Wednesday, February 18, 2026
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
Corona Vaccine Registration: 18 ఏళ్లు నిండిన...

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక తరగతుల కోసం సమగ్ర మార్గదర్శి

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి...

Corona Vaccine Registration: 18 ఏళ్లు నిండిన వారు వ్యాక్సిన్ రిజిస్టర్ చేసుకున్నారా..! అయితే ఇలా పేర్లు నమోదు చేసుకోండి..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

18 ఏళ్లు నిండిన వారంద‌రికీ మే 1వ తేదీ నుంచి క‌రోనా వ్యాక్సిన్
ఇవ్వాల‌ని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వ్యాక్సిన్‌ పొందాలనుకునేవారు
CoWIN వెబ్‌పోర్టల్‌లో తమ పేర్లను రిజిస్ట్రేష‌న్ చేసుకోవాల‌ని అధికారులు
స్పష్టం చేశారు.

Covid vaccine registration: దేశవ్యాప్తంగా విజృంభణ కట్టడికి వ్యాక్సిన్
తీసుకోవడంతో కొంత తీవ్రత తగ్గుతుందని నిపుణులు సూచిస్తున్న వేళ
వ్యాక్సినేషన్ వేగవంతం చేసింది కేంద్ర ప్రభుత్వం. సెకండ్‌వేవ్‌ తీవ్రంగా
విజృంభిస్తున్న నేపథ్యంలో 18 ఏళ్లు నిండిన వారంద‌రికీ మే 1వ తేదీ నుంచి
క‌రోనా వ్యాక్సిన్ ఇవ్వాల‌ని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వ్యాక్సిన్‌
పొందాలనుకునేవారు CoWIN వెబ్‌పోర్టల్‌లో తమ పేర్లను రిజిస్ట్రేష‌న్
చేసుకోవాల‌ని అధికారులు స్పష్టం చేశారు. 18 ఏళ్లు నిండిన అందరికీ టీకా
ఇవ్వడం వల్ల టీకా కేంద్రాలకు వచ్చే వాళ్లతో రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున
టీకా కోసం ముందస్తుగా రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి చేసినట్లు అధికారులు
తెలిపారు. నేరుగా టీకా కేంద్రాలకు వెళ్లి వ్యాక్సిన్‌ తీసుకోవడం కుదరదని
వెల్లడించారు. ఈ నేపథ్యంలో కొవిన్ వెబ్‌సైట్‌లో టీకా కోసం ఎలా
రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలో తెలుసుకుందాం..

కొవిన్ వెబ్‌సైట్‌లో ఇలా రిజిస్టర్ చేసుకోండి….

☛ ముందుగా కొవిన్ పోర్టల్ (https://cowin.gov.in ) ఓపెన్ చేయాలి.

☛ అనంత‌రం మొబైల్ నంబ‌ర్ ఎంట‌ర్ చేసి గెట్ ఓటీపీపై క్లిక్ చేయాలి.

☛ మొబైల్‌కు వ‌చ్చిన ఓటీపీని వెబ్‌సైట్‌లో ఎంట‌ర్ చేసి, వెరిఫై బ‌ట‌న్‌పై క్లిక్ చేయాలి.

☛ రిజిస్ట్రేష‌న్ ఫ‌ర్‌ వ్యాక్సినేష‌న్ అని పేజి ఓపెన్ అవుతుంది.

☛ అందులో ఫొటో గుర్తింపు కార్డును ఎంచుకుని దాని నంబ‌ర్‌తో పాటు పేరు, పుట్టిన సంవ‌త్సరం వంటి వివ‌రాల‌ను న‌మోదు చేయాలి.

☛ ఏ గుర్తింపు కార్డులో ఉన్నట్లు వివరాలు నమోదు చేశారో దాన్ని అప్‌లోడ్‌ చేయాలి.

☛ రిజిస్ట్రేష‌న్ అనంత‌రం ఏ రోజు టీకా వేయించుకోవాలో షెడ్యూల్ చేసుకోవాలి.

☛ ఇందుకోసం ముందుగా షెడ్యూల్ బ‌ట‌న్‌పై క్లిక్ చేయాలి.

☛ అందులో మీ ఏరియా పిన్ కోడ్ ఎంట‌ర్ చేయ‌గానే.. అందుబాటులో ఉన్న టీకా కేంద్రాల జాబితా క‌నిపిస్తుంది.

☛ వాటి ఆధారంగా తేదీ, స‌మ‌యాన్ని సెలెక్ట్ చేసుకుని క‌న్ఫార్మ్ బ‌ట‌న్‌పై క్లిక్ చేయాలి.

☛ తరువాత వ్యాక్సినేషన్‌ కేంద్రం ఎంచుకోవాలి. అది ప్రైవేట్‌ లేదా ప్రభుత్వ వ్యాక్సినేషన్‌ కేంద్రం ద్వారా టీకా తీసుకోవచ్చు.

☛ ఒక్క లాగిన్‌పై నలుగురికి అపాయింట్‌మెంట్ తీసుకోవ‌చ్చు.

☛ ఏదైతే గుర్తింపు కార్డు వివరాలు నమోదు చేశారో ఆ వివరాలతో వ్యాక్సినేషన్‌ కేంద్రానికి మీరు ఎంచుకున్న తేదీ, సమయానికి వెళ్లాలి.

☛ అలాగే షెడ్యూల్ తేదీల‌ను కూడా మార్చుకునే వెసులుబాటు ఉంది.

☛ కొవిన్ వెబ్‌సైట్‌తో పాటు ఆరోగ్య సేతు యాప్ ద్వారా కూడా రిజిస్ట్రేష‌న్ చేసుకోవ‌చ్చు.

 



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this