Wednesday, February 18, 2026
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
Teacher Jobs: మొత్తం 3479 టీచర్ పోస్టుల...

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక తరగతుల కోసం సమగ్ర మార్గదర్శి

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి...

Teacher Jobs: మొత్తం 3479 టీచర్ పోస్టుల భర్తీ… నేటి నుంచి దరఖాస్తులు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Teacher Jobs: టీచర్ జాబ్
కోరుకునేవారికి శుభవార్త. కేంద్ర ప్రభుత్వం టీచర్ పోస్టుల్ని భర్తీ
చేస్తోంది. మొత్తం 3479 పోస్టులున్నాయి. నేటి నుంచి దరఖాస్తు చేయొచ్చు.
నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

1. ఉపాధ్యాయ వృత్తి ఎంచుకున్నవారికి శుభవార్త. కేంద్ర గిరిజన వ్యవహారాల
మంత్రిత్వ శాఖ భారీగా టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయబోతోంది. దేశవ్యాప్తంగా
ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లల్లో (Eklavya Model Residential
Schools) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.

2. ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్-PGT,
ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్-TGT పోస్టుల్ని భర్తీ చేస్తోంది.
దేశవ్యాప్తంగా మొత్తం 3479 పోస్టుల్ని ప్రకటించింది. తెలంగాణలో 262,
ఆంధ్రప్రదేశ్‌లో 117 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ
ఏప్రిల్ 1న మొదలు కానుంది.

3. అదే రోజున దరఖాస్తు లింక్ యాక్టివేట్ అవుతుంది. అప్లై చేయడానికి 2021
ఏప్రిల్ 30 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను
https://tribal.nic.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. పరీక్ష జూన్ మొదటి
వారంలో ఉంటుంది.  

4. ఎలా దరఖాస్తు చేయాలన్న వివరాలు ఏప్రిల్ 1న ఈ వెబ్‌సైట్‌లో ఉంటాయి.
కాబట్టి అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ మాత్రమే ఫాలో కావాలి. దరఖాస్తు చేసే
ముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతల వివరాలు తెలుసుకోవాలి.
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

5. మొత్తం 3479 ఖాళీలు ఉండగా అందులో ప్రిన్సిపాల్- 175, వైస్ ప్రిన్సిపాల్-
116, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్- 1244, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్- 1944
పోస్టులున్నాయి.

6. రాష్ట్రాల వారీగా ఖాళీల వివరాలు చూస్తే తెలంగాణలో 262 పోస్టులున్నాయి.
అందులో ప్రిన్సిపాల్- 11, వైస్ ప్రిన్సిపాల్- 6, పీజీటీ- 77, టీజీటీ- 168
ఖాళీలున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్‌లో 117 పోస్టులున్నాయి. అందులో
ప్రిన్సిపాల్- 14, వైస్ ప్రిన్సిపాల్- 6, టీజీటీ- 97 పోస్టులున్నాయి.  

7. ఇతర రాష్ట్రాల్లో చూస్తే చత్తీస్‌గఢ్- 514, గుజరాత్- 161, హిమాచల్
ప్రదేశ్- 8, ఝార్ఖండ్- 208, జమ్మూ అండ్ కాశ్మీర్- 14, మధ్య ప్రదేశ్- 1279,
మహారాష్ట్ర- 216, మణిపూర్- 40, మిజోరం- 10, ఒడిశా- 144, రాజస్తాన్- 316,
సిక్కిం- 44, త్రిపుర- 58, ఉత్తర్ ప్రదేశ్- 79, ఉత్తరాఖండ్- 9
పోస్టులున్నాయి.

8. విద్యార్హతల వివరాలు చూస్తే ప్రిన్సిపాల్ పోస్టుకు ఏదైనా స్కూలింగ్
సబ్జెక్ట్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పాస్ కావాలి. లేదా టీచింగ్‌లో మాస్టర్స్
డిగ్రీ లేదా బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ బేసిక్
ట్రైనింగ్ పూర్తి చేసి ఉండాలి. 10 ఏళ్లు ఇంగ్లీష్ మీడియం హయ్యర్ సెకండరీ
స్కూల్ టీచర్‌గా పనిచేసిన అనుభవం ఉండాలి. టీజీటీ, పీజీటీ పోస్టుకు
మాస్టర్స్ డిగ్రీతో పాటు బీఈడీ పాస్ కావాలి.

9. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రస్తుతం 288
స్కూల్స్ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం మరో 452 స్కూళ్లను ప్రారంభిస్తోంది.
దీంతో మొత్తం స్కూళ్ల సంఖ్య 740 కి చేరుకోనుంది. ఇప్పటికే రాష్ట్రాల నుంచి
100 పాఠశాలల ఏర్పాటుకు ప్రతిపాదనలు అందాయి. త్వరలో స్కూళ్ల నిర్మాణం
ప్రారంభం కానుంది.

 


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this