Highest Mileage Bike: ధర తక్కువ.. మైలేజీ...

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

సుప్రీంకోర్టు తీర్పు: టెట్ (TET) అర్హత గడువు 2028 వరకు పొడిగింపు | Supreme Court TET Verdict

సుప్రీంకోర్టు తీర్పు: ఉపాధ్యాయులకు టెట్ (TET) అర్హత గడువు పొడిగింపు ఉపాధ్యాయ అర్హత...

Thalliki Vandanam Scheme 2026-27: డేటా పరిశీలనలో ఈ 5 పొరపాట్లు చేయకండి!

Thalliki Vandanam Scheme 2026-27 డేటా పరిశీలనపై పూర్తి వివరాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

SSC Memo Download 2026: AP SSC Short Memos Available Online at BSE.AP.GOV.IN

ఆంధ్రప్రదేశ్ మాధ్యమిక విద్యా బోర్డు విడుదల చేసిన SSC Memo Download...

Highest Mileage Bike: ధర తక్కువ.. మైలేజీ ఎక్కువ.. అదరిపోయే బైక్‌లు మీకోసం.. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Mileage Bikes: అసలే
కరోనా సంక్షోభం.. ఆపై పెరుగుతున్న ధరలతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు
ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో వరుసగా పెరుగుతున్న చమురు ధరలను
చూసి సామాన్య జనాలు హడలిపోతున్నారు. తమ వాహనాలను బయటకు తీయాలంటే ఒకటికి
పదిసార్లు ఆలోచిస్తున్నారు. లీటర్ పెట్రోల్ ధర రూ. 100కి చేరువగా ఉంది.
దాంతో అత్యవసరం అయితేనే తప్ప.. తమ వాహనాలను బయటకు తీయడం లేదు. ఇంకొందరు
ప్రజలు బైక్‌లు కొనాలనుకునే వారు మైలేజీ ఇచ్చే ద్విచక్ర వాహనాల కొనుగోలుకు
మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే.. తక్కువ ధరతో పాటు.. ఎక్కువ మైలేజీ
ఇచ్చే బైక్‌‌ల వివరాలను మీకోసం ఇక్కడ వివరిస్తున్నాం. టాప్ మైలేజీ, తక్కువ
ధరకు లభించే బైక్‌లేంటో మీరూ చూసేయండి మరి.

టీవీఎస్ స్పోర్ట్..

ఈ బైక్‌లు సరసమైన లభిస్తాయి. టీవీఎస్ కంపెనీ అధికారిక వివరాల ప్రకారం.. ఈ
బైక్‌ను ఒక లీటరు పెట్రోల్‌తో 75 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. బీఎస్6
వెర్షన్ అయిన ఈ బైక్ 99.77 సిసి ఇంజన్ కలిగి ఉంది. దీని ఎక్స్‌-షోరూమ్‌ ధర
రూ .35,990 నుండి రూ .63,950 వరకు ఉంటుంది.

బజాజ్ సిటి 110..

మైలేజ్ పరంగా, ధర పరంగా ఈ బైక్ చాలా ఉత్తమ్. ఒక లీటరు పెట్రోల్‌తో 90
కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. బిఎస్ 6 వెర్షన్ అయిన ఈ బైక్ 115.45 సిసి
ఇంజన్ కలిగి ఉంది. ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 32,000- రూ. 53,395 మధ్య
ఉంటుంది.

హోండా సిడి 110 డ్రీమ్..

ఈ బైక్‌లో 109.5 సిసి శక్తివంతమైన ఇంజిన్ ఇవ్వబడింది. ఇది 7500 ఆర్‌పిఎమ్
వద్ద 6.47, 5500 ఆర్‌పిఎమ్ వద్ద 9.3 ఎన్ఎమ్ టార్క్‌ను రిలీజ్ చేస్తుంది. ఈ
బైక్‌ ముందు భాగంలో 130 మిమీ డ్రమ్ బ్రేక్, వెనుక భాగంలో 130 ఎంఎం డ్రమ్
బ్రేక్ పొందుతారు. ఇక మైలేజ్ విషయానికి వస్తే.. ఈ బైక్‌ ఒక లీటరు
పెట్రోల్‌తో 74 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర
రూ.47,398 – రూ.68,443 వరకు ఉంది.

హీరో పాషన్ ప్రో..

మైలేజ్ పరంగా ఈ బైక్ కూడా ఉత్తమం అని చెప్పొచ్చు. లీటరు పెట్రోల్‌కు 68
కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. ఈ బైక్‌ 110 సిసి సింగిల్ సిలిండర్ ఇంజన్
కలిగి ఉంది. దీనిలో ఎక్స్‌సెన్స్ ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీ ఉంటుంది. ఈ
ఇంజిన్ 9.02 Bhp శక్తిని, 9.79 Nm టార్క్‌ను రిలీజ్ చేస్తుంది. దీని
ఇంజిన్.. ఎక్స్‌సెన్స్ ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీతో తయారు చేయడం
జరిగింది. ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ .53,425- రూ.72,900 వరకు ఉంది.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this