Toothbrush: మీరు వాడే టూత్ బ్రష్ కు...

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

Toothbrush: మీరు వాడే టూత్ బ్రష్ కు ఆయుస్సు ఉంటుంది.. ఎన్ని నెలలకు మార్చాలంటే..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Toothbrush: ఆధునిక జీవితంలో ఎన్నో మార్పులు.. పాతవాటి స్తానంలో కొత్త
కొత్త అలవాట్లు.. అలాంటిది ఒకటి దంతావధానం. పూర్వకాలంలో పళ్ళను
శుభ్రపరచుకోవడానికి వేప పుల్లని ఎక్కువగా ఉపయోగించేవారు. కాలక్రమంలో చోటు
చేసుకున్న మార్పులతో వేప పుల్ల బదులు.. టూత్ బ్రష్ లు వచ్చి చేరాయి. దీంతో
రోజు పొద్దున్న పళ్ళను శుభ్రపరచుకోవడానికి ఎక్కువుగా టూత్ బ్రష్
ఉపయోగిస్తున్నాం. అయితే కొంత మంది ఈ బ్రష్ ను బాగా వాదిస్తారు.. ఎంతగా
అంటే.. బ్రష్ కుచ్చు అరిగిపోయి.. ఇక విరిపోతుంది అనుకున్న తర్వాత అప్పుడు
టూత్ బ్రష్ ను మారుస్తారు. అయితే నిజానికి టూత్ బ్రష్ కు కూడా ఆయుస్సు
ఉంటుంది. దానికి అంతకు మించి వాడితే.. ఆరోగ్యానికి హానికరంగా మారుతుందని
దంతవైద్యులు సూచిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే..

టూత్ ను సాధారణంగా 3 నెలలకు మించి వాడకపోవడమే మంచిది. తయారీదారులు,
దంతవైద్యుల సిఫారసుల ప్రకారం, మీ టూత్ బ్రష్ ప్రతి 12 నుండి 16 వారాలకు
ఒకసారి మార్చాల్సిన ఆవశ్యకతను గుర్తు చేస్తారు. అలా మార్చకపోతే అది మీ దంత
ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని హెచ్చరిస్తున్నారు.

చిగుళ్ళ వ్యాధి, దంత క్షయం, దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాకు
వ్యతిరేకంగా పోరాడి మీ దంతాలకు రక్షణ కల్పిస్తుంది మీ టూత్ బ్రష్. మృదువైన
బ్రిస్టల్ బ్రష్ మీ దంతాల చుట్టూ ఉన్న ఆహారం మరియు బ్యాక్టీరియాను
సమర్థవంతంగా తొలగిస్తుంది. రోజుకు రెండుసార్లు 2 నిమిషాల పాటు పళ్ళు
తోముకోవడాన్ని దంత వైద్యులు సిఫారసు చేస్తారు. అలా చేయడం ద్వారా టూత్
క్యావిటీస్ నుంచి రక్షణ కలుగుతుంది. భోజనం చేసిన ప్రతి సారి పళ్ల మధ్య
ఇరుక్కున్న ఆహారం తొలగించడానికి బ్రష్ చేసుకోవడం ఎంతైనా అవసరం. మధ్యాహ్న
భోజనానంతరం వీలు కాకపోతే రాత్రి పూట కచ్చితంగా బ్రష్ చేసుకోవాలి. స్వీట్స్
వంటి చక్కెర పదార్థాలు తిన్న తరువాత తప్పనిసరిగా నోరు పుక్కిలించాలి.

ఇక రోజూ మీరు పళ్ళను శుభ్రపరచుకునే టూత్ బ్రష్‌ను 3 నుండి 4 నెలలకు
ఒకసారి మార్చాలని సెంటర్స్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ (సిడిసి)
సలహా ఇస్తుంది. అంతేకాదు మీ టూత్ బ్రష్ ను మరెవరైనా పొరపాటున ఉపయోగిస్తే,
దాన్ని శుభ్రంచేసి మళ్లీ వాడొద్దని అంటున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరి నోరు
భిన్నమైన బ్యాక్టీరియాను కలిగి ఉంటుంది. అందుకని ఒకరు వాడిన టూత్ బ్రష్ ను
వేరొకరు వాడడంతో అనారోగ్యానికి కారకంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు.

ఇక ఫ్యామిలీ మొత్తం టూట్ బ్రష్ లను ఒకే ప్లేస్ లో ఉంచుతారు. అయితే అలా
వాటిని ఉంచినప్పుడు ఒకదానికి హెడ్స్ ఒకటి తగలకుండా చూసుకోవాలి. బ్రష్ చేసిన
తర్వాత, మీ టూత్ బ్రష్‌ను శుభ్రంగా నీటిలో కడగాలి. ముఖ్యంగా వారానికి
ఒకసారి వేడి నీరు ఉప్పు వేసిన నీటితో టూత్ బ్రష్ ను శుభ్రపరచాలి దంత
వైద్యులు సూచిస్తున్నారు.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this