక విద్యార్థిని ‘నా చదువుకు హెల్ప్ చేయండి సార్‌’ అని వేడుకుంటోన్న వీడియోను ఓ నెటిజన్‌ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఇది చూసిన సోనూ సూద్ వెంటనే స్పందించాడు. ‘నీ చదువును ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపొద్దు. కాలేజీకి వెళ్లడానికి సిద్ధంగా ఉండు’ అంటూ రిప్లై ఇచ్చారు. దీంతో ఆ విద్యార్థిని కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేవు.

ఆంధ్రప్రదేశ్‌లో బనవనూరుకు చెందిన మాదిగ దేవీ కుమారి అనే అమ్మాయి బీఎస్ సీ చదవాలనుకుంటోంది. అయితే కటిక పేదరికం ఆమె చదువుకు అడ్డు పడుతోంది. దీంతో ‘ నా చదువుకు హెల్ప్ చేయండి సార్’ అంటూ అందరినీ వేడుకుంటోంది. ఈ క్రమంలోనే ఒక నెటిజన్ దేవీ కుమారి వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీనిని చూసిన సోనూ సూద్ వెంటనే స్పందించాడు. ‘నీ చదువును ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపొద్దు తల్లి.. కాలేజీకి వెళ్లడానికి సిద్ధంగా ఉండూ’ అని రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం సోనూ సోద్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు ‘సోనూసూద్ రియల్ హీరో’ అంటూ క్రేజీ కామెంట్లు పెడుతున్నారు.

సోనూ సూద్ రిప్లై ఇదిగో..

ఇక సినిమాల విషయానికి వస్తే.. గతేడాది కన్నడ, తమిళ సినిమాల్లో నటించాడు సోనూ సూద్. ప్రస్తుతం ‘ఫతేహా’ అనే సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాకు అతనే దర్శకత్వం కూడా వహించనున్నాడు.

భారీ వర్షంలోనూ ప్రజల సమస్యలు తెలుసుకుంటోన్న రియల్ హీరో సోనూసూద్..

విద్యార్థులతో సోనూసూద్..

Source: TV9 Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this