Fact Check: నెబ్యులైజర్.. ఆక్సిజన్ కు ప్రత్యామ్నాయంగా...

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

సుప్రీంకోర్టు తీర్పు: టెట్ (TET) అర్హత గడువు 2028 వరకు పొడిగింపు | Supreme Court TET Verdict

సుప్రీంకోర్టు తీర్పు: ఉపాధ్యాయులకు టెట్ (TET) అర్హత గడువు పొడిగింపు ఉపాధ్యాయ అర్హత...

Thalliki Vandanam Scheme 2026-27: డేటా పరిశీలనలో ఈ 5 పొరపాట్లు చేయకండి!

Thalliki Vandanam Scheme 2026-27 డేటా పరిశీలనపై పూర్తి వివరాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

SSC Memo Download 2026: AP SSC Short Memos Available Online at BSE.AP.GOV.IN

ఆంధ్రప్రదేశ్ మాధ్యమిక విద్యా బోర్డు విడుదల చేసిన SSC Memo Download...

Fact Check: నెబ్యులైజర్.. ఆక్సిజన్ కు ప్రత్యామ్నాయంగా పనిచేస్తుందా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలో నిజమెంత?

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Fact Check: కరోనా అనే వైరస్ ఒకటి ఉందని కొంత కాలం క్రితం వరకూ ఎవరికీ
తెలీదు. ఈ వైరస్ కారణంగా ఇన్ని మరణాలు సంభావిస్తాయనీ ఎవరో అంచనా వేయలేదు.
కానీ, ఒక భూతం లా విరుచుకుపడి ప్రజల ప్రాణాలను హరించేస్తోంది.
ఎప్పటికప్పుడు రూపు మార్చుకుంటూ విచ్చలవిడిగా వ్యాపించేసి ప్రపంచాన్ని
టెన్షన్ పెడుతోంది. అయితే, ఈ కరోనా పుణ్యమా అని చేతిలో ఫోన్.. మెదడులో కొంత
ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరూ ఒకో వైద్యుడిలా తయారయిపోయారు. తమకు తోచిన
విషయాన్ని.. చిలవలు వలవలుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వదిలేస్తున్నారు. ఈ
సోషల్ మీడియా డాక్టర్లు చేస్తున్న కీడు అంతా ఇంతా అని చెప్పలేని
పరిస్థితి. ఒకరకంగా కరోనా కంటే ఈ వైద్యం గురించిన అంశాలే సోషల్ మీడియాలో
ఎక్కువ ప్రాచుర్యం లోకి వచ్చేస్తున్నాయి. తాజాగా ఆక్సిజన్ కొరత అనే
సంక్షోభానికి కొందరు సోషల్ మీడియా డాక్టర్లు.. నెబ్యులైజర్ తో చెక్
చెప్పోచ్చంటూ ప్రచారం మొదలు పెట్టారు. అసలు నెబ్యులైజర్ కి ఆక్సిజన్ కీ
సంబంధం ఏమిటి? ఈ వార్తల్లో నిజమెంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

దీని గురించి చెప్పుకునే ముందు అసలు నెబ్యులైజర్ అంటే ఏమిటో
చెప్పుకుందాం. నెబ్యులైజర్ ఏదైనా ఒక ద్రవం నుండి చక్కటి పొగమంచును
సృష్టించే పరికరం. సాధారణంగా సంపీడన గాలి లేదా ఆక్సిజన్ ఉపయోగించి లేదా
అల్ట్రాసోనిక్ వైబ్రేషన్ ద్వారా ఇది పనిచేస్తుంది. నెబ్యులైజర్ ఒక ఆవిరిని
స్సృష్టించే పరికరం కన్నాకాస్త భిన్నంగా ఉంటుంది. ఇది పొగమంచును ఉత్పత్తి
చేయడానికి వేడిని జెనరేట్ చేస్తుంది. అంటే.. ఈ పరికరంలో వేసిన మందు లేదా
ఏదైనా ద్రవాన్ని మంచులాంటి పొగలా మార్చే యంత్రం నెబ్యులైజర్. సింపుల్ గా
చెప్పాలంటే.. ఒక మందును ఇంజక్షన్ రూపంలో .. టాబ్లెట్ రూపంలో ఎలాగైతే
తీసుకుంటామో.. గాలిరూపంలో ఆ మందును తీసుకునేలా చేసే పరికరం నెబ్యులైజర్.
ఇది సాధారణంగా ఆస్తమా రోగులకు దానికి సంబంధించిన మందును శాసనాళాల్లోకి
గాలిరూపంలో పంపించి వారి ఊపిరిని అడ్డుకుంటున్న పదార్ధాలను చెల్లా చెదురు
చేసేలా చేస్తుంది.

