SBI vs Post Office: పోస్టాఫీస్..ఎస్బీఐ డిపాజిట్...

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

SBI vs Post Office: పోస్టాఫీస్..ఎస్బీఐ డిపాజిట్ చేయాలంటే ఏది బెస్ట్? తాజా ఇంట్రస్ట్ రేట్స్ ఇవే!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

SBI vs Post Office: కష్టపడి సంపాదించిన సొమ్మును దాచుకోవాలని ప్రతి
ఒక్కరూ భావిస్తారు. అయితే, ఎక్కడ దాచుకోవాలనే విషయంలో ఎప్పుడూ తికమక
ఎదురవుతూనే ఉంటుంది. ఎక్కువ వడ్డీ వస్తుంది కదా అని ప్రయివేట్ సంస్థల్లో
మదుపు చేస్తే ఆ సొమ్ముకు  భద్రత ఉండదు. మరి ప్రభుత్వ రంగ సంస్థల్లో
సేవింగ్స్ చేయాలంటే వడ్డీ రేట్లు తక్కువ ఉంటాయి.. పైగా ఎప్పటికప్పుడు
మారుతూ వస్తుంటాయి. రిస్క్ లేకుండా డబ్బులను దాచుకోవాలనుకునేవారు
వడ్డీరేట్లు తక్కువైనా ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ లేదా పోస్టాఫీస్ ల్లో డిపాజిట్ చేస్తారు.

ఎస్బీఐ లేదా పోస్టాఫీస్ రెండూ తమ ఖాతాదారుల కోసం అనేక రకాలైన డిపాజిట్
స్కీమ్ లు అందుబాటులో ఉంచాయి. రెండు చోట్లా డిపాజిట్ సొమ్ముకు వేర్వేరు
వడ్డీరేట్లు అమలులో ఉంటాయి. ఇవి కూడా ప్రభుత్వ విధానాలను అనుసరించి
ఎప్పటికప్పుడు మారుతూ వస్తాయి. ఈ ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం
ప్రారంభం అయిన సందర్భంగా ఇటు పోస్టాఫీస్ అటు ఎస్బీఐ లలో డిపాజిట్ లపై వడ్డీ
రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం.

పోస్టాఫీసుల్లో డిపాజిట్ల పై వడ్డీ రేట్లు ఇలా..

పోస్టాఫీసుల్లో టర్మ్ డిపాజిట్ స్కీమ్ బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ దాదాపు ఒకటే. ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొద్దిగా మారాయి.

  • ఒక సంవత్సరం నుంచి మూడు సంవత్సరాల వరకూ టర్మ్ డిపాజిట్లపై 5.5% వడ్డీ రేట్లు ప్రస్తుతం పోస్టాఫీసులు అందిస్తున్నాయి.
  • ఐదు సంవత్సరాల టర్మ్ డిపాజిట్ల పై పోస్టాఫీసులో 6.7% వడ్డీ లభిస్తుంది.

ఇక ఎస్బీఐ లో డిపాజిట్లపై వడ్డీ రేట్లు ఇలా..

జనవరి 8, 2021 నుంచి ఎస్బీఐలో అమలులో ఉన్న వడ్డీ రేట్ల ప్రకారం..

  • 46 రోజుల వ్యవధి నుంచి 179 రోజుల వ్యవధి ఉన్న టర్మ్ డిపాజిట్లపై 3.9% వడ్డీ లభిస్తుంది.
  • ఒక సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల కంటే తక్కువ సమయానికి డిపాజిట్ చేస్తే 5% వడ్డీ రేటు ఎస్బీఐ ఆఫర్ చేస్తోంది.
  • రెండేళ్లకు పైబడి మూడేళ్ళ లోపు డిపాజిట్లపై 5.1% వడ్డీరేటు ఎస్బీఐ ఇస్తోంది.
  • మూడేళ్లకు మించి ఐదేళ్ల లోపు టర్మ్ డిపాజిట్లపై ఎస్బీఐ లో 5.3% వడ్డీరేటు దొరుకుతుంది.
  • ఇక ఐదేళ్ల నుంచి పదేళ్ల లోపు డిపాజిట్ చేస్తే ఎస్బీఐ 5.4% వడ్డీరేటు ఇస్తుంది.

తమ సొమ్మును భద్రపరుచుకోవాలని భావించే వారికి పోస్టాఫీస్, ఎస్బీఐ రెండూ
సురక్షితమైనవే. ఇవి అందించే వడ్డీరేట్లు బేరీజు వేసుకుని.. అవసరాలకు
అనుగుణంగా ఉన్న డిపాజిట్ కాలపరిమితి ఎంచుకుని డబ్బులను సేవ్ చేసుకోవచ్చు.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this