Inter Examinations: తెలంగాణలో ఇంటర్ పరీక్షలు రద్దయ్యాయి. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే ప్రథమ సంవత్సరం పరీక్షలను రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా ద్వితీయ సంవత్సరం పరీక్షలను కూడా రద్దు చేసింది. ఈ మేరకు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలపై మంగళవారం కేబినెట్ భేటీలో చర్చ జరిగింది.
సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈతో పాటు మరికొన్ని రాష్ట్రాలు పరీక్షలను రద్దు చేశాయని అధికారులు కేబినెట్ దృష్టికి తీసుకెళ్లారు. కరోనా కేసుల తీవ్రత తగ్గుముఖం పట్టినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పరీక్షల నిర్వహణ సబబు కాదని మంత్రివర్గం అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలను రద్దు చేసింది. ఈ నిర్ణయంపై సాయంత్రం అధికారికంగా ప్రకటన చేయనున్నారు. పరీక్షల రద్దు, ఫలితాల విధానంపై ఇంటర్‌బోర్డు ప్రకటన చేయనుంది.
వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)
-
సమాచార ఖచ్చితత్వం:
ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి. -
సమాచార ఉపయోగం:
ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము. -
లింక్‌లు & బాహ్య సైట్‌లు:
ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము. -
కాపీరైట్ & స్వామిత్వం:
ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం. -
సవాళ్లు & స్పందన:
ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.