Ban: ఆ సబ్బులు, షాంపూలు, డిటర్జెంట్లపై నిషేధం.....

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

సుప్రీంకోర్టు తీర్పు: టెట్ (TET) అర్హత గడువు 2028 వరకు పొడిగింపు | Supreme Court TET Verdict

సుప్రీంకోర్టు తీర్పు: ఉపాధ్యాయులకు టెట్ (TET) అర్హత గడువు పొడిగింపు ఉపాధ్యాయ అర్హత...

Thalliki Vandanam Scheme 2026-27: డేటా పరిశీలనలో ఈ 5 పొరపాట్లు చేయకండి!

Thalliki Vandanam Scheme 2026-27 డేటా పరిశీలనపై పూర్తి వివరాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

SSC Memo Download 2026: AP SSC Short Memos Available Online at BSE.AP.GOV.IN

ఆంధ్రప్రదేశ్ మాధ్యమిక విద్యా బోర్డు విడుదల చేసిన SSC Memo Download...

Ban: ఆ సబ్బులు, షాంపూలు, డిటర్జెంట్లపై నిషేధం.. వాడితే కఠిన చర్యలే

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Ban: కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఇవాళ ఔను అన్నవి రేపు కాదు అనే పరిస్థితి వస్తుంది. ఇప్పటివరకూ అందరూ వాడిన ఆ సబ్బులు, షాంపూలు, డిజర్జెంట్లూ ఇక వాడొద్దనే ఆదేశం రావడంతో… ప్రజలు అప్రమత్తం అవుతున్నారు.

కరోనా లాక్‌డౌన్ నుంచి సోమవారం చాలా వరకూ మినహాయింపులు ఇచ్చి… అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభించిన ఢిల్లీ ప్రభుత్వం… అదే సమయంలో ఆ సబ్బులు, షాంపూలు, డిజర్జెంట్లను వాడొద్దంటూ… వాటిపై నిషేధం విధించింది. వేటికైతే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) నిర్దేశించిన ప్రమాణాలు ఉండవో… ఇకపై వాటిని ఢిల్లీ ప్రజలు స్టోర్ చెయ్యడానికీ, రవాణా చెయ్యడానికీ, అమ్మడానికీ, కొనడానికీ, వాడటానికీ వీలు లేదు. సడెన్‌గా ఈ నిర్ణయం ఎందుకంటే… యమునా నదిలో కాలుష్యాన్ని తగ్గించేందుకే. తాజ్ మహల్ పక్కన ఎంతో అందంగా ఒదిగిపోయే మమునా నది… ఇప్పుడు పొల్యూషన్‌తో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. నది ప్రక్షాళన పేరుకే తప్ప… కార్యరూపం దాల్చట్లేదు. 

యమునా నదిని బాగుచెయ్యాలంటే ఏం చెయ్యాలి అనే అంశంపై యమునా మానిటరింగ్ కమిటీ (YMC) ఒకటి ఏర్పడి… కొన్ని ప్రతిపాదనలు చేసింది. వాటిని జనవరిలో జాతీయ హరిత ట్రిబ్యునల్ (NGT) ఆమోదించింది. ఇలా ఆదేశాలు జారీ చెయ్యండి అని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. NGT చెప్పాక… కేజ్రీవాల్ సర్కార్ మాత్రం ఏం చేస్తుంది… సరే అంటూ… ఈ కొత్త ఆదేశం జారీ చేసింది. “సరికొత్త BIS ప్రమాణాలను నిర్ధారించని సబ్బులు, షాంపులు, డిజర్టెంట్ల అమ్మకం, స్టోరేజ్, రవాణా, మార్కెటింగ్‌ను నిషేధిస్తున్నాం” అని తెలిపింది. రవాణా లేదు కాబట్టి… ఇక వాడకమూ ఉండదు.

BIS ప్రమాణాలతో లేని బాతింగ్ సబ్బులు, బట్టల సబ్బులను వాడితే ఎంత ప్రమాదమో ప్రజలకు అవగాహన కలిగించేందుకు క్యాంపెయిన్లు పెట్టండి అని NGT ఆదేశించడంతో… కేజ్రీ సర్కారుకు అమలు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది.

ఇక ఇప్పుడు సిటీలోని స్థానిక సంస్థల సిబ్బంది, సివిల్ సప్లై అధికారులు, జిల్లా యంత్రాంగం… షాపులకు వెళ్లి ఆకశ్మిక తనిఖీలు చెయ్యాల్సి ఉంది. గోడౌన్లకు వెళ్లి పరిశీలించాల్సి ఉంది. ఎక్కడైనా తేడా కనిపిస్తే… యాక్షన్ తీసుకోలవాల్సి ఉంటుంది. తరచూ ఆకస్మిక తనిఖీలు చెయ్యాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనిపై అందరూ ఫోకస్‌గా ఉండాలి అని ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీ (DPCC) సోమవారం తన ఆదేశంలో చెప్పింది.

ప్రతి నెలా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో రిపోర్ట్ ఇవ్వాలని DPCC కోరింది. దాన్ని బట్టీ నెక్ట్స్ ఏం చెయ్యాలో డిసైడ్ చేయనుంది. యమునా నది కాలుష్య బరితం అవ్వడానికి సబ్బులు, షాంపులు, సర్ఫులు, డిటర్జెంట్లే ఎక్కువ కారణం అని నిపుణుల బృందం తెలిపింది. చాలా సందర్భాల్లో నది నీటిపై నురగలు వస్తున్నాయి. అలాంటి దృశ్యాలు సోషల్ మీడియాలో ఎన్నో.

నదిలో పాస్ఫేట్ ఎక్కువగా ఉండటం వల్లే నురగలు వస్తాయి. డైయింగ్ పరిశ్రమలు, ధోబీ ఘాట్లు, ఇళ్లలో వాడే సబ్బుల్లో ఉండే పాస్ఫేట్ నదిలోకి చేరుతోందని ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (DPCB) తెలిపింది. ఢిల్లీలో ప్రమాణాలతో తయారుచేయని సబ్బులు, డిటర్జెంట్లూ చాలా ఉన్నాయి. ఐతే… పరిశ్రమల నుంచి కూడా పెద్ద ఎత్తున కాలుష్య వ్యర్థాలు యమునా నదిలో కలుస్తున్నాయి. కరోనా సమయంలో వందల కొద్దీ శవాలను యమునా నదిలో పడేశారు. ఇలా నదిని ఎన్ని రకాలుగా నాశనం చెయ్యవచ్చో… అన్ని రకాలుగా నాశనం చేస్తున్నారు. అందువల్లే యమునా ప్రక్షాళన కలగా మిగిలిపోతోంది.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this