Daily Astrology: మే 1, శనివారం దిన...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

Daily Astrology: మే 1, శనివారం దిన ఫలాలు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 Horoscope today 1-5-2021: మరో నెల ప్రారంభమైంది. మరి ఈ నెలలో మొదటి రోజు ఎలా ఉంటుంది. నేడు ఎవరి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం.

Horoscope today on 1-5-2021: దేశంలో పరిస్థితులు బాగోకపోయినా రాశి ఫలాలు మాత్రం కాస్తంత ధైర్యం ఇస్తున్నాయి. భవిష్యత్తుపై పాజిటివ్ ఆలోచనలను పెంచుతున్నాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయని చెబుతున్నాయి. గ్రహాలు, సూర్య గమనం, తిథి, కాలం వంటి అన్ని అంశాల్నీ లెక్కలోకి తీసుకొని రాశిఫలాలు ఇస్తున్నారు జ్యోతిష పండితులు. మరి ఇవాళ ఎవరి రాశి ఎలా ఉంది? ఏ రాశి వారికి బాగా కలిసొస్తుంది? ఎవరికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి? ఆర్థిక వ్యవహారాలపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి? ప్రేమలు, పెళ్లిళ్లకు ఎలాంటి సంకేతాలు ఉన్నాయో తెలుసుకుందాం.

మేష రాశి (Aries) సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. తలచిన పనులు నెరవేరుతాయి. చాలాకాలంగా చేస్తున్న వివాహ ప్రయత్నాలు ఫలించవచ్చు. దూర ప్రయాణాలకు ప్రయత్నాలు చేస్తారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. పొదుపు చర్యలు చేపడతారు.

వృషభ రాశి (Taurus) ఉద్యోగ, వివాహ ప్రయత్నాల్లో శుభవార్త వింటారు. రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆలయాలకు వెళ్తారు. సహచర, సన్నిహితులతో వాదనకు దిగవద్దు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త.

మిథున రాశి (Gemini) ఉద్యోగం విషయంలో అనుకూల సమాచారం అందుతుంది. సన్నిహితులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. చిన్నప్పటి స్నేహితులు పకరిస్తారు. శుభాకార్యం తలపెడతారు. సంతానంలో ఒకరికి పెళ్లి సంబంధం కుదురుతుంది. కొద్దిగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. హామీలు ఉండవద్దు.

కర్కాటక రాశి (Cancer) ఈ రాశి వారికి సమయం అన్నివిధాలా అనుకూలంగా ఉంది. ఇంటికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పెళ్లి ప్రయత్నాలు ప్రారంభిస్తారు. బంధువులు, స్నేహితులు సహాయపడతారు. ఆర్థిక లావాదేవీల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. విద్యార్థుల మీద బాగా ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్యం జాగ్రత్త.

సింహ రాశి (Leo) పెళ్లి ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. బంధుమిత్రుల నుంచి సహకారం అందుతుంది. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగానే ఉంటుంది. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు వద్దు. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. విద్యార్థుకు పరవాలేదు. ప్రేమ వ్యవహారాల్లో ఉత్సాహంగా గడుపుతారు.

కన్య రాశి (Virgo) వివాహ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ప్రతి పనీ ఆలస్యం అవుతుంటుంది. ఆదాయం మెరుగ్గానే ఉంటుంది. ఖర్చులు బాగా పెరుగుతాయి. బంధుమిత్రుల రాకపోకలతో తీవ్ర ఒత్తిడికి లోనవుతారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ వ్యవహారాలు నత్తనడక నడుస్తాయి.

తుల రాశి (Libra) ఉద్యోగం విషయంలో సమయం అనుకూలంగా ఉంది. శుభకార్యాలు జరుగుతాయి. విహార యాత్రకు ప్లాన్‌ వేస్తారు. విద్యార్థులు ప్రశంసలు అందుకుంటారు. ఆరోగ్యం జాగ్రత్త. తిప్పుట ఎక్కువగా ఉంటుంది. తగాదాలకు దూరంగా ఉండండి. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా ఉల్లాసంగా సాగుతాయి.

వృశ్చిక రాశి (Scorpio) ఆదాయానికి కొరత లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్త వింటారు. అప్పు తీర్చే ప్రయత్నం చేస్తారు. విద్యార్థులు సునాయాసంగా పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సంతోషంగా ముందుకు సాగుతాయి. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం జాగ్రత్త.

ధనస్సు రాశి (Sagittarius) ఈ రోజంతా ప్రశాంతంగా గడిచిపోతుంది. శుభకార్యం తలపెడతారు. వివాహ సంబంధం కుదురుతుంది. సంతానం నుంచి శుభవార్త వింటారు. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. కొత్త స్నేహితులు పరిచయమవుత రు. స్నేహితురాలితో షికార్లు చేస్తారు. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది.

మకర రాశి (Capricorn) ఏలిన నాటి శని కారణంగా పనులు ఆలస్యం అవుతుంటాయి. తిప్పుట ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. అనుకోని విధంగా డబ్బు చేతికి అందుతుంది. ఖర్చులు తగ్గించుకోవాలి. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. వివాహ సంబంధం కుదరవచ్చు. స్నేహితురాలి నుంచి శుభవార్త వింటారు.

కుంభ రాశి (Aquarius) ఆదాయం నిలకడగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. వివాహ సంబంధం కుదురుతుంది. స్నేహితుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. విద్యార్థులకు ప్రశంసలు లభిస్తాయి.

మీన రాశి (Pisces) మంచి సంస్థ నుంచి ఉద్యోగం ఆఫర్‌ వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. అదనపు ఆదాయ మార్గం గురించి తీవ్రంగా ఆలోచిస్తారు. చాలావరకు అప్పు తీరుస్తారు. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్త.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this