Wednesday, February 18, 2026
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
Insect in Guntur Villages: వామ్మో.! ఈ...

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక తరగతుల కోసం సమగ్ర మార్గదర్శి

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి...

Insect in Guntur Villages: వామ్మో.! ఈ పురుగు బారిన పడ్డారో అంతే సంగతులు.!! పల్లెల్లో గుబులు పుట్టిస్తున్న వింత పురుగు..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Strange Worms In Guntur: మాకే ఎందుకిలా జరుగుతోంది.?
ఎందుకిలా మా ప్రాణాలు తీస్తున్నాయి.? అసలు అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి.?
అంటూ లబోదిబోమంటున్నారు ఆ ఊరి గ్రామస్తులు. వాళ్లకు ఈ బాధలు ఓ మాయదారి
పురుగు వల్ల వచ్చాయి. అదేంటి ఓ పురుగు ఇన్ని బాధలు పెడుతోందా.? అని
అనుకుంటున్నారా.? అసలు దాని సంగతేంటో ఇప్పుడు చూద్దాం..

ఒకవైపు దేశంలోని జనాభా అంతా కనిపించని కరోనా వైరస్‌తో పోరాడుతుంటే…
అక్కడి జనం మాత్రం కంటికి కనిపిస్తూ నిత్యం ప్రాణాలు తోడేస్తున్న పురుగులతో
చచ్చి బతుకుతున్నారు. రాత్రి లేదు పగలు లేదు. ఎప్పుడు పడితే అప్పుడు…ఎటు
వెళ్లినా… వారిని ఆ పాడుబడ్డ పురుగులు వదలడం లేదు. అవి ఒంటి మీద వాలినా…లేక
చర్మం మీద పాకితే చాలు.. ఒళ్లంతా ఒకటే దురద. దద్దుర్లు. భరించరాని
మంటపుడుతుంది.

గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలంలోని సుబ్బయ్యపాలెం, విప్పర్లపల్లి,
అన్నవరప్పాడు ,వీరాటం గ్రామస్తులు విచిత్రమైన పురుగుతో పడుతున్న బాధలు
అన్నీ ఇన్నీ కాదు. అది ఒక వింత పురుగు. చుట్టు పక్కల గ్రామాల్లో
రాత్రింబవళ్లు తిరుగుతూనే ఉంటుంది. పనుల మీద బయటకు వెళ్లే వాళ్లు…పొలం
పనులకు వెళ్లే రైతులు…ఇళ్లలో పని చేసుకుంటున్న మహిళలు ఇలా ఎవర్ని వదలడం
లేదు. బొచ్చు పురుగుల జాతికి చెందినవి కావడంతో ….అది శరీరానికి తాకడం వల్ల
ఒళ్లంతా దద్దుర్లు, దురద వస్తోందంటున్నారు గ్రామస్తులు. ఆ పురుగు వల్ల
కలిగే దురదలు, దద్దుర్లు కనీసం మూడు, నాలుగు రోజుల వరకు వదలడం
లేదంటున్నారు.

కాగా, సుబ్బయ్యపాలెంకు చెందిన ఓ మహిళ ఈ మాయదారి పురుగుతో ఐదు రోజుల పాటు
మంచాన పడింది. సుమారు నాలుగు గ్రామాల ప్రజలు ఈ పురుగు వల్ల ఇంత
బాధపడుతుంటే.. ఇప్పటికీ అధికారులు తమ గోడును పట్టించుకోకపోవడంపై వారు
ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామానికి సమీపంలో ఉన్న సుబాబుల్
తోటల కారణంగానే అక్కడి పురుగులన్నీ కూడా గ్రామాల్లోకి వస్తున్నాయనే
అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే అధికారులు స్పందించి వాటికి ఏ
మందులైన పిచికారి చేసి తమను ఈ బాధల నుంచి గట్టెక్కించాలని వేడుకుంటున్నారు.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this