EntertainmentCinemaRelease clash : ఏమప్పా కన్నప్ప …ఏంటి...

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

Release clash : ఏమప్పా కన్నప్ప …ఏంటి పుష్పా ఇది..!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

సినిమాల రిలీజ్ విషయంలో టాలీవుడ్ లో ఎప్పుడు గందరగోళం నడుస్తూనే ఉంటూనే ఉంటుంది. ఒక్కోసారి అది పంచాయతీ పెట్టి సమస్యను పరిష్కరించే వరకు వెళ్తుంది. మేము ముందు డేట్ వదిలాం అంటే లేదు మేము వదిలాము అని వాదనలు, ప్రతివాదనలు కామన్. తాజాగా ఇండస్ట్రీలో మరోసారి రెండు సినిమాల మధ్య క్లాష్ ఏర్పడే పరిస్థితి వచ్చేలా ఉంది.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ ల పుష్ప ఎంతటి సంచలనాలు సృష్టించిందో విదితమే. ఆ చిత్రానికి కొనసాగింపుగా రాబోతున్న చిత్రమే పుష్ప -2. దాదాపు రెండు సంవత్సరాలుగా షూటింగ్ చేస్తూనే ఉన్నారు. ఆగస్టు నుండి పోస్ట్ పోన్ అయి డిసెంబరు 6న  విడుదల చేస్తామని ప్రకటన కూడా చేసారు. కానీ ఇప్పటికి ఇంకా నెల రోజులకు పైగా షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. కొత్త షెడ్యూల్ జులై 2 మొదలు పెట్టాల్సి ఉండగా క్యాన్సిల్ అయింది. దీంతో పుష్ప -2 విషయంలో అనేక రూమర్స్  వినిపించాయి. వాటిని నిజం చేస్తూ షూట్ ఆపేసి హీరో, దర్శకులు చెరో విమనం ఎక్కేసారు. బన్నీ గడ్డం కూడా తీసేసిన వీడియోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి.

ఇదిలా ఉండగా పుష్ప-2 డిసెంబర్ 6న  రాదని ఆ డేట్ కి వచ్చేలా మంచు విష్ణు నటిస్తున్న కన్నప్ప టీమ్ ఏర్పాట్లు చేసుకున్నారు. పుష్ప రాదనే నమ్మకంతో మేము డిసెంబరు 6కు వచ్చేసాం అంటోంది కన్నప్ప యూనిట్. కానీ పుష్ప ప్రస్తుతం ఎడిటింగ్ వర్క్ జరుగుతుందని త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేస్తామని ఎట్టి పరిస్థితుల్లో పుష్ప 2 డిసెంబర్ 6న విడుదల చేయడం పక్కా అని యూనిట్ సభ్యులు తెలిపారు. దీంతో తాము వెనక్కి తగ్గేది లేదని డిసెంబరు 6న రిలీజ్ చేస్తామని  తన వ్యక్తిగత ‘X’ ఖాతాలో పోస్ట్ పెట్టారు కన్నప్ప నిర్మాత కమ్ హీరో విష్ణు మంచు.

Source: NTV Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this