No Lockdown: తెలంగాణలో మరోసారి లాక్‌డౌన్ ఉండదు.....

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

No Lockdown: తెలంగాణలో మరోసారి లాక్‌డౌన్ ఉండదు.. క్లారిటీ ఇచ్చిన సీఎం కేసీఆర్..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Telangana Lockdown News: తెలంగాణలో మరోసారి లాక్‌డౌన్
ఎట్టిపరిస్థితుల్లో ఉండబోదని అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్
వెల్లడించారు. వైరస్ వ్యాప్తి విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం
లేదన్న ఆయన.. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని
అన్నారు. వీలైనంత త్వరగా వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేస్తామని
తెలిపారు. స్కూల్స్ ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండటం మూసివేశామని..
అది కూడా తాత్కాలికమే అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

లాక్‌డౌన్‌పై తమ ప్రభుత్వం ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోబోదని..
పరిశ్రమలను కూడా మూసివేసే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. ప్రజలందరూ కూడా
తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని పేర్కొన్నారు.
కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తే వైరస్ వ్యాప్తి తగ్గుతుందని ఆయన
అన్నారు. సెల్ఫ్ డిసి‌ప్లేన్‌తో కరోనాను నియంత్రించవచ్చునని సీఎం కేసీఆర్
వెల్లడించారు. కరోనాను కట్టడి చేయడంలో తెలంగాణ బెస్ట్ అని తెలిపిన సీఎం..
దేశంలోనే అత్యధిక టెస్టులు చేశామని తెలిపారు.

తెలంగాణలో కొత్తగా 518 కేసులు నమోదు…

తెలంగాణాలో కొత్తగా 518 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య
ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. గడిచిన 24గంటల్లో ముగ్గురు
కరోనాతో మరణించగా.. రాష్ట్రంలో ఇప్పటిదాకా కరోనాతో మరణించిన వారి సంఖ్య
1683కి చేరింది. ప్రస్తుతం తెలంగాణాలో 3,995 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని,
వారిలో 1,767 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ
తెలిపింది. అటు ఇప్పటిదాకా 2,99,631 వైరస్ నుంచి కోలుకుని వివిధ ఆసుపత్రుల
నుంచి డిశ్చార్జ్ అయ్యారు.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this