Health Tips: ఈ వంటకాలను ఐరన్ పాత్రలలో.....

AP District Wise Cadre Strength and Working Strength – G.O.Ms.No.156

ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖకు సంబంధించి Finance Department ద్వారా G.O.Ms.No.156, తేదీ...

AP G.O. Ms. No. 33: Major Amendments to AP Educational Service Rules 2026

The Government of Andhra Pradesh has issued a landmark...

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Health Tips: ఈ వంటకాలను ఐరన్ పాత్రలలో.. కడాయిలలో అసలు వండకూడదట.. ఎందుకంటే

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Health Tips: మన భారతీయ వంటశాలలో నల్లగా ఉండే ఇనుప కడాయిలలో వంటలు చేస్తుంటారు. అలాగే ఇనుప చిప్పలలో వంటలు చేయడమనేది… 

పూర్వపు రోజుల నుంచి వాడుకలో ఉన్నదే. ఈ ఇనుప కడాయిలలో వంటలు చేయడం వలన వాటి రుచి మరింత పెరుగుతుంది. టెప్లాన్, ఇతర పూత పూసిన పాత్రలతో పోల్చితే.. ఇనుముతో చేసిన పాత్రలు.. కడాయిలు వంట చేయడానికి మంచివి. కానీ ఇనుప కడాయిలలో, పాన్ లలో ఎప్పుడూ ఉడికించకూడని కొన్ని ఆహారాలు కూడా ఉన్నాయి. అవెంటో తెలుసుకుందామా.

నిమ్మకాయ, టమోటాలు, వెనిగర్ వంటి ఆమ్ల స్వభావం గల టార్టీ ఆహారాలను వండకుండా ఉండాలి. ఇందులో రసం, కడి, నిమ్మకాయ, పెరుగు వంటి చిక్కని పచ్చడి లేదా టమోటా ఆధారిత కూరలను ఇనుప కడాయిలో ఎప్పుడూ ఉడికించకూడదు. అయిన కానీ మీరు అందులోనే వంట చేయాలనుకుంటే.. మంచి కాస్ట్లీ ఐరన్ పాన్‌ను ఉపయోగించాలి. ఐరన్ పాన్‌లో ఆమ్ల ఆహారాలను వంట చేయడం తగ్గించుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్కృతులు గుడ్డు, బియ్యం, పాస్తా రుచికరమైన పదార్ధాలను కాస్ట్ ఇనుప పాన్‌లో వండుతున్నారని.. ఈ ఆహారాలు వాటి ప్రాథమిక ఆకృతి కారణంగా పాన్‌కు అంటుకుంటాయని ఆహార నిపుణులు సూచిస్తున్నారు. అలాంటి పాన్లలో వంట చేయకుండా ఉండటం మంచిది. చేపలు, కొన్ని సీఫుడ్లు ప్రకృతిలో పొరలుగా ఉండేవాటిని వంట చేసేటప్పుడు పాన్ కు అంటుకోవచ్చు. నూనె, వెన్నను ఉపయోగించినప్పటికీ కొన్ని చేపలు అంటుకుని రుచి మారుతుంది. చాలా మంది భారతీయులకు స్వీట్లు కడాయిలో తయారుచేసే అలవాటు ఉంటుంది. ఇనుప కడాయిలలో స్వీట్లు చేయడం వలన రుచికరమైన వాసన కడిగిన తర్వాత కూడా అలాగే వస్తాయి. ఇది మీ ఇతర వంటల రుచి, వాసనను మారుస్తుంది.

కఠినమైన స్క్రబ్బర్లు లేదా చాలా తేలికపాటి స్పాంజ్లు ఉపయోగించి కడాయిలను ఎప్పుడూ స్క్రబ్ చేయవద్దు. తేలికపాటి లిక్విడ్ వాష్‌తో మీ పాన్‌ను చక్కగా శుభ్రపరిచేలా చూసుకోండి. ఇనుముతో చేసిన కడాయిలు తుప్పు పట్టకుండా ఉండాలంటే.. కడిగిన తరువాత వాటిని తుడిచి చిన్న పొర నూనె వేసి శుభ్రమైన పొడి ప్రదేశంలో ఉంచండి. మీ వండిన ఆహారాన్ని ఐరన్ పాత్రలలో ఎక్కువ గంటలు నిల్వ ఉంచవద్దు. ఎందుకంటే ఇది లోహ రుచి లేదా వాసనను వదిలివేస్తుంది. పాన్ తుప్పు పట్టకుండా ఉండటానికి, వాసనను తొలగించడానికి ఎప్పుడూ వంటను వేరే పాత్రలోకి మార్చి.. కొద్దిగా వేడి పాన్ ను వెంటనే శుభ్రం చేయండి.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this