Monday, February 16, 2026
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
Nadu Nedu: గడువులోగా ‘మనబడి నాడు-నేడు’ పనులు

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక తరగతుల కోసం సమగ్ర మార్గదర్శి

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి...

Nadu Nedu: గడువులోగా ‘మనబడి నాడు-నేడు’ పనులు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

  • టెన్త్, ఇంటర్ పరీక్షల టైం టేబుల్ తయారుచేయండి
  • సమీక్షలో మంత్రి ఆదిమూలపు సురేష్

Nadu Nedu: రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా చేపట్టిన ‘మనబడి నాడు-నేడు’ మొదటి విడత పనుల ను గడువులోగా పూర్తి చేసి రెండోవిడత పనులు ప్రారంభించాలని విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. మనబడి నాడు-నేడు, టెన్త్, ఇంటర్ పరీక్షల అంశంపై గురువారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నాడు-నేడు పనుల్లో ముఖ్యంగా ప్రహరీల నిర్మాణం తక్షణమే పూర్తిచేయాలని ఆదేశించారు. వివిధ దశల్లో ఉన్న వాటిని 20లోగా పూర్తిచేయాలన్నారు. 14,971 పాఠశాలల్లో పెయింటింగ్ పనులకు గాను 82 శాతం పూర్తిచేశారని.. మిగిలినవి కూడా పూర్తిచేయాలని సూచించారు. 2021-22 విద్యా సంవత్సరం కాలెండర్ను తయారు చేయాలన్నారు. జూలైలో టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించేందుకు పరిస్థితులు అనుకూలిస్తే అందుకు తగ్గట్టుగా టైం టేబుల్ తయారు చేసుకోవాలని సూచించారు. సమావేశంలో పాఠశాల విద్య ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్, డైరెక్టర్ చినవీరభద్రుడు, సమగ్రశిక్ష ఎస్పీడీ ఇంటర్ విద్య వి.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this