Andhra Pradesh: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్...

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

Andhra Pradesh: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. స్పెషల్ పోర్టల్ లో భారీ డిస్కౌంట్

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Andhra Pradesh government:
ఉద్యోగులంతా గ్రూపుగా ఏర్పడి బల్క్ ఆర్డర్స్ ఇస్తే మరింత ఎక్కువ డిస్కౌంట్
ఇచ్చేలా ఆయా సంస్థలను ఒప్పించాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తోంది.

  • ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు డిస్కౌంట్‌ సేల్‌
  • జీకార్ట్‌ పేరుతో ప్రత్యేక పోర్టల్‌ అభివృద్ధి చేస్తున్న ఏపీటీఎస్‌
  • నేరుగా తయారీ సంస్థలతో ఒప్పందం
  • తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చేలా బ్యాంకులతో ఒప్పందం
  • వస్తువులు డెలివరీ చేయడానికి లాజిస్టిక్‌ సంస్థల సహకారం
  • త్వరలో సీఎం చేతుల మీదుగా ప్రారంభానికి ఏర్పాట్లు

ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ ఉద్యోగులకు ఇది నిజంగా శుభవార్తే. ఆర్మీ
క్యాంటీన్ తరహాలో సరికొత్త వ్యవస్థను తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం రంగం
సిద్ధం చేస్తోంది. బహిరంగ మార్కెట్ కంటే తక్కువ ధరలకే ఎలక్ట్రానికి
వస్తువులు, ఇతర గృహోపకరణాలను అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
ఇందుకోసం ఒక ప్రత్యేక వెబ్ పోర్టల్ ను కూడా అభివృద్ధి చేస్తోంది. ఈ పోర్టల్
ద్వారా మొబైల్ ఫోన్లు, ట్యాబ్ లు, కంప్యూటర్లతో పాటు ఇతర ఎలక్ట్రానికి
వస్తువులు, గృహోపరకరణాలను డిస్కౌంట్ ధరలకే అందించే విధంగా ఆంధ్రప్రదేశ్
టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ (APTS) ప్రత్యేక ఈ-కామర్స్ వెబ్ సైట్ ను
తయారు చేస్తోంది. G-Commerce పేరుతో ఈ వెబ్ పోర్టల్ ను అభివృద్ధి
చేస్తోంది. త్వరలోనే ఈ వెబ్ సైట్ ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి
ప్రారంభించనున్నారు.

ప్రస్తుతం ఈ పోర్టల్‌ను ప్రయోగాత్మకంగా
పరిశీలిస్తున్నారు. ఇప్పటికే సెక్యూరిటీ ఆడిటింగ్‌ కూడా పూర్తయ్యింది.
త్వరలోనే ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ పోర్టల్‌ను ప్రారంభిస్తామని ఏపీటీఎస్‌
మేనేజింగ్‌ డైరెక్టర్‌ నంద కిషోర్‌ ‘సాక్షి’కి వెల్లడించారు.  దీనివల్ల
సుమారు 10.36 లక్షల మంది ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన వారికి ప్రయోజనం
లభిస్తుందని ఏపీటీఎస్‌ అంచనా వేస్తోంది. వివిధ కార్పొరేషన్లతో కలుపుకొని
రాష్ట్రంలో 7,76,492 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉండగా, 2.60 లక్షల మంది
వలంటీర్లు ఉన్నారు.

ఓఈఎంలతో ఒప్పందం

ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈకామర్స్‌ పోర్టల్స్‌ కంటే తక్కువ రేటుకు
వస్తువులను అందించే విధంగా నేరుగా తయారీ సంస్థల (ఓఈఎం–ఒరిజనల్‌
ఎక్విప్‌మెంట్‌ మాన్యుఫ్యాక్చరర్‌)తో మాట్లాడి ఒప్పందాలు
కుదుర్చుకుంటున్నట్లు నందకిషోర్‌ తెలిపారు. పది లక్షల మందికిపైగా ఉద్యోగులు
ఉండటంతో ఓఈఎం సంస్థలు కూడా ఒప్పందం చేసుకోవడానికి ఆసక్తి వ్యక్తం
చేస్తున్నాయి. కొంత మంది ఉద్యోగులు గ్రూపులుగా ఏర్పడి ఒకేసారి అధిక
మొత్తంలో కొనుగోలు ఆర్డరుఇస్తే, మరింత డిస్కౌంట్‌ ఇచ్చేలా గ్రూపు బయ్యింగ్‌
పాలసీని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ పోర్టల్‌ ద్వారా కొనుగోలు చేసిన
వస్తువులను నేరుగా ఇంటికి చేర్చడం కోసం లాజిస్టిక్‌ సంస్థలతో ఒప్పందం
చేసుకున్నారు.

