Higher Education: ఉన్నత విద్యలో ఏపీ ...

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

Higher Education: ఉన్నత విద్యలో ఏపీ భేష్‌

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

  • పలు రంగాల్లో టాప్‌ రాష్ట్రాల జాబితాలో ఏపీ
  • విద్యార్థుల చేరికలు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల సరసన చోటు
  • అత్యధిక ఉన్నత విద్యా సంస్థలు ఉన్న టాప్‌–8 రాష్ట్రాల్లో ఒకటిగా స్థానం
  • ప్రతి లక్ష మంది జనాభాకు ఏపీలో 51 కాలేజీలు
  • జాతీయస్థాయిలో ఉన్నత విద్యలో చేరికలు 3.85 కోట్లు
  • ఆలిండియా సర్వే ఆన్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ నివేదిక–2019–20లో వెల్లడి

Higher Education: ఉన్నత విద్యకు సంబంధించి పలు రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే టాప్‌ రాష్ట్రాల జాబితాలో నిలిచింది. ఆలిండియా సర్వే ఆన్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ (ఏఐఎస్‌హెచ్‌ఈ) 2019–20 నివేదికను కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌ గురువారం విడుదల చేశారు. ఇందులో ఏపీ పలు అంశాల్లో సత్తా చాటింది. దేశంలో అత్యధిక విద్యార్థుల చేరికలున్న టాప్‌ రాష్ట్రాల్లో ఒకటిగా, అలాగే అత్యధిక ఉన్నత విద్యా సంస్థలున్న టాప్‌–8 రాష్ట్రాల్లో ఒకటిగా ఆంధ్రప్రదేశ్‌ నిలిచింది. మన రాష్ట్రంలో ప్రతి లక్ష మంది జనాభాకు 51 కాలేజీలు ఉన్నాయని నివేదిక వెల్లడించింది. కాలేజీల సంఖ్య ప్రకారం.. ఏపీ పెద్ద రాష్ట్రాలను సైతం వెనక్కి నెట్టి దేశంలో ఐదో స్థానంలో నిలవడం విశేషం. ఏపీకంటే పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో ప్రతి లక్షమంది జనాభాకు ఉన్న కాలేజీల సంఖ్య కేవలం 31. అలాగే ఈ సంఖ్య మహారాష్ట్రలో 34, రాజస్థాన్‌లో 37 మాత్రమే కావడం గమనార్హం. కాలేజీల సంఖ్యా పరంగా ఆలిండియా యావరేజ్‌ 30 కాగా ఏపీలో 51 ఉండటం విశేషం. మన రాష్ట్రంలో ఏకంగా 2,750 కళాశాలలున్నాయి.  

ఏపీ జోరు ఇలా..

► దేశంలో మొత్తం విద్యార్థుల చేరికల్లో 54 శాతం ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఏపీల నుంచే ఉన్నాయని నివేదిక పేర్కొంది.

► విదేశీ విద్యార్థులను ఆకర్షిస్తున్న రాష్ట్రాల్లో కర్ణాటక (10,231) మొదటి స్థానంలో ఉండగా ఏపీ (2,094) 9వ స్థానం, తెలంగాణ (2,261) ఏడో స్థానంలో నిలిచాయి.

► దేశంలో టీచర్‌ ట్రైనింగ్‌ కోర్సుల్లో చేరిన అభ్యర్థులు 2.49 లక్షల మంది ఉండగా అందులో 55.4 శాతం మంది ఐదు రాష్ట్రాల్లోనే ఉన్నారు. 23,421 మందితో ఏపీ నాలుగో స్థానంలో ఉండడం విశేషం.

► దేశంలో గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో 27.1 శాతంగా ఉండగా.. ఎస్సీల శాతం 23.4, ఎస్టీల శాతం 18 ఉంది. గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియోలో మహిళలు 30 శాతానికి మించి ఉన్న రాష్ట్రాల్లో ఏపీ ముందు వరుసలో నిలిచింది.

జాతీయ స్థాయిలో ఇలా..

► జాతీయ స్థాయిలో 3.38 కోట్ల మంది విద్యార్థులు అండర్‌గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో చేరారు. వీరిలో 2.85 కోట్ల మంది (85 శాతం) ఆరు డిసిప్లిన్‌ కోర్సుల్లోనే చేరారు. వీరంతా హ్యుమానిటీస్, సైన్స్, కామర్స్, ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, మెడికల్‌ సైన్స్, ఐటీ అండ్‌ కంప్యూటర్‌ విభాగాల్లో ఉన్నారు.

► పీహెచ్‌డీ కోర్సులకు సంబంధించి 2014–15లో 1.17 లక్షల మంది విద్యార్థులు ఉండగా 2019–20లో 2.03 లక్షల మంది పీహెచ్‌డీలో చేరారు.

► దేశంలో 2019–20 నాటికి 15,03,156 మంది అధ్యాపకులుండగా వీరిలో 42.5 శాతం మంది మహిళలు.

► ఉన్నత విద్యలో 2019–20లో 3.85 కోట్ల మేర చేరికలున్నాయి. 2018–19లో ఈ సంఖ్య 3.74 కోట్లు మాత్రమే.

సర్వే జరిగింది ఇలా..

దేశవ్యాప్తంగా ఆయా విద్యా సంస్థలు సర్వేకు సమర్పించిన గణాంకాల ఆధారంగా ఈ నివేదికను కేంద్ర విద్యా శాఖ విడుదల చేసింది. దేశంలో 1,043 యూనివర్సిటీలు, 42,343 కాలేజీలు, 11,779 స్టాండ్‌ ఎలోన్‌ (ఒకే విభాగానికి సంబంధించిన కోర్సులను అందించేవి) విద్యాసంస్థలున్న సంగతి తెలిసిందే. వీటిలో 1,019 యూనివర్సిటీలు, 39,955 కాలేజీలు, 9,599 స్టాండ్‌ ఎలోన్‌ సంస్థలు సర్వేకు గణాంకాలను సమర్పించాయి. తక్కినవి స్పందించలేదు. దేశంలో ఉన్నత విద్యా రంగం గత ఐదేళ్లలో (2015–16 నుంచి 2019–20 వరకు) ఏ మేరకు ఉన్నత ప్రమాణాలు, వృద్ధి రేటు సాధించిందో గణాంకాలతో సహా నివేదిక విశ్లేషించింది. ఉన్నత విద్యలో విద్యార్థుల చేరికలు 2015–16 నుంచి 2019–20 మధ్య 11.4 శాతం మేర పెరిగాయి. ఇందులో మహిళల చేరికలు 18.2 శాతం పెరగడం విశేషం.  


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this