ఇక ఆక్సిజన్ గురించి అందరికీ తెలిసిందే. ఇది ప్రాణవాయువు. ఇది సరిపడిన
పరిమాణంలో మనం ముక్కుద్వారా శ్వాసించలేకపోతె ఇబ్బంది తలెత్తుతుంది. అటువంటి
ఇబ్బందులు తలెత్తినపుడు సాధారణంగా బయట నుంచి ఆక్సిజన్ మద్దతు ఇస్తారు. ఇది
నేరుగా ఇవ్వాల్సిందే. ఏదైనా పరికరం ద్వారా దీనిని మన శ్వాస నాళాల్లోకి
పంపిస్తారు. దానికి చాలా పరికరాలుంటాయి. ఒక్కోసారి ఈ నెబ్యులైజర్ కూడా
అందుకోసం ఉపయోగిస్తారు.

ఇక ఈ వీడియో డాక్టర్ అలోక్ నాద్ అనే ఆయన సోషల్ మీడియాలో ఉంచారు. కానీ,
ఆయన అందులో ఆక్సిజన్ కు ప్రత్యామ్నాయంగా నెబ్యులైజర్ పని చేస్తుందని
చెప్పారు. అయితే, ఇది పూర్తిగా తప్పు. ఈ విషయాన్ని వైద్య నిపుణులు స్పష్టం
చేశారు. దురదృష్టవశాత్తూ సోషల్ మీడియాలో ఇప్పటికే ఈ వీడియో వైరల్ గా
మారిపోయింది.

వైరల్ గా మారిన వీడియో ఇది..

 

Dr. Alok apologize for his viral video regarding use of nebuliser machine. #sarvodayahospital #nebulizermachine #oxygen #dralok pic.twitter.com/d7APD3Z7d5

— H-tee (@Htee48738577) April 24, 2021

“ఒక నెబ్యులైజర్ ఔషధం యొక్క నిహారికలను అందిస్తుంది అలాగే, వాటిని
కొంచెం నెట్టివేస్తుంది. ఇది ఆక్సిజన్ అవసరాన్ని తీర్చదు. వాస్తవానికి,
కొన్ని సమయాల్లో, మీరు దానిని ఆక్సిజన్‌తో అనుసంధానించాలి ”అని
స్కాట్లాండ్‌లోని నేషనల్ హెల్త్ సర్వీస్ డాక్టర్ అవిరల్ వట్సా అన్నారు.

నేబ్యులైజర్ ఆక్సిజన్ కు ప్రత్యామ్నాయం కాదు అని చెబుతున్న వీడియో ఇదీ..

वह सर्वोदय अस्पताल फरीदाबाद से डॉ। आलोक हैं। उन्होंने रक्त ऑक्सीजन के स्तर में सुधार के लिए Alo नेबुलाइज़र ’का उपयोग करते हुए एक उत्कृष्ट तकनीक दिखाई है। ऑक्सीजन संकट के आज के परिदृश्य में यह कई लोगों की जान बचा सकता है। सभी से अनुरोध है कि इसे एक बार जरूर देखें। pic.twitter.com/flbEsqvY44

— Isha Bajaj (@Isha5384) April 23, 2021

 


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this