హైదరాబాద్: తెలంగాణలో ఈ నెల 20 వరకు స్కూళ్లకు వేసవి సెలవులను ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, ప్రస్తుతం తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ప్రభుత్వం.. కరోనా రెండో వేవ్ నియంత్రణ కోసం రాష్ట్రంలో విధించిన లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ, పలు సడలింపులు ఇచ్చింది. ఈ నెల 19 వరకు లాక్‌డౌన్ అమలులో ఉంది. సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు లాక్‌డౌన్ అమలవుతోంది.
ప్రస్తుత కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ మీడియట్ రెండవ సంవత్సరం పరీక్షలను కూడా రద్దు చేసింది. మొదటి సంవత్సరం విద్యార్థులను సెకండ్ ఇయర్‌కు ప్రమోట్ చేసింది. ఈ మేరకు సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)
-
సమాచార ఖచ్చితత్వం:
ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి. -
సమాచార ఉపయోగం:
ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. -
లింక్‌లు & బాహ్య సైట్‌లు:
ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము. -
కాపీరైట్ & స్వామిత్వం:
ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం. -
సవాళ్లు & స్పందన:
ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.