‘చేయూత’ కోసం హోల్‌సేల్‌ రిటైలర్స్‌తో ఒప్పందాలు

ఇదే సమయంలో రాష్ట్రంలో వైఎస్సార్‌ చేయూత కింద షాపులను ఏర్పాటు చేసుకున్న
మహిళలకు తక్కువ రేటుకే వస్తువులను అందించే విధంగా హోల్‌సేల్‌ రిటైల్‌
సంస్థలతో చర్చలు జరుపుతున్నారు. వాల్‌మార్ట్, డీమార్ట్, రిలయన్స్‌ వంటి
సంస్థలతో ఒప్పందాలు చేసుకోనున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం కృష్ణా
జిల్లాలో ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నట్లు ఏపీటీఎస్‌ ఎండీ నందకిషోర్‌
తెలిపారు. రాష్ట్రంలో సుమారు 75,000 మంది వైఎస్సార్‌ చేయూత కింద షాపులు
ఏర్పాటు చేసుకున్నారని, వీరికి సరుకులు కొనుగోళ్లు ఇబ్బందిగా ఉండటంతో
నేరుగా షాపులకే డెలివరీ చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

ఇలా పనిచేస్తుంది..

ఈ పోర్టల్లో కేవలం ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే కొనుగోళ్లు జరిపే
అవకాశముంది. ఉద్యోగులు తమ ఐడీ నెంబర్లతో ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి
ఉంటుంది. ఈ ఐడీ నెంబర్ ద్వారా లాగిన్ అయి తమకు కావాల్సిన వస్తువులను
కొగుగోలు చేసేలా ఈ పోర్టల్ ను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ట్రయల్ వెర్షన్
ను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన సెక్యూరిటీ ఆడిటింగ్ ను
కూడా పూర్తిచేశారు. త్వరలోనే ఈ పోర్టల్‌ను ప్రారంభిస్తామని ఏపీటీఎస్‌
మేనేజింగ్‌ డైరెక్టర్‌ నంద కిషోర్ తెలిపారు.

ఈ పోర్టల్ ద్వారా దాదాపు 10.36 లక్షల మంది ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన
ఉద్యోగులు తక్కువ ధరకే ఎలక్ట్రానిక్ వస్తువులు పొందే అపకాశమున్నట్లు
ప్రభుత్వం అంచనా వేస్తోంది. రాష్ట్రంలో వివిధ కార్పొరేషన్లు, విభాగాలను
కలుపుకొని మొత్తం 7 లక్షల 72వేల 492 మంది ఉద్యోగులున్నారు. అలాగే 2లక్షల 60
వేల మందికి పైగా గ్రామ, వార్డు వాలంటీర్లు ఉన్నారు. జీ-కామర్స్ పోర్టల్
ద్వారా వీళ్లందరికీ తక్కువ ధరకు ఎలక్ట్రానికి వస్తువులు కొనుగోలు చేసే
అవకాశం కల్పిస్తారు.

ఉద్యోగులకు తక్కువ ధరకే వస్తువులు
అందించేలా నేరుగా తయారీ సంస్థలతోనే చర్చించి ఒప్పందం కుదుర్చుకునేలా
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మంది
వినియోగదారులు వచ్చే అవకాశముండటంతో ఒరిజినల్ ఎక్విప్ మెంట్ మాన్యుఫాక్చరర్
సంస్థలు కూడా రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ఆసక్తి
చూపిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇందులో మరో అవకాశానికి కూడా రాష్ట్ర
ప్రభుత్వం ఉద్యోగులకు ఛాన్సిస్తోంది. ఉద్యోగులంతా గ్రూపుగా ఏర్పడి బల్క్
ఆర్డర్స్ ఇస్తే మరింత ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చేలా ఆయా సంస్థలను ఒప్పించాలని
రాష్ట్ర ప్రభుత్వం చూస్తోంది.

 


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this