Uncategorizedమళ్లీ నమోదు చేసుకుంటేనే..ఓటు REGISTER FOR MLC...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

మళ్లీ నమోదు చేసుకుంటేనే..ఓటు REGISTER FOR MLC VOTE

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 తాజా ఓటరు జాబితాతోనే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు

గతంలో ఓటరుగా నమోదైన వారి ఓట్లన్నీ రద్దు

ఆన్‌లైన్లో ఫారం-19 ద్వారా ఓటరుగా నమోదు

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు తాజా ఓటర్ జాబితానే ఎన్నికల సంఘం వినియోగించనుంది. 

గతంలో ఓటుహక్కు పొంది ఉన్నా సరే వారు మళ్లీ కొత్తగా ఓటరు జాబితాలో పేరు చేర్పు కోసం దరఖాస్తు చేసుకోవాల్సిందే. లేకుంటే వారికి ఓటు హక్కు ఉండదు.

అర్హులైన ఉపాధ్యాయులు ఓటు హక్కు కోసం ఫారం-19లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సీఈవో ఆంధ్ర.ఎన్ ఐసీ.ఇన్ వెబ్ సైట్లో ఇప్పటికే ఓటరు నమోదు కోసం ఉపాధ్యాయులకు అవకాశం కల్పించారు. 

 ఆన్లైన్ లో రిజిస్టర్ అయ్యేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

[post_ads]

ఈ నెలాఖరు వరకు సమయం ఉన్నప్పటికీ ముందుగానే దరఖాస్తు చేసుకోవడం మంచిదని ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు.

2015లో ఈ నియోజకవర్గానికి ఎన్నికలు జరిగినప్పుడు రెండు జిల్లాల నుంచి మొత్తం 18,931 మంది ఉపాధ్యాయులు ఓటర్లుగా నమోదయ్యారు. 

అయితే ఆ ఎన్నికల్లో మూడువేల మంది వరకు ఓటుహక్కుని వినియోగించుకోలేకపొయారు. ఈ దఫా కూడా ఇంచుమించుగా అంతే సంఖ్యలో ఓటర్లు నమోదు అయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.

ఉపాధ్యాయ స్కూల్ అసింట్ అంతకంటే ఎక్కువ ర్యాంకు కలిగిన వారికే ఓటరుగా నమోదు అయ్యే అవకాశం ఉన్నది.

జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ కళాశాల అధ్యాపకులు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లకు అర్హత ఉంటుంది.

ప్రభుత్వ గుర్తింపు పొందిన స్కూళ్లలో మూడేళ్ల కంటే ఎక్కువ సీనియారిటీ కలిగిన ఉపాధ్యాయులకు కూడా ఓటుహక్కు పొందవచ్చు. అయితే దీనిపై తగిన అవగాహన లేకపోవడంతో గత ఎన్నికల్లో చాలామంది ఓటుహక్కు పొందలేకపోయారు.

ఓటరుగా నమోదు చేసుకొనేందుకు నెలరోజుల గడువు ఉన్నందున ప్రభుత్వ విద్యాసంస్థలు, గవర్నమెంట్ గుర్తింపు పొందిన విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఓటరుగా నమోదు చేసుకోవచ్చు.

ప్రభుత్వ విద్యాసంస్థల్లో కంటే గుర్తింపు పొందిన వాటిల్లో ఎక్కువమంది ఉన్నారు. అయితే వారు అందుకు తగిన ఆధారాలను నివేదించాల్సి ఉంటుంది.

ఉపాధ్యాయులుగా పనిచేస్తూ ఓటుహక్కు పొందలేకపోతున్నస్కూల్ అసిస్టెంట్ కంటే తక్కువ ర్యాంకు ఉపాధ్యాయులు తమకు కూడా ఈ దఫా ఓటుహక్కు కల్పించాలని కోరుతున్నారు. ఈ మేరకు ఎన్నికల సంఘానికి వారు విజ్ఞప్తులు పంపుతున్నారు.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this