AP Cabinet meeting: రేపు ఏపీ రాష్ట్ర...

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP Cabinet meeting: రేపు ఏపీ రాష్ట్ర మంత్రి మండలి సమావేశం.. కరోనా తీవ్రత, మినీ లాక్‌డౌన్‌పై కీలక చర్చ!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

రాష్ట్రంలో క్రమంగా క‌రోనా పాజిటివ్ కేసులతో పాటు మృతుల సంఖ్య
పెరుగుతుండటంతో ఆంధ్రప్రదేశ్ కేబినెట్ స‌మావేశం అవుతుండటం ప్రాధాన్యత
సంతరించుకుంది.

AP Cabinet meeting: రాష్ట్రంలో క్రమంగా క‌రోనా
పాజిటివ్ కేసులతో పాటు మృతుల సంఖ్య పెరుగుతుండటంతో ఆంధ్రప్రదేశ్ కేబినెట్
స‌మావేశం అవుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నెల 29వ తేదీన ఉద‌యం 11
గంట‌ల‌కు స‌చివాల‌యంలో ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి అధ్యక్షత‌న
జ‌ర‌గ‌నున్న ఏపీ కేబినెట్ స‌మావేశంలో.. క‌రోనా నియంత్రణకు చేపట్టాల్సిన
చర్చలపైనే ప్రధానంగా చ‌ర్చించి కీల‌క నిర్ణయాలు తీసుకోనున్నట్లు
తెలుస్తోంది.

రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ల కొర‌త వెంటాడుతుండ‌గా.. వ్యాక్సినేష‌న్‌ను
వేగ‌వంతం చేయ‌డంపై కూడా దృష్టిసారించ‌నుంది రాష్ట్ర ప్రభుత్వం. రికార్డు
స్థాయిలో పెరుగుతున్న క‌రోనా రోగుల‌కు అందుతున్న వైద్య స‌దుపాయాల‌పై
చ‌ర్చించ‌నున్న సీఎం వైఎస్ జ‌గ‌న్.. ఆక్సిజ‌న్, బెడ్లు, రెమిడెసివిర్ కొర‌త
వంటి అంశాల‌పై చ‌ర్చించే అవ‌కాశాలున్నాయి. వీటితో పాటు ప‌లు కీల‌క
ఎజెండాల‌పై రాష్ట్ర కేబినెట్ చర్చించనున్నట్లు తెలుస్తోంది.

కాగా, ఈ నేపథ్యంలోనే ఇవాళ ఏపీ కేబినెట్‌ సబ్‌ కమిటీ కీలక భేటీ జరుగుతుంది.
రెమ్‌డెసివిర్‌, ఆక్సిజన్‌, వ్యాక్సినేషన్‌పై చర్చిస్తారు మంత్రులు.
మినీలాన్‌డౌన్‌పై కేంద్ర మార్గదర్శకాలపై కూడా మంత్రుల కమిటీ
చర్చించబోతున్నారు. ఏపీలో కరోనా విలయతాండవం కారణంగా మినీలాక్‌డౌన్‌తో పాటు
కొత్త ఆంక్షలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌
సూచనలపై సమీక్షించిన తరువాత ముఖ్యమంత్రి జగన్‌కు సబ్‌కమిటీ నివేదిక ఇచ్చే
అవకాశం ఉంది. ఈ నివేదిక ఆధారంగా రేపు జరగనున్న ఏపీ కేబినెట్‌ భేటీలో
చర్చించే అవకాశాలున్నాయి.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this