CrimeNoida: కర్కశులుగా మారిన సహోద్యోగులు.. బ్యాంక్ మహిళా...

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

సుప్రీంకోర్టు తీర్పు: టెట్ (TET) అర్హత గడువు 2028 వరకు పొడిగింపు | Supreme Court TET Verdict

సుప్రీంకోర్టు తీర్పు: ఉపాధ్యాయులకు టెట్ (TET) అర్హత గడువు పొడిగింపు ఉపాధ్యాయ అర్హత...

Thalliki Vandanam Scheme 2026-27: డేటా పరిశీలనలో ఈ 5 పొరపాట్లు చేయకండి!

Thalliki Vandanam Scheme 2026-27 డేటా పరిశీలనపై పూర్తి వివరాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

SSC Memo Download 2026: AP SSC Short Memos Available Online at BSE.AP.GOV.IN

ఆంధ్రప్రదేశ్ మాధ్యమిక విద్యా బోర్డు విడుదల చేసిన SSC Memo Download...

Noida: కర్కశులుగా మారిన సహోద్యోగులు.. బ్యాంక్ మహిళా ఉద్యోగి ఆత్మహత్మ

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఆమె ఒక ప్రైవేటు బ్యాంక్‌లో ఉద్యోగి. తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతుంది. అదే సహోద్యోగులకు రుచించలేదు. నిత్యం ఆమెకు నరకం చూపించారు. క్షణం.. క్షణం కుమిలిపోయింది. అనేక రకాలుగా వేధింపులకు పాల్పడ్డారు. ఇక టర్చర్ భరించలేక.. ఈ లోకాన్ని విడిచిపెట్టేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో అర్ధాంతరంగా తనువు చాలించింది. ఈ ఘటన నోయిడా యాక్సిస్ బ్యాంక్‌లో చోటుచేసుకుంది.

27 ఏళ్ల శివాని త్యాగి నోయిడాలో యాక్సిస్ బ్యాంకులో ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తుంది. అయితే ఆమె సహోద్యోగులు పనిగట్టుకుని తీవ్ర వేధింపులకు గురి చేశారు. మానసికంగా, శారీరకంగా చిత్రహింసలకు గురిచేశారు. దీంతో ఈ వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంది. తోటి ఉద్యోగుల వేధింపులు భరించలేక శివాని ప్రాణం తీసుకుందని కుటుంబ సభ్యులు తెలిపారు.

2023, అక్టోబర్‌లో శివాని కంపెనీలో చేరింది. శివాని శాకాహారిని.. కానీ తోటి ఉద్యోగి జ్యోతి.. మధ్యాహ్న భోజనంలో మాంసాహారం కలిపేది. దీంతో ఆమె ఒంటరిగా తినాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆమె రాజీనామా చేసినా ఆమోదించలేదు. ఇక ఇంట్లోనే ఒంటరిగా ఏడూస్తూ ఉండేదని బాధితురాలి సోదరుడు తెలిపాడు. పలుమార్లు కొట్టడం.. జుట్టు పట్టుకుని లాకడం.. వ్యక్తిగత ఖాతాలోంచి డబ్బులు కూడా తీసుకున్నారని వాపోయాడు. పరిధి దాటి వాట్సాప్‌ గ్రూపుల్లో ఆమెను ట్రోలింగ్‌ చేసే స్థాయికి చేరుకుంది. ఆ బాధలు భరించలేక ఘజియాబాద్‌లోని తన నివాసంలో శుక్రవారం ఉరేసుకుని చనిపోయింది.

ఆమె గదిలో దొరికిన సూసైడ్‌ లేఖ ఆధారంగా పోలీసులు ఈ విషయాన్ని ధృవీకరించారు. ‘సూటిపోటి మాటలతో అన్నింటా అవమానిస్తూ వస్తున్నారు.. ఆఫీస్‌ వాట్సాప్‌ గ్రూప్‌లోనూ అది కొనసాగింది. భరించలేకపోతున్నా. తమ్ముడూ.. అమ్మానాన్న, చెల్లి జాగ్రత్త’ అని సూసైడ్‌ నోట్‌ రాసిందామె. లేఖలో మృతురాలు ఐదుగురి పేర్లు ప్రస్తావించింది. పని ప్రాంతంలో ఆమె వేధింపులు ఎదుర్కొందన్న విషయం లేఖ ద్వారా స్పష్టమైంది అని ఘజియాబాద్‌ డీసీపీ గ్యానన్‌జయ్‌ సింగ్‌ మీడియాకు కేసు వివరాల్ని వివరించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, ఆమెను ట్రోలింగ్‌ చేసేందుకే ఓ వాట్సాప్‌ గ్రూప్‌ క్రియేట్‌ చేసినట్లు గుర్తించినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు బ్యాంకు ఉద్యోగులు, గుర్తుతెలియని వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ఇక ఈ ఘటనపై సంస్థ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని పేర్కొంది.

Source: NTV Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this