LPG Customers: గ్యాస్‌ వినియోగదారులకు కేంద్రం గుడ్‌న్యూస్‌.....

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

AP Mandal Wise Surplus Teachers List 2026: Check District & Mandal Details

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మరియు ఉపాధ్యాయుల బదిలీలు (AP Teachers Transfers) లేదా...

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

సుప్రీంకోర్టు తీర్పు: టెట్ (TET) అర్హత గడువు 2028 వరకు పొడిగింపు | Supreme Court TET Verdict

సుప్రీంకోర్టు తీర్పు: ఉపాధ్యాయులకు టెట్ (TET) అర్హత గడువు పొడిగింపు ఉపాధ్యాయ అర్హత...

LPG Customers: గ్యాస్‌ వినియోగదారులకు కేంద్రం గుడ్‌న్యూస్‌.. భారీ ఊరట.. కొత్త సర్వీసులు అందుబాటులోకి..!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 LPG Customers: కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్‌పీజీ గ్యాస్‌ వినియోగదారులకు ఊరట కలిగించే ప్రకటన వెల్లడించింది. 

ఈ ప్రకటనతో చాలా మందికి ప్రయోజనం చేకూరనుంది. నచ్చిన డిస్ట్రిబ్యూటర్ నుంచి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. కేంద్రం ప్రకటనతో గ్యాస్‌ సిలిండర్‌ వాడే వారు తమకు నచ్చిన డిస్ట్రిబ్యూటర్‌ నుంచి గ్యాస్‌ సిలిండర్‌ను బుక్‌ చేసుకోవచ్చు. వినియోగదారుల ఇంటి అడ్రస్‌కు డెలివరీ సర్వీసు అందజేసే డిస్ట్రిబ్యూటర్లలో నచ్చిన డిస్ట్రిబ్యూటర్‌ను ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఈ సేవలను వినియోగదారులకు అందించనున్నాయి.

ప్రస్తుతం ఈ సర్వీసులు ఎక్కడెక్కడ అంటే..

ప్రస్తుతం ఈ సర్వీసులను కొన్ని ప్రాంతాల్లో ప్రారంభించింది కేంద్రం. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో పైలెట్‌ ప్రాజెక్టు కింద ప్రారంభిస్తున్నట్లు పెట్రోలియం శాఖ వెల్లడించింది. అవి ఎక్కడెక్కడ అంటే.. ఛండీఘర్, కోయంబత్తూరు, గురుగావ్, రాంచీలలో ఈ సేవలు పైలెట్ ప్రాజెక్ట్ కింద ప్రారంభించారు. ఇక త్వరలో దేశవ్యాప్తంగా ఈ సేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్ర సర్కార్‌ వెల్లడించింది.

డిస్ట్రిబ్యూటర్ల రేటింగ్‌..

అయితే వినియోగదారులు గ్యాస్‌ సిలిండర్‌ను మొబైల్‌ యాప్‌ లేదా వెబ్‌సైట్‌ ద్వారా బుకింగ్‌ చేసుకోవచ్చు. వారి ఇంటికి సిలిండర్‌ డెలివరీ చేసే డిస్ట్రిబ్యూటర్ల జాబితా కనిపిస్తుంది. వారి పనితీరు రేటింగ్‌ కూడా కనిపిస్తుంది. ఇందులో కస్టమర్లు వారికి నచ్చిన డిస్ట్రిబ్యూటర్‌ను ఎంచుకోవచ్చు. వారే మీ ఇంటికి సిలిండర్ డెలివరీ చేస్తారు. ఈ సేవల ద్వారా గ్యాస్‌ సిలిండర్‌ వినియోగదారులకు ఎంతో మేలు జరుగనుంది. మున్ముందు దేశంలోని మరిన్ని ప్రాంతాలకు ఈ సేవలను విస్తరించనుంది కేంద్రం.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this