Gold Price Today: స్వల్పంగా తగ్గిన బంగారం...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

Gold Price Today: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ప్రధాన నగరాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే?

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Today Gold Rates: దేశంలో ఇటీవల బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్న విషయం
తెలిసిందే. తాజాగా స్వల్పంగా తగ్గింది. నిత్యం పసిడి ధరల్లో హెచ్చుతగ్గులు
చోటు…..

Today Gold Rates: దేశంలో ఇటీవల బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్న విషయం
తెలిసిందే. తాజాగా స్వల్పంగా తగ్గింది. నిత్యం పసిడి ధరల్లో హెచ్చుతగ్గులు
చోటు చేసుకుంటాయి. బంగారం ధరలు ఒక రోజు తగ్గుతుంటే.. మరోరోజు
పెరుగుతుంటాయి. అందుకే బంగారం కొనుగోలు చేసేవారు ఆసక్తితో బులియన్ మార్కెట్
వైపు చూస్తుంటారు. అయితే.. దేశంలో కరోనా ఉధృతి కనిపిస్తున్నప్పటికీ..
కొన్ని రోజుల నుంచి బంగారం ప్రియులకు ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి.
ఇటీవల తగ్గుతూ వచ్చి ధరలు కాస్తా.. మళ్లీ పెరుగుతున్నాయి. ఇటీవల 40వేలకు
దగ్గరలో వచ్చిన ధరలు.. మళ్లీ 44 మార్క్ దాటాయి. తాజాగా 10 గ్రాముల బంగారం
ధరపై 110 రూపాయల మేర తగ్గింది. శనివారం 45,060 ఉన్న 22 క్యారెట్ల తులం
బంగారం.. ఈ రోజు ఆదివారం 44,950 గా ఉంది. ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో
ఇప్పుడు ఓసారి చూద్దాం..

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

  • దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర ఈ రోజు 46,250 గా ఉంది. 24 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర 50,470 గా ఉంది.
  • ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర 44,950 గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 45,950 వద్ద కొనసాగుతోంది.
  • బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 44,600 గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 48,660 వద్ద కొనసాగుతోంది.
  • చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 44,770 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,840 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం.. ధరలు..

  • కాగా హైదరాబాద్‌లో అత్యధికంగా పసిడి ధర 200 మేర తగ్గింది. హైదరాబాద్‌లో
    10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,600 గా ఉంది. 24 క్యారెట్ల
    గోల్డ్‌ రూ.48,660 వద్ద కొనసాగుతోంది.
  • విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 44,600 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 48,660 వద్ద కొనసాగుతోంది.
  • విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 44,600 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 48,660 వద్ద కొనసాగుతోంది.

Silver Price Today: బంగారం బాటలోనే వెండి ధరలు.. స్వల్పంగా తగ్గిన రేట్లు.. ప్రధాన నగరాల్లో..

Today Silver Price: బంగారం, వెండి ధరలు ఒకరోజు తగ్గుముఖం పడుతుంటే..
మరో రోజూ పెరుగుతూ వస్తుంటాయి. దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరల్లో నిత్యం
వ్యత్యాసం ఏర్పడుతుంటుంది. దేశంలో చోటు చేసుకుంటున్న పలు పరిణామాల
నేపథ్యంలో బంగారం, వెండి ధరల్లో మార్పులు కలుగుతుంటాయి. కాగా ఆదివారం వెండి
ధరలు స్వల్పంగా తగ్గాయి. కిలో వెండి ధర శనివారం 68,900 ఉండగా.. ఆదివారం
68,700లు ఉంది. అంటే 200 రూపాయలు మేర తగ్గింది. అయితే దేశంలోని ప్రధాన
నగరాలతోపాటు.. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు
చూద్దాం.

ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఇలా..

  • దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 68,700 లుగా ఉంది.
  • ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి రూ.68,700 ఉంది. 
  • చెన్నైలో రూ.74,000 ఉంది. కాగా ఇక్కడ రికార్డు స్థాయిలో ధర కొనసాగుతోంది.
  • బెంగళూరులో రూ.68,700 వద్ద కొనసాగుతోంది.
  • కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.68,700 వద్ద ఉంది.
    తెలుగు రాష్ట్రాల్లో..
  • హైదరాబాద్‌లో వెండి కిలో రూ.74,000 లు ఉంది.
  • విజయవాడలో వెండి రూ.74,000 వద్ద కొనసాగుతోంది.

 


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this