Mobile Phone Charged : కొంతమంది రాత్రిపూట చార్జింగ్ చేయొద్దంటారు..
మరికొందరు వేడి ప్రదేశాల్లో చార్జింగ్ పెట్టొద్దంటారు అయితే ఈ విషయాల్లో
ఎంతవరకు వాస్తవం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.. అసలు ఫోన్ చార్జింగ్
చేయడానికి ఖచ్చితమైన సమయం అంటూ ఏదీ నిర్ణయించలేదు. ఒక్కసారి మీ ఫోన్‌లో
*3001#12345#* అని టైపు చేసి డయల్ చేస్తే చాలు.. వెంటనే ఫీల్డ్ మోడల్
డిస్‌ప్లే అవుతుంది. లోకల్ నెట్ వర్క్‌ల వివరాలతో పాటు సెల్ టవర్ల వివరాలు
కూడా తెలుసుకోవచ్చు. అలాగే మీ ఫోన్ ఫెర్ఫామెన్స్, బ్యాటరీ కెపాసిటీ
తెలుస్తుంది.
ఈ విషయంలో ఫోన్ తయారీ దారులు ఏం చెబుతున్నారంటే.. ఫోన్ బ్యాటరీ లైఫ్
స్పాన్ అనేది చాలా విషయాలపై ఆధారపడి ఉంటుందని అంటున్నారు. అయితే ఆపిల్
కంపెనీ వారు మాత్రం ఐఫోన్ ఎప్పుడైనా ఫుల్ ఛార్జింగ్ అయినా అలానే ఎక్కువ
సమయం ఉంచితే.. బ్యాటరీ హెల్త్ పై తీవ్ర ప్రభావం పడుతుందని అంటోంది. రాత్రి
లేదా ఎప్పుడైనా సరే గంటల తరబడి ఛార్జింగ్ కనెక్ట్ చేసి అలానే ఫోన్
వదిలేయకూడదని అంటున్నారు.
ఫోన్ ఎప్పుడూ కూడా ఫుల్ ఛార్జింగ్ చేయరాదు. వాస్తవానికి ఫోన్ ఛార్జింగ్
కనెక్ట్ చేసినప్పుడు ఫుల్ కాగానే ఆటోమాటిక్ గా స్టాప్ ఛార్జింగ్
ఆగిపోతుంది. కొన్ని సందర్భాల్లో మాత్రం 99శాతం బ్యాటరీ డౌన్ కాగానే.. మళ్లీ
100 శాతానికి ఛార్జ్ కావాలంటే ఎక్కువ ఎనర్జీ అవసరం పడుతుంది. ఇలానే
స్థిరంగా కొనసాగితే మాత్రం బ్యాటరీ లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది. ఆండ్రాయిడ్
ఫోన్లలో బ్యాటరీ లైఫ్ కోసం AccuBattery అనే యాప్ ఒకటి ఉంది. ఇది ఎప్పుడూ మీ
బ్యాటరీ హెల్త్ పై ఓ కన్నేసి ఉంచుతుంది. రియల్ టైమ్ ఇష్యూలను పసిగడుతుంది.
ఎప్పుడు ఛార్జింగ్ పెట్టాలి? ఎప్పుడూ అన్ ప్లగ్ చేయాలో కూడా ఇది గైడ్
చేస్తుంది.
మీ ఫోన్ ఎప్పుడూ కూడా జీరో శాతానికి ఛార్జింగ్ పడిపోయేంత వరకు
వాడొద్దు.. ఛార్జింగ్ సైకిల్ దెబ్బతింటుందని మరిచిపోవద్దు. మీ సౌకర్యాన్ని
బట్టి జీరో వరకు దిగిపోకుండా ఛార్జ్ చేస్తుండాలి. మీ ఫోన్ ఎప్పుడూ చల్లటి
ప్రదేశంలో ఉండేలా చూసుకోవాలి. వేడి, ఉష్ణోగ్రత ఉంటే.. బ్యాటరీ లైఫ్ పై
తీవ్ర ప్రభావం పడుతుంది.