SSC, Inter Examinations :అమరావతి: ఏపీలో పది, ఇంటర్ పరీక్షలు నిర్వహించి తీరతామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. కొవిడ్ ఉద్ధృతి తగ్గాక పరీక్షలు నిర్వహిస్తామన్నారు. పరీక్షలను రద్దు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరడం లేదని ఆయన తెలిపారు. ప్రతిపక్షాలు దీనిపై అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రి మండిపడ్డారు. రాజమహేంద్రవరంలో ఎంపీ భరత్‌తో కలిసి పర్యావరణ దినోత్సవం సందర్భంగా సురేష్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణకు అందరూ ముందుకు రావాలన్నారు. మరో వైపు రాష్ట్రంలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పది, ఇంటర్ పరీక్షలను వాయిదా వేసిన విషయం తెలిసిందే.
AP News: పరీక్షలు నిర్వహించి తీరుతాం: మంత్రి ఆదిమూలపు సురేష్
వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)
-
సమాచార ఖచ్చితత్వం:
ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి. -
సమాచార ఉపయోగం:
ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము. -
లింక్‌లు & బాహ్య సైట్‌లు:
ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము. -
కాపీరైట్ & స్వామిత్వం:
ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం. -
సవాళ్లు & స్పందన:
ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.
