APEPDCL Power Bill: మీ ఇంటి కరెంట్...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

AP Mandal Wise Surplus Teachers List 2026: Check District & Mandal Details

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మరియు ఉపాధ్యాయుల బదిలీలు (AP Teachers Transfers) లేదా...

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

సుప్రీంకోర్టు తీర్పు: టెట్ (TET) అర్హత గడువు 2028 వరకు పొడిగింపు | Supreme Court TET Verdict

సుప్రీంకోర్టు తీర్పు: ఉపాధ్యాయులకు టెట్ (TET) అర్హత గడువు పొడిగింపు ఉపాధ్యాయ అర్హత...

APEPDCL Power Bill: మీ ఇంటి కరెంట్ మీటర్ రీడింగ్ మీరే తీసుకోవచ్చు..! అయితే ఇలా చేయండి..!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

APEPDCL వినూత్న ఆలోచన చేసింది. ఇక ముందు మీ ఇంటి విద్యుత్‌ మీటర్‌ రీడింగ్‌‌ను మీరే తీసుకోవచ్చు. 

ఇక ముందు బిల్‌ ఇచ్చేందుకు సిబ్బంది రావాల్సిన పనిలేదు. ప్రతి నెలా మీ సెల్‌ఫోన్‌తో మీరే మీటర్‌ రీడింగ్‌ని స్కాన్‌ చేసి.. బిల్లు తీసుకునే యాప్‌ అందుబాటులోకి తీసుకొచ్చారు APEPDCL అధికారులు. కరోనా రోజు రోజుకు విస్తరిస్తుండటంతో విద్యుత్ సిబ్బంది కూడా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఈ తరహాలో ఓ యాప్‌ను డిజైన్ చేశారు. బుధవారం Self Meter Reading సేవలను ప్రారంభించారు. ఈ సంస్థ ఐటీ యాప్‌లో ‘కన్జ్సూమర్‌ సెల్ఫ్‌ బిల్లింగ్‌’ ఐచ్ఛికాన్ని జోడించి గూగుల్‌ ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉంచింది. ఇందులో కోసం ఈ క్రింద ఉన్న లింక్‌ను క్లిక్ చేయండి….

https://play.google.com/store/apps/details?id=com.apepdcl.consumerapp

ఇలా చేయండి…

ప్లే స్టోర్‌ నుంచి APEPDCL యాప్‌ను మొబైల్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఇప్పటికే ఈ యాప్‌ వినియోగిస్తున్నవారు సైతం అప్‌డేట్‌ చేసుకోవాలి. యాప్‌ తెరవగానే ‘కన్జ్సూమర్‌ సెల్ఫ్‌ బిల్లింగ్‌’  అంటూ కనిపిస్తుంది. కొత్తగా యాప్‌ వాడుతున్నట్లయితే యునిక్‌ సర్వీస్‌ నంబరు, ఈ-మెయిల్‌, మొబైల్‌ నంబరు వంటి వివరాలు అక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. మీరు ఏ మీటర్‌ బిల్లింగ్‌ తీసుకోవాలనుకుంటున్నారో ఆ మీటర్‌‌ను స్కానింగ్‌ చేయమని చూపిస్తుంది. దానిపై క్లిక్‌ చేసి మీటర్‌లో ‘కేడబ్ల్యూ హెచ్‌’ అంకెలు వచ్చినప్పుడు స్కాన్‌ చేయాలి. వివరాలన్నీ సక్రమంగా ఉంటే నెక్ట్స్‌ అని చూపిస్తుంది. దానిని నొక్కగానే ఆన్‌లైన్‌లో బిల్లు కనిపిస్తుంది.

చెల్లింపు సదుపాయం సైతం అందులో  ఉంటాయి. ఒకవేళ మీ కంటే ముందే సిబ్బంది వచ్చి మీటర్‌ రీడింగ్‌ తీసి ఉంటే? ఆ విషయం యాప్‌లో కనిపిస్తుంది. మీరే ముందు రీడింగ్‌ స్కాన్‌ చేసి బిల్లు తీసుకుంటే.. రీడింగ్‌ సిబ్బందికి ‘బిల్‌ జనరేటెడ్‌’ అని సమాచారం వెళుతుంది.

మరి సెల్ఫ్ బిల్లింగ్ ఎంటర్ చేయడం ఎలానో చూద్దాం…

APEPDCL యాప్ ఓపెన్ చేయగానే డాష్ బోర్డ్ పై కనబడే  సెల్ఫ్ రీడ్డింగ్ పై క్లిక్ చేయండి. సూచనలు కనబడతాయి.  నెక్స్ట్ అప్షన్ పై క్లిక్ చేయండి.

మీ ఇది వరకే రిజిస్టర్ చేసిన సర్వీస్ వివరాలలో, ఏ మీటర్ రీడింగ్ నమోదు చేయాలనుకుంటున్నారో ఆ మీటర్ నంబర్ సరిచూసుకొని Next బటన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు SCAN KWH పై క్లిక్ చేయండి…ఈ అప్షన్ పై క్లిక్ చేయడం ద్వారా మీరే స్వయంగా రీడ్డింగ్ తీసుకోవచ్చు. రీడ్డింగ్ తీసుకున్న తర్వాత మీటర్‌లోని KWH రీడ్డింగ్ స్కాన్ అవుతుంది.  రీడ్డింగ్ సరిచూసుకొని Submit పై క్లిక్ చేయడంతో ఈ ప్రక్రియను పూర్తి అవుతుంది. ఈ విధంగా Submit  చేసిన సెల్ఫ్ మీటర్ రీడ్డింగ్‌కు బిల్ మీ మొబైల్ కు SMS రూపంలో వస్తుంది.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this