Babita phogat Sister: ఓటమిని భరించలేక ‘దంగల్‌...

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

Babita phogat Sister: ఓటమిని భరించలేక ‘దంగల్‌ సిస్టర్‌’ ఆత్మహత్య.. ఒక్క పాయింట్ తేడాతో మ్యాచ్‌ ఓడిపోవడంతో..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Babita phogat Sister: ప్రముఖ మహిళా రెజ్లర్‌ బబితా ఫోగాట్‌ సోదరి
(కజిన్‌ సిస్టర్‌) రితికా ఫోగాట్‌ ఓటమిని భరించలేక ఆత్మహత్య చేసుకున్న
సంఘటన యావత్‌ క్రీడా ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసింది. ఒక్క చిన్న ఓటమికే
తనువు చాలించడం పట్ల అందరూ విచారం వ్యక్తం చేస్తున్నారు.

వివరల్లోకి వెళితే.. 17 ఏళ్ల రితికా ఫోగట్‌ మహావీర్‌ ఫోగట్‌ అకాడమీలో గత
ఐదేళ్లుగా రెజ్లింగ్‌ క్రీడలో శిక్షణ తీసుకుంటోంది. ఇదిలా ఉంటే రితికా
తాజాగా భరత్‌పూర్‌లోని లోహ్‌ఘర్‌ స్టేడియంలో మార్చి 12 నుంచి 14 వరకు
జరిగిన రాష్ట్ర స్థాయి జూనియర్‌ ఉమెన్‌, సబ్‌ జూనియర్‌ పోటీల్లో పాల్గొంది.
ఈ క్రమంలో టోర్నీ ప్రారంభమైనప్పటి నుంచి మంచి ప్రతిభను కనబరిచిన రితికా
ఫైనల్‌కు చేరుకుంది. అయితే మార్చి 14న జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో కేవలం ఒక్క
పాయింట్‌ తేడాతో ఓటమిని చవిచూసింది. దీంతో తీవ్ర నిరాశకు గురైన రితికా.. తన
సొంత గ్రామమైన బాలాలిలో మార్చి 15న ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇక
పోలీసులు పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం రితికా మృతదేహాన్ని ఆమె
కుటుంబసభ్యులకు అప్పగించారు. మార్చి 16న రితికా కుటుంబసభ్యులు ఆమె
అంత్యక్రియలు నిర్వహించారు. ఇక పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ
జరుపుతున్నారు.

ఇదిలా ఉంటే రితికా ఆత్మహత్య విషయమై ఆమె సోదరుడు హర్వింద్ర మాట్లాడుతూ..
‘రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీల్లో ఓడిపోవడం పెద్ద విషయమేమి కాదు. అసలు
రితికా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుందో తెలియట్లేదు. కోచ్‌ మహావీర్‌, మా
తండ్రి మెన్‌పాల్‌ కూడా మ్యాచ్‌ జరుగుతోన్న సమయంలో రితికాతోనే ఉన్నారు.
ఓటమి తర్వాత రితికకు భరోసా కూడా ఇచ్చారు. మరింత కష్టపడితే విజయం
సొంతమవుతుందని అందరూ చెప్పారు. కానీ రితికా సడన్‌గా ఇలాంటి నిర్ణయం
తీసుకోవడం షాక్‌కి గురి చేసింది’ అంటూ వాపోయాడు. ఇదిలా ఉంటే బబితా
ఫోగాట్‌తో పాటు ఆమె సోదరీమణులు కూడా రెజ్లింగ్‌లో మేటి ప్లేయర్స్‌ అనే
విషయం తెలిసిందే. మహావీర్‌ ఫోగాట్‌ తన కూతుళ్లను మేటి కుస్తీ
క్రీడాకారిణీలుగా తీర్చిదిద్దాడు. వీరి కథ ఆధారంగానే బాలీవుడ్‌లో అమీర్‌
ఖాన్‌ ప్రధాన పాత్రలో ‘దంగల్‌’ అనే సినిమా తెరకెక్కింది.

 


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this