Sunday, February 15, 2026
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
Daily Astrology: మే 2, ఆదివారం దినఫలాలు

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక తరగతుల కోసం సమగ్ర మార్గదర్శి

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి...

Daily Astrology: మే 2, ఆదివారం దినఫలాలు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

మేషం: ఈ రోజు ఈ రాశిలోని వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. వాహనాలు కొంటారు. ఖర్చులు పెరిగినా ఆర్థిక ఇబ్బందులు ఉండ‌వు.. విద్యార్థులకు దూర ప్రాంతాల నుంచి ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. దైవ కార్యక్రమాల్లో పూర్తిగా నిమగ్న‌మైపోతారు. 

వృషభం: ఈ రోజు ఈ రాశిలోని వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలుంటాయి. ప్రముఖుల కలయిక వల్ల ఆశించిన ప్రయోజనం వుండదు. గృహంలో శుభకార్యానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనుల్లో ఏకాగ్రత ఎంతో ముఖ్యం. 

మిథునం: ఈ రోజు ఈ రాశిలోని రిప్రజెంటేటివ్‌లకు అధిక శ్రమ, చికాకులు తప్పవు. కుటుంబీకులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. బంధువుల రాకతో కొంత అసౌకర్యానికి గురవుతారు. 

కర్కాటకం: ఈ రోజు మీ ఆర్థిక లావాదేవీలు అంతంతమాత్రంగా వుంటాయి. స్త్రీలకు పనివారలతో ఒత్తిడి, చికాకులు ఎదుర్కొంటారు. బంధువులతో రాకతో గృహంలో సందడి కానవస్తుంది. 

సింహం: ఈ రోజు ఈ రాశిలోని దంపతుల మధ్య అభిప్రాయభేదాలు నెల‌కొంటాయి.. రియల్ ఎస్టేట్, మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. ప్రముఖులను కలుసుకుంటారు. రావలసిన ధనంలో కొంత మొత్తం వసూలు కాగలదు. 

కన్య: ఈ రోజు మీరు బంధుమిత్రులను కలుసుకుంటారు. రాబోయే ఆదాయానికి తగినట్లుగా లెక్కలు వేసుకుంటారు. కోళ్ళ, మత్స్య, గొర్రె వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. 

తుల: ఈ రోజు మీ భాగస్వామిక, సొంత వ్యాపారాలు ఆశించినంత లాభదాయకంగా సాగవు. ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించండి. మీ కృషి ప్రోత్సాహం లభిస్తుంది. అవివాహితులకు శుభవార్త శ్రవణం. ధన వ్యయం విషయంలో ఏకాగ్రత వహించండి. 

వృశ్చికం: ఈ రోజు ఈ రాశివారు ఆర్థికంగా మంచి అభివృద్ధిని పొందుతారు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల్లో మెళకువ చాలా అవసరం. మీ సంతానం కోసం అధికంగా శ్రమిస్తారు. నిరుద్యోగులు సదవకాశాలు సద్వినియోగం చేసుకోవడం మంచిది. 

ధనస్సు: ఈ రోజు ఈ రాశిలోని సినిమా, కళారంగాల్లో వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగాల్లో వారికి ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణాల్లో మెళకువ అవసరం. దైవదర్శనాలు చేస్తారు. చేతివృత్తులు, క్యాటరింగ్ పనివారలకు పురోభివృద్ధి ఉంటుంది.

మకరం: ఈ రోజు ఈ రాశిలోని ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, ఏసీ రంగాల్లో వారికి పురోభివృద్ధి. చేతివృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. వివాహాది శుభకార్యాల్లో చురుకుగా పాల్గొంటారు. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. 

కుంభం: ఈ రోజు ఈ రాశిలోని కుటుంబ, ఆర్థిక సమస్యలు సర్దుకుంటాయి. ఆరోగ్యం, ఆహార విషయంలో మెళకువ అవసరం. కిరాణా, ఫ్యాన్సీ రంగాల్లో వారికి కలిసిరాగలదు. ప్రేమికులు అతిగా వ్యవహరించి చిక్కుల్లో పడే ఆస్కారం వుంది. వృత్తి వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి కానవస్తుంది. 

మీనం: ఈ రోజు ఈ రాశివారికి దైవ, సేవా, పుణ్యకార్యక్రమాల పట్ల ఆసక్తి అధికమవుతుంది. స్త్రీలకు చుట్టుపక్కల వారి నుంచి ఆహ్వానాలు అందుతాయి. మిత్రుల మాటతీరు, పద్ధతి కష్టం కలిగిస్తాయి. 


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this