Corona Alert: ఏపీ నుంచి వేరే రాష్ట్రానికి...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

Corona Alert: ఏపీ నుంచి వేరే రాష్ట్రానికి వెళ్లాలంటే ఈ పాస్ మస్ట్.. అయినా మరో కండిషన్

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు
వెళ్తున్నారా? అయితే మీకో అలర్ట్. ఇకపై మస్ట్ గా ఈ పాస్ తీసుకోవాల్సిందే.
ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇచ్చింది. అంతే కాదు మరో
కండిషన్ కూడా పెడుతోంది.

ఏపీని కరోనా వైరస్ వెంటాడుతోంది. ప్రతి రోజు 11 వేలకుపైగా కేసులు నమోదు
అవుతుండడం ఆందోళన పెంచుతోంది. మరోవైపు మరణాలు కూడా పెరుగుతున్నాయి. ఈ
నేపథ్యంలో ఏపీ నుంచి బయటకు వెళ్లాలి అనుకునే ప్రయాణికులకు ఆంక్షలు తప్పడం
లేదు. ఇప్పటి వరకు బయట రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే వారి విషయంలో ఎలాంటి
ఆంక్షలు లేకున్నా.. ఇతర రాష్ట్రాలు మాత్రం బాబోయ్ ఏపీ నుంచి.. రానే
రావొద్దు అంటున్నాయి

ముఖ్యంగా చిత్తూరు, శ్రీకాకుళం జిల్లాల్లో భారీగా కేసులు నమోదు
అవుతున్నాయి. ఊహించని స్థాయిలో ప్రతి రోజే వేయికిపైగా మంది కరోనా బారిన
పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ రెండు జిల్లాల బోర్డర్ లలో పరిస్థితి దారుణంగా
ఉంది. చిత్తూరు నుంచి తమిళనాడు వెళ్లాలి అనుకునే వారికి.. శ్రీకాకుళంలో
నుంచి ఒడిషా వెళ్లాలి అనుకునే వారికి కష్టాలు తప్పడం లేదు.

ఆంధ్ర నుంచి తమ రాష్ట్రానికి వచ్చే వారు ఎవరైనా తప్పక ఈ పాస్ తీసుకోవాలని
పక్క రాష్ట్రాలు స్పష్టం చేస్తున్నాయి. ఒడిషా, తమిళనాడు, కర్ణాటక మూడు
రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏపీ నుంచి వచ్చే వారిపై ఆంక్షలను కఠినం చేశాయి.

తమిళనాడులో ఇటీవల కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పళనిస్వామి ప్రభుత్వం
మరికొన్ని ఆంక్షలను విధించింది. ఇప్పటి వరకు వెసులుబాటు ఉన్న
ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, కేరళ రాష్ట్రాల ప్రజలు కూడా తప్పనిసరిగా ఈ-పాస్‌
పొందాలని స్పష్టం చేసింది.

ఇప్పటికే బోర్డర్ దాటి వెళ్లాలి అనుకునే వారు చాలా కష్ట పడాల్సి వస్తోంది.
అంతరాష్ట్ర ప్రయాణలపై కేంద్రం ఎలాంటి ఆంక్షలు విధించలేదు. దీంతో అత్యవసరం,
తప్పని సరి అనుకున్నవాళ్లు ఇతర రాష్ట్రాలకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే బోర్డర్ దగ్గర వారికి కష్టాలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం
చేస్తున్నారు.

బోర్డర్ దాటి తమ రాష్ట్రంలో అడుగు పెట్టాలి అంటే తప్పక థర్మల్ స్క్రీనింగ్
కు ఒఫ్పుకోవాలని కండిషన్ పెడుతున్నాయి. అందుకు నో చెప్పే వారిని వెనక్కు
పంపించేస్తున్నాయి. దాంతో పాటు కరోనా లేదనే నెగిటివ్ రిపోర్ట్ కూడా
చూపెట్టాలని బోర్డర్ దగ్గర పోలీసులు నిలదీస్తున్నారని ఏపీ బోర్డర్ వాసులు
ఆందోళన చెందుతున్నారు.

బోర్డర్ దగ్గర టెంపరేచర్ ఎక్కువగా ఉందని తెలితే వారిని వెనక్కు
పంపించేస్తున్నారు. ఒక వేళ వారు తమ రాష్ట్రానికి చెందిన వారని గుర్తిస్తే..
వారికి కరోనా పరీక్షలు చేసి.. పాజిటివ్ ఉన్నవారిని దగ్గర్లో ఏర్పాటు చేసిన
క్వారంటైన్ సెంటర్లకు పంపిస్తున్నారు.

ఏపీలో ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే ఈ ఆంక్షలు మరింత కఠినం అయ్యే ప్రమాదం
కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఇతర రాష్ట్రాల బోర్డర్ దగ్గర మాత్రమే అడ్డంకులు
ఎదురవుతున్నాయి. లాక్ డౌన్ నాటి పరిస్థితి తలెత్తి.. జిల్లాల
సరిహద్దుల్లోనూ చెక్ పోస్టులు వెలిసే ప్రమాదం ఉందని ప్రజలు భయపడుతున్నారు.

ఒడిశా బోర్డర్ లో పరిస్థితి అయితే దారుణంగా ఉంది అంటున్న శ్రీకాకుళం జిల్లా
వాసులు. తమకు ఒడిశాతో చాలా అసవరాలు ఉంటాయని.. కానీ బోర్డర్ దాటి
వెళ్దామంటే అక్కడే పోలీసులు నిలిపివేస్తున్నారని ఆవేదన వ్యక్తం
చేస్తున్నారు.

ప్రస్తుతానికి అంతరాష్ట్ర ఆంక్షలు  లేకపోయినా.. నెగిటివ్ రిపోర్టు
ఉన్నవాళ్లనే తమ రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారు. లేదంటే బోర్డర్ దగ్గర
స్క్రీనింగ్ టెస్టు చేయడంతో పాటు.. ప్రయాణికుల పూర్తి వివరాలు
సేకరిస్తున్నారు.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this