Covid Leaves: కేంద్ర ఉద్యోగులకు ...

AP Inter Results 2026 Today Live: Direct Links for 1st & 2nd Year Results, WhatsApp Mana Mitra Process, SMS Method

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్...

AP SSC Hall Ticket 2026 Released – Download 10th Class Hall Ticket

The Board of Secondary Education Andhra Pradesh (BSEAP) has...

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

Covid Leaves: కేంద్ర ఉద్యోగులకు 15 రోజుల ప్రత్యేక సీఎల్‌!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

  • తల్లిదండ్రులకు పాజిటివ్‌ వస్తే తీసుకోవచ్చు
  • కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వు

Corona Leaves: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ తల్లిదండ్రులు లేదా కుటుంబ సభ్యులకు ఎవరికైనా కరోనా పాజిటివ్‌ వస్తే 15 రోజుల ప్రత్యేక సాధారణ సెలవు (ఎస్‌సీఎల్‌)లు తీసుకోవచ్చు. ఈ మేరకు ఉద్యోగులకు అవకాశం కల్పిస్తూ కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ‘‘కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ సభ్యులు/తల్లిదండ్రులు 15 రోజుల ప్రత్యేక సీఎల్‌లు పూర్తయిన తర్వాత కూడా ఆస్పత్రిలోనే ఉండాల్సి వస్తే.. వారు డిశ్చార్జి అయ్యే వరకు ఇతర సెలవులు కూడా ఇచ్చే అవకాశం ఉంది’’ అని తెలిపింది. కరోనా మహమ్మారి కారణంగా ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో చికిత్స, ఆస్పత్రిలో, క్వారంటైన్‌లో ఉండడంపై సమగ్ర వివరాలతో కూడిన ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చి హోం ఐసొలేషన్‌/ క్వారంటైన్‌లో ఉంటే 20 రోజుల వరకు ప్రయాణ సెలవులు/ఎ్‌ససీఎల్‌/ఆర్జిత సెలవులు ఇస్తారు.

20 రోజులకు మంచి ఆస్పత్రిలో ఉండాల్సి వస్తే సంబంధిత ఆధారాలు చూపితే ప్రయాణ సెలవులు మంజూరు చేసా ్తరు. కొవిడ్‌ పాజిటివ్‌ వ్యక్తితో నేరుగా కాంటాక్ట్‌ అయి హోం ఐసొలేషన్‌లో ఉండాల్సి వచ్చిన ఉద్యోగులకు ఏడు రోజులు ఆన్‌డ్యూటీ/ వర్క్‌ఫ్రం హోంగా పరిగణిస్తారు. కట్టడి ప్రాంతాల్లో ఉన్న ఉద్యోగులకు ఆ ప్రాంతం మళ్లీ సాధారణ జోన్‌గా మారే వరకు ఆన్‌డ్యూటీ/వర్క్‌ ఫ్రం హోంగా పరిగణిస్తారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయి. 


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this